[1] 'గులువ్వున్: అంటే అతిగా ప్రవర్తించటం. అంటే ఇక్కడ క్రైస్తవులు 'ఈసా ('అ.స.)కు మరియు అతని తల్లికి అంట గట్టిన స్థానం. వారు ఆ ఇద్దరికి దైవత్వపు స్థానం అంట గట్టి వారిని ఆరాధించసాగారు. చూడండి, 9:31. [2] కలిమతుల్లాహ్: అల్లాహ్ (సు.తా.) యొక్క మాట, పదం, సంకేతం, ఉత్తరువు లేక ఆజ్ఞ. అంటే అల్లాహుతా'ఆలా ఏదైనా చేయదలుచుకుంటే దానిని : "అయిపో" (కున్)! అని ఆజ్ఞాపిస్తాడు, అంతే అది అయిపోతుంది (ఫ యకూన్). చూడండి, 3:45. [3] క్రైస్తవులలో కొందరు 'ఈసా ('అ.స.) స్వయంగా దేవుడే అంటారు. మరికొందరు అతనిని దేవుని కుమారుడు అని అంటారు. ఇంకా కొందరు ముగ్గురు దైవాలున్నారంటారు. ఆ ముగ్గురు అల్లాహ్ (సు.తా.), జిబ్రీల్ మరియు 'ఈసా ('అలైహిమ్ స.) అని అంటారు. ఇది మానుకనండని అల్లాహుతా'ఆలా ఆజ్ఞాపిస్తున్నాడు.
[1] చూడండి, 40:60.