[1] రక్తపరిహారపు పరిమాణం దైవప్రవక్త ('స'అస) కాలంలో, 100 ఒంటెలుగా నిర్ణయించడం జరిగింది. ఇది పొరపాటుగా జరిగిన హత్యకు మాత్రమే వర్తిస్తుంది.
[1] హత్య మూడు రకాలు: 1) ఖత్లె - 'అమద్: అంటే బుద్ధిపూర్వకంగా హత్య చేయడం. దాని శిక్ష ఇక్కడ చెప్పబడింది. ఇహలోకంలో మరణశాసనం, మరియు పరలోకంలో నరకం. 2) ఖత్లె - 'ఖ'తా: పొరపాటు వ్ల, అనుకోని విధంగా జరిగిన హత్య. దీని విషయం ఇంతకు ముందు 92 ఆయత్ లో వచ్చింది. 3) ఖత్లె - షుబ్హ్ 'అమద్: దీని వివరాలు 'హదీస్' లలో పేర్కొనబడ్డియి.
[1] ఒకసారి కొందరు 'స'హాబీలు జిహాద్ కొరకు పోతుంటారు. దారిలో ఒక పశువుల కాపరి వారిని చూసి సలామ్ చేస్తాడు. వారు అతడు విశ్వాసికాడు, కేవలం తన ప్రాణాలను కాపాడుకోవటానికే - తాను ముస్లింనని తెలుపటానికి - సలాం చేశాడని భావించి, అతనిని చంపి, అతని పశువులను, మాలె 'గనీమత్ గా దైవప్రవక్త ('స'అస) దగ్గరికి తెస్తారు. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ('స. బు'ఖారీ, తిర్మిజీ').