[1] కలాల అంటే సూటీ (రక్త) సంబంధీకులు లేని మృతుడు అంటే తండ్రి గానీ, కుమారుడు గానీ లేని మృతుడు. కొడుకు లేని పక్షంలో కొడుకు కొడుకు(లు) సూటి వారసులుగా పరిగణించబడతారు. (ఇజ్మా'అ, ఇబ్నె-కసీ'ర్). కుమారుడు ఒక్కడే ఉన్నా పూర్తి ఆస్తికి వారసుడు. మరియు తండ్రి ఒక్కడే ఉన్నా అతను కూడా పూర్తి ఆస్తికి వారసుడు. అప్పుడు మృతుని సోదర సోదరీమణులకు హక్కు ఉండదు. కాని భార్య లేక భర్త మరియు తల్లి ఉంటే వారి భాగం వారికి ఇచ్చిన తరువాత. కుమార్తె మరియు సోదరీ ఉంటే, కుమార్తెకు సగం, సోదరికి సగం. సోదరుడు ఒక్కడే ఉంటే అతడు తన సోదరి పూర్తి ఆస్తికి వారసుడౌతాడు. కాని మృతురాలు భర్త ఉంటే అతని భాగం ఇచ్చి మిగతా ఆస్తికి సోదరుడు వారసుడౌతాడు. [2] సోదరీ అంటే ఇక్కడ సొంత అనగా, తల్లి-తండ్రి ఇరువురి నుండి, లేక కేవలం తండ్రి నుండి గానీ ఉంటే ఆమెకు అతను వదిలిన ఆస్తిలో సగం భాగం ఉంటుంది. ఇంకా చూడండి, 4:12, అక్కడ ఇజ్మా'అ, అభిప్రాయం ఏమిటంటే అక్కడ కేవలం తల్లి వైపు నుండి (అర్థ) సోదర సోదరీమణుల విషయం చెప్పబడింది. ఎక్కువ వివరాల కొరకు ధర్మవేత్త(ఫుఖహా)లను సంప్రదించండి.