[1] ఇక్కడ ఉ'హుద్ యుద్ధానికి బయలుదేరి కొంతదూరం పోయిన తరువాత వెనుదిరిగి పోయిన 300 మంది కపటవిశ్వాసుల విషయం చెప్పబడింది. వారి నాయకుడు 'అబ్దుల్లాహ్ బిన్ ఉబై. [2] ఎవరైతే తమ సత్యతిరస్కారం మరియు ముఢనమ్మకం వలన మార్గభ్రష్టత్వంలో పడి పోయారో మరియు అల్లాహుతా'ఆలా ప్రసాదించిన వివేకాన్ని ఉపయోగించుకొని, సత్యాన్ని సన్మార్గాన్ని, అనుసరించగోరారో! అలాంటి వారినే అల్లాహ్ (సు.తా.) మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడు. ఎందుకంటే, అల్లాహుతా'ఆలాకు గడచిందీ మరియు ముందు జరగబోయేదీ, అంతా తెలుసు. అల్లాహ్ (సు.తా.) ఎవ్వరినీ బలవంతంగా మార్గభ్రష్టత్వంలో పడవేయడు. అలాంటి వారికి ఎవ్వరూ, సన్మార్గం చూపలేరు. ఈ విధమైన ఆయత్ ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. వ్యాఖ్యాతలందరూ దీనికి ఇదే విధంగా తాత్పర్యమిచ్చారు.