クルアーンの対訳 - テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

ページ番号:close

external-link copy
60 : 4

اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ یَزْعُمُوْنَ اَنَّهُمْ اٰمَنُوْا بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ یُرِیْدُوْنَ اَنْ یَّتَحَاكَمُوْۤا اِلَی الطَّاغُوْتِ وَقَدْ اُمِرُوْۤا اَنْ یَّكْفُرُوْا بِهٖ ؕ— وَیُرِیْدُ الشَّیْطٰنُ اَنْ یُّضِلَّهُمْ ضَلٰلًا بَعِیْدًا ۟

(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడలేదా)? తిరస్కరించండని ఆదేశింపబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు తాగూత్[1] వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని, త్రోవ తప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు. info

[1] 'తా'గూత్ కు చూడండి, 2:256 వ్యాఖ్యానం 3.

التفاسير:

external-link copy
61 : 4

وَاِذَا قِیْلَ لَهُمْ تَعَالَوْا اِلٰی مَاۤ اَنْزَلَ اللّٰهُ وَاِلَی الرَّسُوْلِ رَاَیْتَ الْمُنٰفِقِیْنَ یَصُدُّوْنَ عَنْكَ صُدُوْدًا ۟ۚ

మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన వాటి (ఆదేశాల) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని చెప్పినపుడు, నీవు ఆ కపట విశ్వాసులను విముఖులై (నీ వైపునకు రాకుండా) తొలిగి పోవటాన్ని చూస్తావు! info
التفاسير:

external-link copy
62 : 4

فَكَیْفَ اِذَاۤ اَصَابَتْهُمْ مُّصِیْبَةٌ بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ثُمَّ جَآءُوْكَ یَحْلِفُوْنَ ۖۗ— بِاللّٰهِ اِنْ اَرَدْنَاۤ اِلَّاۤ اِحْسَانًا وَّتَوْفِیْقًا ۟

అయితే వారు తమ చేతులారా చేసుకున్న (దుష్కార్యాల) ఫలితంగా వారికి బాధ కలిగినపుడు, వారు నీ దగ్గరకు వచ్చి అల్లాహ్ పేర ప్రమాణాలు చేస్తూ: "మేము మేలు చేయాలనీ మరియు ఐకమత్యం చేకూర్చాలనీ మాత్రమే ప్రయత్నించాము." అని అంటారు.[1] info

[1] చూడండి, 2:10-11.

التفاسير:

external-link copy
63 : 4

اُولٰٓىِٕكَ الَّذِیْنَ یَعْلَمُ اللّٰهُ مَا فِیْ قُلُوْبِهِمْ ۗ— فَاَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُلْ لَّهُمْ فِیْۤ اَنْفُسِهِمْ قَوْلًا بَلِیْغًا ۟

అలాంటి వారినీ (కపట విశ్వాసులనూ) ! వారి హృదయాలలో ఉన్నదీ అల్లాహ్ ఎరుగును, కావున వారి నుండి ముఖం త్రిప్పుకో, వారికి ఉపదేశం చెయ్యి మరియు వారిని గురించి వారి హృదయాలు ప్రభావితమయ్యే మాట పలుకు. info
التفاسير:

external-link copy
64 : 4

وَمَاۤ اَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ اِلَّا لِیُطَاعَ بِاِذْنِ اللّٰهِ ؕ— وَلَوْ اَنَّهُمْ اِذْ ظَّلَمُوْۤا اَنْفُسَهُمْ جَآءُوْكَ فَاسْتَغْفَرُوا اللّٰهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُوْلُ لَوَجَدُوا اللّٰهَ تَوَّابًا رَّحِیْمًا ۟

మరియు మేము ఏ ప్రవక్తను పంపినా - అల్లాహ్ అనుజ్ఞతో - (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము. మరియు ఒకవేళ వారు తమకు తాము అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి వారు అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరినప్పుడు - ప్రవక్త కూడా వారికై అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కొరకు వేడుకున్నప్పుడు - వారు అల్లాహ్ ను నిశ్చయంగా, క్షమించేవాడు గానూ మరియు కరుణాప్రదాత గానూ పొందుతారు. info
التفاسير:

external-link copy
65 : 4

فَلَا وَرَبِّكَ لَا یُؤْمِنُوْنَ حَتّٰی یُحَكِّمُوْكَ فِیْمَا شَجَرَ بَیْنَهُمْ ثُمَّ لَا یَجِدُوْا فِیْۤ اَنْفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَیْتَ وَیُسَلِّمُوْا تَسْلِیْمًا ۟

అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు![1] info

[1] 'జుబైర్ (ర'ది.'అ.) దైవప్రవక్త ('స'అస) యొక్క తండ్రి సోదరీమణి (మేనత్త) కుమారులు. అతను ఒకసారి చేనుకు నీరు ప్రవహించే కాలువ గురించి ఒక విశ్వాసితో పోట్లాడుతారు. వారిద్దరూ దైవప్రవక్త ('స'అస) దగ్గరకు తీర్పు కోసం వస్తారు. అతను న్యాయంగా 'జుబైర్ (ర'ది.'అ.) పక్షాన తీర్పు చేయగా, ఆ రెండో వ్యక్తి అంగీకరించడు. పైగా అతడు: 'జుబైర్ (ర'ది.'అ.) మీ బంధువు కాబట్టి, అతని పక్షాన తీర్పు చేశారు, అని అంటాడు. ఆ సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. 'స, బు'ఖారీ, సూరహ్ అన్-నిసాఅ' (4), వ్యాఖ్యానం.

التفاسير: