[1] యూదులు దైవప్రవక్త ('స'అస)ను వినినప్పుడు, ఎగతాళి చేస్తూ ఇలా అనేవారు: సమి'అనా వ 'అ'సయ్ నా. "మేము నీ మాటను విన్నాము." అని బిగ్గరగా అని తరువాత ముఖం త్రిప్పుకొని గాని, లేక మెల్లగా గాని కొన్నిసార్లు ఎగతాళిగా గానీ అతని ('స'అస) ముఖం మీద కూడా "ఉల్లంఘించాము," అని అనేవారు. అదే విధంగా: వస్ మ'అ 'గైర మస్ మ'ఇన్. అంటే - "విను! నీ మాట వినకుండాబోవు గాక!" లేక "నీ మాట అంగీకరించబడక పోవు గాక!" అని శపించేవారు. ఇంకా చూడండి, 2:93. [2] రా'ఇనా : కొరకు చూడండి 2:104.
[1] చూడండి, 2:65, 7:163 - 166. ఇంకా చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 1, అధ్యాయం - 240.
[1] అల్లాహ్ (సు.తా.)కు సాటి (భాగస్వాములను) కల్పించటం మహా దుర్మార్గం మరియు క్షమించరాని పాపం. కావున ఇది ఎంత మాత్రం క్షమించబడదు. ముష్రికులకు స్వర్గం నిషేధించబడింది. ఇంకా చూడడిం, 31:13. నిశ్చయంగా, బహుదైవారాధన (షిర్క్) గొప్ప దుర్మార్గం, ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 551).
[1] చూడండి, 9:31. [2] చూడండి, 53:32. [3] ఫతీల: ఖర్జూర బీజపు చీలికలోని పొర. సన్నని దారమంత లేక రవ్వంత అని అర్థం.
[1] జిబ్త్: అంటే అసలు అర్థం అసత్యమైనది, ఆధారం లేనిది, నిరుపయోగమైనది. ఇస్లాం పరిభాషలో మంత్ర తంత్రాలు, జ్యోతిషం, భూతవైద్యం, శకునాలు, ముహూర్తాలు మరియు ఊహాపోహలకు సంబంధించిన అన్ని విషయాలను జిబ్త్ తో పోల్చవచ్చు. [2] 'తా'గూత్: చూడండి, 2:256 వ్యాఖ్యానం 3. 'తా'గూత్ అంటే షై'తాన్ అని కూడ అర్థం. ఎందుకంటే కల్పిత దైవాలను ఆరాధించటం షై'తాన్ ను అనుసరించటమే. కావున షై'తాన్ కూడా 'తా'గూత్ లలో చేరుతాడు.