クルアーンの対訳 - テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

ページ番号:close

external-link copy
114 : 4

لَا خَیْرَ فِیْ كَثِیْرٍ مِّنْ نَّجْوٰىهُمْ اِلَّا مَنْ اَمَرَ بِصَدَقَةٍ اَوْ مَعْرُوْفٍ اَوْ اِصْلَاحٍ بَیْنَ النَّاسِ ؕ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ فَسَوْفَ نُؤْتِیْهِ اَجْرًا عَظِیْمًا ۟

వారు చేసే రహస్య సమావేశాలలో చాలా మట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దానధర్మాలు చేయటానికి, సత్కార్యాలు (మ'అరూఫ్) చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చటానికి (సమాలోచనలు) చేస్తే తప్ప! ఎవడు అల్లాహ్ ప్రీతి కొరకు ఇలాంటి పనులు చేస్తాడో, అతనికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. info
التفاسير:

external-link copy
115 : 4

وَمَنْ یُّشَاقِقِ الرَّسُوْلَ مِنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُ الْهُدٰی وَیَتَّبِعْ غَیْرَ سَبِیْلِ الْمُؤْمِنِیْنَ نُوَلِّهٖ مَا تَوَلّٰی وَنُصْلِهٖ جَهَنَّمَ ؕ— وَسَآءَتْ مَصِیْرًا ۟۠

మరియు తనకు సన్మార్గం స్పష్టంగా తెలిసిన పిదప కూడా, ఎవడు ప్రవక్తకు వ్యతిరేకంగా పోయి విశ్వాసుల మార్గం గాక వేరే మార్గాన్ని అనుసరిస్తాడో! అతడు అవలంబించిన త్రోవ వైపునకే, అతనిని మరల్చుతాము మరియు వానిని నరకంలో కాల్చుతాము. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం.[1] info

[1] చూడండి, 3:85.

التفاسير:

external-link copy
116 : 4

اِنَّ اللّٰهَ لَا یَغْفِرُ اَنْ یُّشْرَكَ بِهٖ وَیَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ یَّشَآءُ ؕ— وَمَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدْ ضَلَّ ضَلٰلًا بَعِیْدًا ۟

నిశ్చయంగా, అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని (షిర్క్ ను) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి (ఇతర ఏ పాపాన్నైనా) తాను కోరిన వానికి క్షమిస్తాడు! అల్లాహ్ తో భాగస్వాములను కల్పించేవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే! info
التفاسير:

external-link copy
117 : 4

اِنْ یَّدْعُوْنَ مِنْ دُوْنِهٖۤ اِلَّاۤ اِنٰثًا ۚ— وَاِنْ یَّدْعُوْنَ اِلَّا شَیْطٰنًا مَّرِیْدًا ۟ۙ

ఆయన (అల్లాహ్) ను వదలి, వారు స్త్రీ (దేవత) లను ప్రార్థిస్తున్నారు[1]. మరియు వారు కేవలం తిరుగుబాటుదారుడైన షైతాన్ నే ప్రార్థిస్తున్నారు. [2] info

[1] స్త్రీ దేవతలు అంటే, ఇక్కడ ముష్రిక్ ఖురైషులు పూజించే స్త్రీ విగ్రహాలు ఉదా: " 'లాత్, 'ఉ'జ్జా, మనాత్ మరియు నాఇ'ల" మొదలైనవి. లేక దైవదూతలు ఎందుకంటే వారు దైవదూతలను అల్లాహ్ (సు.తా.) యొక్క కుమార్తెలగా భావించి, వారి ఆరాధన చేసేవారు. [2] పైన పేర్కొన్న వాటి ఆరాధన కేవలం షై'తాన్ ఆరాధనయే. ఎందుకంటే షై'తానే మానవుణ్ణి అల్లాహ్ (సు.తా.) మార్గం నుండి మళ్ళించి బూటక దైవాలను ఆరాధించటాన్ని ప్రోత్సహిస్తాడు.

التفاسير:

external-link copy
118 : 4

لَّعَنَهُ اللّٰهُ ۘ— وَقَالَ لَاَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِیْبًا مَّفْرُوْضًا ۟ۙ

అల్లాహ్ అతన్ని శపించాడు (బహిష్కరించాడు). మరియు అతడు (షైతాన్) ఇలా అన్నాడు: "నేను నిశ్చయంగా, నీ దాసులలో నుండి ఒక నియమిత భాగాన్ని తీసుకుంటాను." info
التفاسير:

external-link copy
119 : 4

وَّلَاُضِلَّنَّهُمْ وَلَاُمَنِّیَنَّهُمْ وَلَاٰمُرَنَّهُمْ فَلَیُبَتِّكُنَّ اٰذَانَ الْاَنْعَامِ وَلَاٰمُرَنَّهُمْ فَلَیُغَیِّرُنَّ خَلْقَ اللّٰهِ ؕ— وَمَنْ یَّتَّخِذِ الشَّیْطٰنَ وَلِیًّا مِّنْ دُوْنِ اللّٰهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِیْنًا ۟ؕ

"మరియు నిశ్చయంగా, నేను వారిని మార్గభ్రష్టులుగా చేస్తాను; మరియు వారికి తప్పక తప్పుడు ఆశలు కలిగిస్తాను; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక పశువుల చెవులను చీల్చుతారు; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక అల్లాహ్ సృష్టిలో మార్పులు చేస్తారు.[1] మరియు ఎవడు అల్లాహ్ కు బదులుగా షైతాన్ ను తన రక్షకునిగా చేసుకుంటాడో! వాస్తవానికి వాడే స్పష్టమైన నష్టానికి గురి అయిన వాడు! info

[1] ఇక్కడ అల్లాహ్ (సు.తా.) సృష్టిలో మార్పులు అంటే; పశువుల చెవులను ప్రత్యేక దైవాల పేర, ప్రత్యేక రకంగా కోసి విడవడమే కాక మానవులు కూడా అందాన్ని హెచ్చించటానికి పచ్చబొట్టు వేయించుకోవటం, మరియు కనుబొమ్మల వెంట్రుకలను కత్తిరించుకోవటం, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవటం, మరియు ట్యుబెక్టమీ మరుయ వాసెక్టమీ చేయించుకొని అల్లాహుతా'ఆలా సృష్టిలో మార్పులు తెచ్చుటకు ప్రయత్నించడం కూడాను. దైవప్రవక్త (స'అస) సంప్రదాయం వల్ల తెలిసిందేమిటంటే పశువులకు ఖస్సీ చేయటం ధర్మసమ్మతమే. ఎందుకంటే దైవప్రవక్త ('స'అస) ఖస్సీ చేసిన పశువుల బలి (ఖుర్బానీ) చేశారు.

التفاسير:

external-link copy
120 : 4

یَعِدُهُمْ وَیُمَنِّیْهِمْ ؕ— وَمَا یَعِدُهُمُ الشَّیْطٰنُ اِلَّا غُرُوْرًا ۟

అతడు (షైతాన్) వారికి వాగ్దానం చేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని, షైతాన్ వారికి చేసే వాగ్దానాలు మోసపుచ్చేవి మాత్రమే. info
التفاسير:

external-link copy
121 : 4

اُولٰٓىِٕكَ مَاْوٰىهُمْ جَهَنَّمُ ؗ— وَلَا یَجِدُوْنَ عَنْهَا مَحِیْصًا ۟

అలాంటి వారి ఆశ్రయం నరకమే; మరియు వారికి దాని నుండి తప్పించుకునే మార్గమే ఉండదు. info
التفاسير: