Kilniojo Korano reikšmių vertimas - Vertimas į telugų k. - Abdur-Rahim Bin Muchamed

Puslapio numeris:close

external-link copy
87 : 4

اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— لَیَجْمَعَنَّكُمْ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ لَا رَیْبَ فِیْهِ ؕ— وَمَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ حَدِیْثًا ۟۠

అల్లాహ్! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశ పరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది? info
التفاسير:

external-link copy
88 : 4

فَمَا لَكُمْ فِی الْمُنٰفِقِیْنَ فِئَتَیْنِ وَاللّٰهُ اَرْكَسَهُمْ بِمَا كَسَبُوْا ؕ— اَتُرِیْدُوْنَ اَنْ تَهْدُوْا مَنْ اَضَلَّ اللّٰهُ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ سَبِیْلًا ۟

(ఓ విశ్వాసులారా!) మీకేమయింది, కపట విశ్వాసుల విషయంలో మీరు రెండు వర్గాలుగా చీలిపోయారు.[1] అల్లాహ్ వారి కర్మల ఫలితంగా, వారిని వారి పూర్వ (అవిశ్వాస) స్థితికి మరలించాడు. ఏమీ? అల్లాహ్ మార్గభ్రష్టులుగా చేసిన వారికి మీరు సన్మార్గం చూపదలచారా? వాస్తవానికి, అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేసిన వానికి నీవు (ఋజు) మార్గం చూప లేవు.[2] info

[1] ఇక్కడ ఉ'హుద్ యుద్ధానికి బయలుదేరి కొంతదూరం పోయిన తరువాత వెనుదిరిగి పోయిన 300 మంది కపటవిశ్వాసుల విషయం చెప్పబడింది. వారి నాయకుడు 'అబ్దుల్లాహ్ బిన్ ఉబై. [2] ఎవరైతే తమ సత్యతిరస్కారం మరియు ముఢనమ్మకం వలన మార్గభ్రష్టత్వంలో పడి పోయారో మరియు అల్లాహుతా'ఆలా ప్రసాదించిన వివేకాన్ని ఉపయోగించుకొని, సత్యాన్ని సన్మార్గాన్ని, అనుసరించగోరారో! అలాంటి వారినే అల్లాహ్ (సు.తా.) మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడు. ఎందుకంటే, అల్లాహుతా'ఆలాకు గడచిందీ మరియు ముందు జరగబోయేదీ, అంతా తెలుసు. అల్లాహ్ (సు.తా.) ఎవ్వరినీ బలవంతంగా మార్గభ్రష్టత్వంలో పడవేయడు. అలాంటి వారికి ఎవ్వరూ, సన్మార్గం చూపలేరు. ఈ విధమైన ఆయత్ ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. వ్యాఖ్యాతలందరూ దీనికి ఇదే విధంగా తాత్పర్యమిచ్చారు.

التفاسير:

external-link copy
89 : 4

وَدُّوْا لَوْ تَكْفُرُوْنَ كَمَا كَفَرُوْا فَتَكُوْنُوْنَ سَوَآءً فَلَا تَتَّخِذُوْا مِنْهُمْ اَوْلِیَآءَ حَتّٰی یُهَاجِرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ— فَاِنْ تَوَلَّوْا فَخُذُوْهُمْ وَاقْتُلُوْهُمْ حَیْثُ وَجَدْتُّمُوْهُمْ ۪— وَلَا تَتَّخِذُوْا مِنْهُمْ وَلِیًّا وَّلَا نَصِیْرًا ۟ۙ

మరియు వారు సత్యతిరస్కారులైనట్లే మీరు కూడా సత్యతిరస్కారులై, వారితో సమానులై పోవాలని వారు కోరుతున్నారు. కావున అల్లాహ్ మార్గంలో వారు వలస పోనంత వరకు (హిజ్రత్ చేయనంత వరకు), వారిలో ఎవ్వరినీ మీరు స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు వెను దిరిగితే, మీరు వారిని ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకొని వధించండి. మరియు వారిలో ఎవ్వరినీ మీ స్నేహితులుగా, సహాయకులుగా చేసుకోకండి. info
التفاسير:

external-link copy
90 : 4

اِلَّا الَّذِیْنَ یَصِلُوْنَ اِلٰی قَوْمٍ بَیْنَكُمْ وَبَیْنَهُمْ مِّیْثَاقٌ اَوْ جَآءُوْكُمْ حَصِرَتْ صُدُوْرُهُمْ اَنْ یُّقَاتِلُوْكُمْ اَوْ یُقَاتِلُوْا قَوْمَهُمْ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَسَلَّطَهُمْ عَلَیْكُمْ فَلَقٰتَلُوْكُمْ ۚ— فَاِنِ اعْتَزَلُوْكُمْ فَلَمْ یُقَاتِلُوْكُمْ وَاَلْقَوْا اِلَیْكُمُ السَّلَمَ ۙ— فَمَا جَعَلَ اللّٰهُ لَكُمْ عَلَیْهِمْ سَبِیْلًا ۟

కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటి వారితో కలసి పోయిన వారు గానీ, లేదా ఎవరైతే తమ హృదయాలలో మీతో గానీ, లేక తమ జాతి వారితో గానీ యుద్ధం చేయటానికి సంకట పడుతూ మీ వద్దకు వస్తారో అలాంటి వారిని గానీ, (మీరు వధించకండి). మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుద్ధం చేయక, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే (వారిపై దాడి చేయటానికి) అల్లాహ్ మీకు దారి చూపలేదు. info
التفاسير:

external-link copy
91 : 4

سَتَجِدُوْنَ اٰخَرِیْنَ یُرِیْدُوْنَ اَنْ یَّاْمَنُوْكُمْ وَیَاْمَنُوْا قَوْمَهُمْ ؕ— كُلَّ مَا رُدُّوْۤا اِلَی الْفِتْنَةِ اُرْكِسُوْا فِیْهَا ۚ— فَاِنْ لَّمْ یَعْتَزِلُوْكُمْ وَیُلْقُوْۤا اِلَیْكُمُ السَّلَمَ وَیَكُفُّوْۤا اَیْدِیَهُمْ فَخُذُوْهُمْ وَاقْتُلُوْهُمْ حَیْثُ ثَقِفْتُمُوْهُمْ ؕ— وَاُولٰٓىِٕكُمْ جَعَلْنَا لَكُمْ عَلَیْهِمْ سُلْطٰنًا مُّبِیْنًا ۟۠

మరొక రకమైన వారిని మీరు చూస్తారు; వారు మీ నుండి శాంతి పొందాలని మరియు తమ జాతి వారితో కూడా శాంతి పొందాలని కోరుతుంటారు. కాని సమయం దొరికినప్పుడల్లా వారు (తమ మాట నుండి) మరలి పోయి ఉపద్రవానికి పూనుకుంటారు. అలాంటి వారు మీతో (పోరాడటం) మానుకోకపోతే, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరించక పోతే, తమ చేతులను (మీతో యుద్ధం చేయటం నుండి) ఆపు కోకపోతే! వారెక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి మరియు సంహరించండి. మరియు ఇలా ప్రవర్తించటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇస్తున్నాము. info
التفاسير: