Kilniojo Korano reikšmių vertimas - Vertimas į telugų k. - Abdur-Rahim Bin Muchamed

Puslapio numeris:close

external-link copy
52 : 4

اُولٰٓىِٕكَ الَّذِیْنَ لَعَنَهُمُ اللّٰهُ ؕ— وَمَنْ یَّلْعَنِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ نَصِیْرًا ۟ؕ

ఇలాంటి వారే, అల్లాహ్ శాపానికి (బహిష్కారానికి) గురి అయిన వారు. మరియు అల్లాహ్ శపించిన వాడికి సహాయపడేవాడిని ఎవ్వడినీ నీవు పొందలేవు. info
التفاسير:

external-link copy
53 : 4

اَمْ لَهُمْ نَصِیْبٌ مِّنَ الْمُلْكِ فَاِذًا لَّا یُؤْتُوْنَ النَّاسَ نَقِیْرًا ۟ۙ

లేదా వారికి రాజ్యపాలనలో భాగం ఉందా? ఒకవేళ ఉండి ఉంటే, వారు ప్రజలకు ఖర్జూర బీజపు చీలిక[1] అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు. info

[1] నఖీరా: ఖర్జూర బీజపు చీలిక.

التفاسير:

external-link copy
54 : 4

اَمْ یَحْسُدُوْنَ النَّاسَ عَلٰی مَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ۚ— فَقَدْ اٰتَیْنَاۤ اٰلَ اِبْرٰهِیْمَ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَاٰتَیْنٰهُمْ مُّلْكًا عَظِیْمًا ۟

లేదా! అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్య పడుతున్నారా? వాస్తవానికి (ఇంతకు ముందు) మేము ఇబ్రాహీమ్ కుటుంబం వారికి, గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము. మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము. info
التفاسير:

external-link copy
55 : 4

فَمِنْهُمْ مَّنْ اٰمَنَ بِهٖ وَمِنْهُمْ مَّنْ صَدَّ عَنْهُ ؕ— وَكَفٰی بِجَهَنَّمَ سَعِیْرًا ۟

కాని వారిలో కొందరు అతనిని (ప్రవక్తను) విశ్వసించిన వారు ఉన్నారు, మరికొందరు అతని నుండి విముఖులైన వారూ ఉన్నారు. మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు! [1] info

[1] చూడండి, 3:85.

التفاسير:

external-link copy
56 : 4

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِنَا سَوْفَ نُصْلِیْهِمْ نَارًا ؕ— كُلَّمَا نَضِجَتْ جُلُوْدُهُمْ بَدَّلْنٰهُمْ جُلُوْدًا غَیْرَهَا لِیَذُوْقُوا الْعَذَابَ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَزِیْزًا حَكِیْمًا ۟

నిశ్చయంగా, ఎవరు మా సూచనలను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారీ వారి చర్మాలు కాలిపోయి నపుడల్లా వాటికి బదులుగా - వారు బాధను బాగా రుచి చూడటానికి - వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహావివేచనాపరుడు. info
التفاسير:

external-link copy
57 : 4

وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— لَهُمْ فِیْهَاۤ اَزْوَاجٌ مُّطَهَّرَةٌ ؗ— وَّنُدْخِلُهُمْ ظِلًّا ظَلِیْلًا ۟

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాము; వారందులో, శాశ్వతంగా కలకాలం ఉంటారు. అందు వారికి పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు. మరియు మేము వారిని దట్టమైన నీడలలో ప్రవేశింపజేస్తాము. [1] info

[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 474.

التفاسير:

external-link copy
58 : 4

اِنَّ اللّٰهَ یَاْمُرُكُمْ اَنْ تُؤَدُّوا الْاَمٰنٰتِ اِلٰۤی اَهْلِهَا ۙ— وَاِذَا حَكَمْتُمْ بَیْنَ النَّاسِ اَنْ تَحْكُمُوْا بِالْعَدْلِ ؕ— اِنَّ اللّٰهَ نِعِمَّا یَعِظُكُمْ بِهٖ ؕ— اِنَّ اللّٰهَ كَانَ سَمِیْعًا بَصِیْرًا ۟

పూచీలను (అమానాత్ లను) తప్పక వాటికి అర్హులైన వారికి అప్పగించండనీ మరియు ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండనీ, అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంత ఉత్తమమైన హితబోధ చేస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. info
التفاسير:

external-link copy
59 : 4

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَاَطِیْعُوا الرَّسُوْلَ وَاُولِی الْاَمْرِ مِنْكُمْ ۚ— فَاِنْ تَنَازَعْتُمْ فِیْ شَیْءٍ فَرُدُّوْهُ اِلَی اللّٰهِ وَالرَّسُوْلِ اِنْ كُنْتُمْ تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— ذٰلِكَ خَیْرٌ وَّاَحْسَنُ تَاْوِیْلًا ۟۠

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి.[1] ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది. info

[1] అంటే ఖుర్ఆన్ మరియు ప్రవక్త సంప్రదాయా (సున్నత్)లు చూడండి, 4:65, 7:54, 12:40, 4:80.

التفاسير: