Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad

Nomor Halaman:close

external-link copy
92 : 4

وَمَا كَانَ لِمُؤْمِنٍ اَنْ یَّقْتُلَ مُؤْمِنًا اِلَّا خَطَأً ۚ— وَمَنْ قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِیْرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَّدِیَةٌ مُّسَلَّمَةٌ اِلٰۤی اَهْلِهٖۤ اِلَّاۤ اَنْ یَّصَّدَّقُوْا ؕ— فَاِنْ كَانَ مِنْ قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِیْرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ؕ— وَاِنْ كَانَ مِنْ قَوْمٍ بَیْنَكُمْ وَبَیْنَهُمْ مِّیْثَاقٌ فَدِیَةٌ مُّسَلَّمَةٌ اِلٰۤی اَهْلِهٖ وَتَحْرِیْرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۚ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ شَهْرَیْنِ مُتَتَابِعَیْنِ ؗ— تَوْبَةً مِّنَ اللّٰهِ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟

మరియు - పొరపాటుగా తప్ప - ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని (నిషిద్ధం). మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపిన వాడు (దానికి పరిహారంగా) అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి మరియు హతుని కుటుంబీకులకు (వారసులకు) రక్తపరిహారం (దియత్) కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం (సదఖ) [1] అవుతుంది! కాని ఒకవేళ వధింపబడిన వాడు విశ్వాసి అయి, మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే, ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ (వధింప బడిన వాడు) - మీరు ఒడంబడిక చేసుకొని వున్న జనులకు చెందిన వాడైతే - రక్త పరిహారం అతని కుటుంబీకులకు (వారసులకు) ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస (ముస్లిం) బానిసకు విముక్తి కలిగించాలి. (బానిసకు విముక్తి కలిగించే) శక్తిలేని వాడు, వరుసగా రెండు నెలలు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడటానికి (ఇదే సరైన పద్ధతి). అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు. info

[1] రక్తపరిహారపు పరిమాణం దైవప్రవక్త ('స'అస) కాలంలో, 100 ఒంటెలుగా నిర్ణయించడం జరిగింది. ఇది పొరపాటుగా జరిగిన హత్యకు మాత్రమే వర్తిస్తుంది.

التفاسير:

external-link copy
93 : 4

وَمَنْ یَّقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهٗ جَهَنَّمُ خَلِدًا فِیْهَا وَغَضِبَ اللّٰهُ عَلَیْهِ وَلَعَنَهٗ وَاَعَدَّ لَهٗ عَذَابًا عَظِیْمًا ۟

మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు [1] మరియు అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు ఆయన (అల్లాహ్) అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధపరిచాడు. info

[1] హత్య మూడు రకాలు: 1) ఖత్లె - 'అమద్: అంటే బుద్ధిపూర్వకంగా హత్య చేయడం. దాని శిక్ష ఇక్కడ చెప్పబడింది. ఇహలోకంలో మరణశాసనం, మరియు పరలోకంలో నరకం. 2) ఖత్లె - 'ఖ'తా: పొరపాటు వ్ల, అనుకోని విధంగా జరిగిన హత్య. దీని విషయం ఇంతకు ముందు 92 ఆయత్ లో వచ్చింది. 3) ఖత్లె - షుబ్హ్ 'అమద్: దీని వివరాలు 'హదీస్' లలో పేర్కొనబడ్డియి.

التفاسير:

external-link copy
94 : 4

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا ضَرَبْتُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ فَتَبَیَّنُوْا وَلَا تَقُوْلُوْا لِمَنْ اَلْقٰۤی اِلَیْكُمُ السَّلٰمَ لَسْتَ مُؤْمِنًا ۚ— تَبْتَغُوْنَ عَرَضَ الْحَیٰوةِ الدُّنْیَا ؗ— فَعِنْدَ اللّٰهِ مَغَانِمُ كَثِیْرَةٌ ؕ— كَذٰلِكَ كُنْتُمْ مِّنْ قَبْلُ فَمَنَّ اللّٰهُ عَلَیْكُمْ فَتَبَیَّنُوْا ؕ— اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًا ۟

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మార్గంలో (జిహాద్ కు) బయలుదేరి నప్పుడు వివేచనతో వ్యవహరించండి. (శాంతిని ఆశించి మీ వైపునకు) సలాం చేస్తూ వచ్చే వానిని - ప్రాపంచిక ప్రయోజనాలను పొంద గోరి - "నీవు విశ్వాసివి (ముస్లింవు) కావు."[1] అని (త్వరపడి) అనకండి. అల్లాహ్ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా ఉన్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండేవారు కదా! ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచితమైన పరిశీలన చేయండి. నిశ్చయంగా, అల్లాహ్! మీరు చేసేదంతా బాగా ఎరుగును. info

[1] ఒకసారి కొందరు 'స'హాబీలు జిహాద్ కొరకు పోతుంటారు. దారిలో ఒక పశువుల కాపరి వారిని చూసి సలామ్ చేస్తాడు. వారు అతడు విశ్వాసికాడు, కేవలం తన ప్రాణాలను కాపాడుకోవటానికే - తాను ముస్లింనని తెలుపటానికి - సలాం చేశాడని భావించి, అతనిని చంపి, అతని పశువులను, మాలె 'గనీమత్ గా దైవప్రవక్త ('స'అస) దగ్గరికి తెస్తారు. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ('స. బు'ఖారీ, తిర్మిజీ').

التفاسير: