Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad

Nomor Halaman:close

external-link copy
155 : 4

فَبِمَا نَقْضِهِمْ مِّیْثَاقَهُمْ وَكُفْرِهِمْ بِاٰیٰتِ اللّٰهِ وَقَتْلِهِمُ الْاَنْۢبِیَآءَ بِغَیْرِ حَقٍّ وَّقَوْلِهِمْ قُلُوْبُنَا غُلْفٌ ؕ— بَلْ طَبَعَ اللّٰهُ عَلَیْهَا بِكُفْرِهِمْ فَلَا یُؤْمِنُوْنَ اِلَّا قَلِیْلًا ۪۟

కాని వారు తాము చేసిన ప్రమాణాలను భంగం చేయటం వలన మరియు అల్లాహ్ సూక్తులను తిరస్కరించటం వలన మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపటం వలన! మరియు: "మా హృదయాలు పొరలతో కప్పబడి ఉన్నాయి." [1] అని అనటం వలన (మేము వారిని శిక్షించాము). అంతే కాదు, వారి సత్య తిరస్కారం వలన అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేసి ఉన్నాడు; కాబట్టి వారు విశ్వసించినా కొంత మాత్రమే! info

[1] చూడండి, 2:88.

التفاسير:

external-link copy
156 : 4

وَّبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلٰی مَرْیَمَ بُهْتَانًا عَظِیْمًا ۟ۙ

మరియు వారి సత్యతిరస్కారం వలన మరియు వారు మర్యమ్ పై మోపిన మహా అపనింద వలన;[1] info

[1] అంటే యూసుఫ్ నజ్జార్ అనే వ్యక్తితో ఆమె (మర్యమ్) సంబంధముందని యూదులు మోపిన అపనింద.

التفاسير:

external-link copy
157 : 4

وَّقَوْلِهِمْ اِنَّا قَتَلْنَا الْمَسِیْحَ عِیْسَی ابْنَ مَرْیَمَ رَسُوْلَ اللّٰهِ ۚ— وَمَا قَتَلُوْهُ وَمَا صَلَبُوْهُ وَلٰكِنْ شُبِّهَ لَهُمْ ؕ— وَاِنَّ الَّذِیْنَ اخْتَلَفُوْا فِیْهِ لَفِیْ شَكٍّ مِّنْهُ ؕ— مَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ— وَمَا قَتَلُوْهُ یَقِیْنًا ۟ۙ

మరియు వారు: "నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమారుడైన, ఈసా మసీహ్ ను (ఏసు క్రీస్తును) చంపాము." అని అన్నందుకు.[1] మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురి చేయబడ్డారు.[2] నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు. info

[1] చూడండి, 3:55. [2] అంటే 'ఈసా మసీ'హ్ (ఏసుక్రీస్తు) వలే కనిపించిన మరొక వ్యక్తిని సిలువపై ఎక్కించారు. (నోబుల్ ఖుర్ఆన్).

التفاسير:

external-link copy
158 : 4

بَلْ رَّفَعَهُ اللّٰهُ اِلَیْهِ ؕ— وَكَانَ اللّٰهُ عَزِیْزًا حَكِیْمًا ۟

వాస్తవానికి, అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు[1] మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు. info

[1] చూడండి, 3:55. అల్లాహ్ (సు.తా.) 'ఈసా ('అ.స.) ను సజీవునిగా, అతని శరీరంతో సహా, పైకి లేపుకున్నాడు. పునరుత్థానదినానికి దగ్గరి రోజులలో, 'ఈసా ('అ.స.) దమిష్క్ (Damascus)లో తూర్పుదిక్కు మనారహ్ దగ్గర ఫజ్ర్ నమా'జ్ అఖామత్ సమయంలో ఆకాశం నుండి భూమిపైకి పంపబడుతారు. ఆతను పందిని చంపుతారు, సిలువను విరిచేస్తారు, జి'జ్ యాను తొలగిస్తారు. ప్రజలందరూ ముస్లింలవుతారు. దజ్జాల్ ను అతనే సంహరిస్తారు. యఅ'జూజ్, మఅ'జూజ్ లు కూడా అతని ప్రార్థన వలననే చంపబడతారు. ఈ పై విషయాలన్నీ ప్రముఖ 'హదీస్' ఉల్లేఖకులు చెప్పినవే. వారిలో అబూ హురైరా, 'అబ్దుల్లాహ్ బిన్-మస్'ఊద్, 'ఉస్మాన్ బిన్ - అబీ అల్ - 'ఆస్, అబూ ఉమామ, నవ్వాస్ బిన్ - సమ్'ఆన్ మరియు అబ్దుల్లాహ్ బిన్ - 'ఉమ్ రూ బిన్ అల్ 'ఆస్, (ర.'ది.'అన్హుమ్) మొదలైన వారున్నారు. వీటిని లిఖించినవారిలో బు'ఖారీ, ముస్లిం మరియు ఇతర ఎంతో మంది 'హదీస్' వేత్తలు ఉన్నారు. (ఇబ్నె- కసీ'ర్).

التفاسير:

external-link copy
159 : 4

وَاِنْ مِّنْ اَهْلِ الْكِتٰبِ اِلَّا لَیُؤْمِنَنَّ بِهٖ قَبْلَ مَوْتِهٖ ۚ— وَیَوْمَ الْقِیٰمَةِ یَكُوْنُ عَلَیْهِمْ شَهِیْدًا ۟ۚ

మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం[1] (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.[2] info

[1] ఇక్కడ 'ఈసా ('అ.స.) యొక్క మరణం అంటే, అతను మరల భూమి మీదికి పునరుత్థాన దినానికి దగ్గరి రోజులలో పంపబడి, పైన వివరించిన విషయాలన్నీ జరిగి, అతని సహజ మరణానికి మిందు, అని అర్థం. (ము'హమ్మద్ జూనాగఢి). దీని మరొక తాత్పర్యంలో: "ఆ యూదుని లేక క్రైస్తవుని మరణ సమయంలో అంటే, ఆత్మ (ప్రాణం) తీసే దైవదూత వచ్చినప్పుడు అతడు (ఆ యూదుడు లేక క్రైస్తవుడు): 'ఈసా ('అ.స.), అల్లాహ్ (సు.తా.) యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని విశ్వసిస్తాడు. కానీ ఆ విశ్వాసం అతనికి ప్రయోజనకరం కాజాలదు." అని, వ్యాక్యానించారు. [2] ఈ సాక్ష్యం 'ఈసా ('అ.స.) ను, అల్లాహ్ (సు.తా.) సజీవునిగా తన వైపునకు లేపుకొనక ముందటి విషయాల గురించి ఉంటుంది. చూడండి, 5:117 (ము'హమ్మద్ జూనాగఢి).

التفاسير:

external-link copy
160 : 4

فَبِظُلْمٍ مِّنَ الَّذِیْنَ هَادُوْا حَرَّمْنَا عَلَیْهِمْ طَیِّبٰتٍ اُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَنْ سَبِیْلِ اللّٰهِ كَثِیْرًا ۟ۙ

యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గాలకు ఫలితంగానూ మరియు వారు, అనేకులను అల్లాహ్ మార్గంపై నడువకుండా ఆటంక పరుస్తూ ఉన్నందు వలననూ, మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము;[1] info

[1] చూడండి, 6:146 మరియు 3:93

التفاسير:

external-link copy
161 : 4

وَّاَخْذِهِمُ الرِّبٰوا وَقَدْ نُهُوْا عَنْهُ وَاَكْلِهِمْ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ؕ— وَاَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ مِنْهُمْ عَذَابًا اَلِیْمًا ۟

మరియు వాస్తవానికి, వారికి నిషేధింపబడినా; వారు వడ్డీ తీసుకోవటం వలననూ మరియు వారు అధర్మంగా ఇతరుల సొమ్మును తినటం వలననూ, మరియు వారిలో అవిశ్వాసులైన వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాము. info
التفاسير:

external-link copy
162 : 4

لٰكِنِ الرّٰسِخُوْنَ فِی الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُوْنَ یُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ وَالْمُقِیْمِیْنَ الصَّلٰوةَ وَالْمُؤْتُوْنَ الزَّكٰوةَ وَالْمُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— اُولٰٓىِٕكَ سَنُؤْتِیْهِمْ اَجْرًا عَظِیْمًا ۟۠

కాని వారిలో పరిపూర్ణమైన జ్ఞానం గలవారు మరియు విశ్వాసులైనవారు[1], నీపై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారు. వారు నమాజ్ విధిగా సలుపుతారు, విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసం కలిగి ఉంటారు; ఇలాంటి వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. info

[1] ఇక్కడ సూచించబడిన వారు 'అబ్దుల్లాహ్ బిన్ - సల్లామ్ మరియు ఇతర యూదులు (ర'ది.'అన్హుమ్), ఎవరైతే ఇస్లాం స్వీకరించారో!

التفاسير: