Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Telugu - Abdurrahim bin Muhammad

Nomor Halaman:close

external-link copy
163 : 4

اِنَّاۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ كَمَاۤ اَوْحَیْنَاۤ اِلٰی نُوْحٍ وَّالنَّبِیّٖنَ مِنْ بَعْدِهٖ ۚ— وَاَوْحَیْنَاۤ اِلٰۤی اِبْرٰهِیْمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَعِیْسٰی وَاَیُّوْبَ وَیُوْنُسَ وَهٰرُوْنَ وَسُلَیْمٰنَ ۚ— وَاٰتَیْنَا دَاوٗدَ زَبُوْرًا ۟ۚ

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము.[1] మరియు మేము దావూద్ కు జబూర్ [2] గ్రంథాన్ని ప్రసాదించాము. info

[1] ఇబ్నె 'అబ్బాస్ (ర'ది.'అ.) కథనం: "కొందరు (యూదులు) మూసా ('అ.స.) తరువాత ఎవరిపై కూడా దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడలేదు." అని అన్నారు. దానికి సమాధానంగా ఈ ఆయత్ అవతరింపజేయబడింది. (ఇబ్నె-కసీ'ర్). [2] 'జబూర్ (కీర్తనలు / Pslams) : దావూద్ ('అ.స.)కు ఇవ్వబడిన గ్రంథం.

التفاسير:

external-link copy
164 : 4

وَرُسُلًا قَدْ قَصَصْنٰهُمْ عَلَیْكَ مِنْ قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَیْكَ ؕ— وَكَلَّمَ اللّٰهُ مُوْسٰی تَكْلِیْمًا ۟ۚ

మరియు వాస్తవంగా, మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు.[1] మరియు అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు. info

[1] ఖుర్ఆన్ లో పేర్కొనబడిన ప్రవక్తలు కేవలం 25 మంది మాత్రమే: వారు 1) ఆదమ్, 2) ఇద్రీస్, 3) నూ'హ్, 4) హూద్, 5) 'సాలి'హ్, 6) ఇబ్రాహీమ్, 7) లూ'త్, 8) ఇస్మా'ఈల్, 9) ఇస్'హాఖ్, 10) య'అఖూబ్, 11) యూసుఫ్, 12) అయూబ్, 13) యూనుస్, 14) షు'ఐబ్, 15) మూసా, 16) హారూన్, 17) ఇల్యాస్, 18) అల్-యస'అ, 19) జు'ల్-కిప్ల్, 20) దావూద్, 21) సులైమాన్, 22) జ'కరియ్యా, 23) య'హ్యా, 24) 'ఈసా 25) ము'హమ్మద్ 'సలవాతుల్లాహి వ సలాముహు 'అలైహి వ 'అలైహిమ్ అజ్మ'ఈన్. ఇక మొత్తం ఎంతమంది ప్రవక్తలు వచ్చారో అల్లాహుతా'ఆలాకే తెలుసు. ము'హమ్మద్ ('స'అస) తరువాత మాత్రం ఏ ప్రవక్త రాడు. ఎవడైనా తాను ప్రవక్తనని ప్రకటించుకున్నా, అతడూ, అతనిని అనుసరించేవారూ మరియు అలాంటి వానిని ప్రవక్త అని నమ్మేవారూ అందరూ అసత్యవాదులే! అలాంటి వారు ముస్లింలు కారు. ఉదా: బహాయీలు, మీర్జాయీలు, ఖాదియానీలు మొదలైనవారు.

التفاسير:

external-link copy
165 : 4

رُسُلًا مُّبَشِّرِیْنَ وَمُنْذِرِیْنَ لِئَلَّا یَكُوْنَ لِلنَّاسِ عَلَی اللّٰهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ؕ— وَكَانَ اللّٰهُ عَزِیْزًا حَكِیْمًا ۟

(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము.[1] ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని![2] మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు. info

[1] విశ్వాసులకు స్వర్గపు శుభవార్తనివ్వటానికి మరియు అవిశ్వాసులకు నరకాన్ని గురించి హెచ్చరించటానికి. [2] చూడండి, 20:134.

التفاسير:

external-link copy
166 : 4

لٰكِنِ اللّٰهُ یَشْهَدُ بِمَاۤ اَنْزَلَ اِلَیْكَ اَنْزَلَهٗ بِعِلْمِهٖ ۚ— وَالْمَلٰٓىِٕكَةُ یَشْهَدُوْنَ ؕ— وَكَفٰی بِاللّٰهِ شَهِیْدًا ۟ؕ

కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి (ఖుర్ఆన్ కు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దేవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తున్నారు. మరియు ఉత్తమ సాక్షిగా అల్లాహ్ యే చాలు. info
التفاسير:

external-link copy
167 : 4

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ قَدْ ضَلُّوْا ضَلٰلًا بَعِیْدًا ۟

నిశ్చయంగా, ఎవరైతే సత్య తిరస్కారులై, ఇతరులను అల్లాహ్ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తున్నారో వాస్తవానికి వారు మార్గభ్రష్టులై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు! info
التفاسير:

external-link copy
168 : 4

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَظَلَمُوْا لَمْ یَكُنِ اللّٰهُ لِیَغْفِرَ لَهُمْ وَلَا لِیَهْدِیَهُمْ طَرِیْقًا ۟ۙ

నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడూ మరియు వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు. info
التفاسير:

external-link copy
169 : 4

اِلَّا طَرِیْقَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— وَكَانَ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرًا ۟

వారికి కేవలం నరక మార్గం మాత్రమే చూపుతాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం. info
التفاسير:

external-link copy
170 : 4

یٰۤاَیُّهَا النَّاسُ قَدْ جَآءَكُمُ الرَّسُوْلُ بِالْحَقِّ مِنْ رَّبِّكُمْ فَاٰمِنُوْا خَیْرًا لَّكُمْ ؕ— وَاِنْ تَكْفُرُوْا فَاِنَّ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟

ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి, సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహరుడు వచ్చి వున్నాడు, కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి, ఇదే మీకు మేలైనది. మరియు మీరు గనక తిరస్కరిస్తే! నిశ్చయంగా భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందినదని తెలుసుకోండి.[1] మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు. info

[1] చూడండి, 14:8.

التفاسير: