[1] ఇక్కడ దైవప్రవక్త ('స'అస) మదీనాకు వలస పోయిన తరువాత చాలా మంది యువకులు కూడా వలస పోయారు. వృద్ధులు, స్త్రీలు మరియు పిల్లలు అక్కడే ఉండి పోయారు. మక్కా ముష్రిక్ ఖురైషులు వారిపై అన్యాయాలు, దౌర్జన్యాలు చేయసాగారు. అప్పుడు వారు (ముస్లింలు) పై విధంగా వేడుకొన్నారు. ఇట్టి పరిస్థితులలో ముస్లింలపై జిహద్ అత్యవసర మవుతుంది.
[1] 'తా'గూత్: అంటే షై'తాన్. చూడండి, 2:256 వ్యాఖ్యానం 3.
[1] ఇస్లాం ఆరంభ దినాలలో మొట్టమొదట, మక్కా ముస్లింలకు సహనం వహించండి, నమా'జ్ చేయండి మరియు 'జకాత్ ఇవ్వండి, అని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే అప్పుడు వారి ఆర్థిక మరియు భౌతిక పరిస్థితులు జిహాద్ కు అనుకూలంగా లేకుండెను. అయినా వారు, జిహాద్ కొరకు తొందర పెట్టేవారు. కాని ఇప్పుడు మదీనా మునవ్వరాకు వచ్చిన తరువాత వారి పరిస్థితులు మెరుగైన తరువాత వారిని జిహాద్ చేయమని ఆజ్ఞాపిస్తే వారెందుకు వెనుకంజ వేస్తున్నారని ఈ ఆయత్ ప్రశ్నిస్తున్నది.
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "స్వర్గంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి కూడా అల్లాహ్ (సు.తా.) కారుణ్యం వల్లనే ప్రవేశిస్తాడు. (కేవలం తన కర్మల వల్ల కాదు)." అప్పుడు 'స'హాబా (ర'ది.'అన్హుమ్)లు అన్నారు: "ఓ ప్రవక్తా ('స'అస)! మీరు కూడానా?" అతను జవాబిచ్చారు: "అవును, అల్లాహుతా'ఆలా యొక్క కారుణ్యం నాపై లేకుంటే నేను కూడా స్వర్గంలో ప్రవేశించలేను." ('స. బు'ఖారీ). [2] చూడండి, 42:30.