அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

பக்க எண்:close

external-link copy
75 : 4

وَمَا لَكُمْ لَا تُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ وَالْمُسْتَضْعَفِیْنَ مِنَ الرِّجَالِ وَالنِّسَآءِ وَالْوِلْدَانِ الَّذِیْنَ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اَخْرِجْنَا مِنْ هٰذِهِ الْقَرْیَةِ الظَّالِمِ اَهْلُهَا ۚ— وَاجْعَلْ لَّنَا مِنْ لَّدُنْكَ وَلِیًّا ۙۚ— وَّاجْعَلْ لَّنَا مِنْ لَّدُنْكَ نَصِیْرًا ۟ؕ

మరియు మీకేమయింది, మీరెందుకు అల్లాహ్ మార్గంలో మరియు నిస్సహాయులై అణచి వేయబడిన పురుషుల, స్త్రీల మరియు పిల్లల కొరకు, పోరాడటం లేదు? [1] వారు: "మా ప్రభూ! దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. నీ వద్ద నుండి మా కొరకు ఒక సంరక్షకుణ్ణి నియమించు. మరియు నీ వద్ద నుండి మా కొరకు ఒక సహాయకుణ్ణి ఏర్పాటు చేయి!" అని వేడుకుంటున్నారు. info

[1] ఇక్కడ దైవప్రవక్త ('స'అస) మదీనాకు వలస పోయిన తరువాత చాలా మంది యువకులు కూడా వలస పోయారు. వృద్ధులు, స్త్రీలు మరియు పిల్లలు అక్కడే ఉండి పోయారు. మక్కా ముష్రిక్ ఖురైషులు వారిపై అన్యాయాలు, దౌర్జన్యాలు చేయసాగారు. అప్పుడు వారు (ముస్లింలు) పై విధంగా వేడుకొన్నారు. ఇట్టి పరిస్థితులలో ముస్లింలపై జిహద్ అత్యవసర మవుతుంది.

التفاسير:

external-link copy
76 : 4

اَلَّذِیْنَ اٰمَنُوْا یُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ ۚ— وَالَّذِیْنَ كَفَرُوْا یُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِ الطَّاغُوْتِ فَقَاتِلُوْۤا اَوْلِیَآءَ الشَّیْطٰنِ ۚ— اِنَّ كَیْدَ الشَّیْطٰنِ كَانَ ضَعِیْفًا ۟۠

విశ్వసించిన వారు, అల్లాహ్ మార్గంలో పోరాడుతారు. మరియు సత్యతిరస్కారులు తాగూత్ మార్గంలో పోరాడుతారు; [1] కావున మీరు (ఓ విశ్వాసులారా!) షైతాను అనుచరులను విరుద్ధంగా పోరాడండి. నిశ్చయంగా, షైతాను కుట్ర బలహీనమైనదే! info

[1] 'తా'గూత్: అంటే షై'తాన్. చూడండి, 2:256 వ్యాఖ్యానం 3.

التفاسير:

external-link copy
77 : 4

اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ قِیْلَ لَهُمْ كُفُّوْۤا اَیْدِیَكُمْ وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ۚ— فَلَمَّا كُتِبَ عَلَیْهِمُ الْقِتَالُ اِذَا فَرِیْقٌ مِّنْهُمْ یَخْشَوْنَ النَّاسَ كَخَشْیَةِ اللّٰهِ اَوْ اَشَدَّ خَشْیَةً ۚ— وَقَالُوْا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَیْنَا الْقِتَالَ ۚ— لَوْلَاۤ اَخَّرْتَنَاۤ اِلٰۤی اَجَلٍ قَرِیْبٍ ؕ— قُلْ مَتَاعُ الدُّنْیَا قَلِیْلٌ ۚ— وَالْاٰخِرَةُ خَیْرٌ لِّمَنِ اتَّقٰی ۫— وَلَا تُظْلَمُوْنَ فَتِیْلًا ۟

"మీ చేతులను ఆపుకోండి, నమాజ్ ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి." అని చెప్పబడిన వారిని నీవు చూడలేదా? యుద్ధం చేయమని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా మానవులకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: "ఓ మా ప్రభూ! యుద్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకివ్వలేదు?[1] అని అంటారు. వారితో ఇలా అను: "ఇహలోక సుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు. info

[1] ఇస్లాం ఆరంభ దినాలలో మొట్టమొదట, మక్కా ముస్లింలకు సహనం వహించండి, నమా'జ్ చేయండి మరియు 'జకాత్ ఇవ్వండి, అని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే అప్పుడు వారి ఆర్థిక మరియు భౌతిక పరిస్థితులు జిహాద్ కు అనుకూలంగా లేకుండెను. అయినా వారు, జిహాద్ కొరకు తొందర పెట్టేవారు. కాని ఇప్పుడు మదీనా మునవ్వరాకు వచ్చిన తరువాత వారి పరిస్థితులు మెరుగైన తరువాత వారిని జిహాద్ చేయమని ఆజ్ఞాపిస్తే వారెందుకు వెనుకంజ వేస్తున్నారని ఈ ఆయత్ ప్రశ్నిస్తున్నది.

التفاسير:

external-link copy
78 : 4

اَیْنَمَا تَكُوْنُوْا یُدْرِكْكُّمُ الْمَوْتُ وَلَوْ كُنْتُمْ فِیْ بُرُوْجٍ مُّشَیَّدَةٍ ؕ— وَاِنْ تُصِبْهُمْ حَسَنَةٌ یَّقُوْلُوْا هٰذِهٖ مِنْ عِنْدِ اللّٰهِ ۚ— وَاِنْ تُصِبْهُمْ سَیِّئَةٌ یَّقُوْلُوْا هٰذِهٖ مِنْ عِنْدِكَ ؕ— قُلْ كُلٌّ مِّنْ عِنْدِ اللّٰهِ ؕ— فَمَالِ هٰۤؤُلَآءِ الْقَوْمِ لَا یَكَادُوْنَ یَفْقَهُوْنَ حَدِیْثًا ۟

"మీరు ఎక్కడున్నా సరే! మీకు చావు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బురుజులలో ఉన్నా చావు రాక తప్పదు." (అని పలుకు). మరియు వారికి ఏమైనా మేలు కలిగితే: "ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని అంటారు. కాని వారికేదైనా కీడు గలిగితే: "(ఓ ముహమ్మద్!) ఇది నీ వల్ల జరిగింది." అని అంటారు. వారితో అను: "అంతా అల్లాహ్ తరఫు నుండే (వస్తుంది)!" ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు? info
التفاسير:

external-link copy
79 : 4

مَاۤ اَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللّٰهِ ؗ— وَمَاۤ اَصَابَكَ مِنْ سَیِّئَةٍ فَمِنْ نَّفْسِكَ ؕ— وَاَرْسَلْنٰكَ لِلنَّاسِ رَسُوْلًا ؕ— وَكَفٰی بِاللّٰهِ شَهِیْدًا ۟

(ఓ మానవుడా!) నీకు ఏ మేలు జరిగినా అది అల్లాహ్ అనుగ్రహం వల్లనే[1] మరియు నీకు ఏ కీడు జరిగినా అది నీ స్వంత (కర్మల) ఫలితమే![2] మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను మానవులకు సందేశహరునిగా చేసి పంపాము. మరియు దీనికి అల్లాహ్ సాక్ష్యమే చాలు. info

[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "స్వర్గంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి కూడా అల్లాహ్ (సు.తా.) కారుణ్యం వల్లనే ప్రవేశిస్తాడు. (కేవలం తన కర్మల వల్ల కాదు)." అప్పుడు 'స'హాబా (ర'ది.'అన్హుమ్)లు అన్నారు: "ఓ ప్రవక్తా ('స'అస)! మీరు కూడానా?" అతను జవాబిచ్చారు: "అవును, అల్లాహుతా'ఆలా యొక్క కారుణ్యం నాపై లేకుంటే నేను కూడా స్వర్గంలో ప్రవేశించలేను." ('స. బు'ఖారీ). [2] చూడండి, 42:30.

التفاسير: