அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

பக்க எண்:close

external-link copy
141 : 4

١لَّذِیْنَ یَتَرَبَّصُوْنَ بِكُمْ ۚ— فَاِنْ كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ اللّٰهِ قَالُوْۤا اَلَمْ نَكُنْ مَّعَكُمْ ۖؗ— وَاِنْ كَانَ لِلْكٰفِرِیْنَ نَصِیْبٌ ۙ— قَالُوْۤا اَلَمْ نَسْتَحْوِذْ عَلَیْكُمْ وَنَمْنَعْكُمْ مِّنَ الْمُؤْمِنِیْنَ ؕ— فَاللّٰهُ یَحْكُمُ بَیْنَكُمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَلَنْ یَّجْعَلَ اللّٰهُ لِلْكٰفِرِیْنَ عَلَی الْمُؤْمِنِیْنَ سَبِیْلًا ۟۠

వారు (కపట విశ్వాసులు) మీ విషయంలో నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి విజయం లభిస్తే! వారు (మీతో) అంటారు: "ఏమీ? మేము మీతో కలిసి లేమా?" కాని ఒకవేళ సత్యతిరస్కారులదే పైచేయి అయితే (వారితో) అంటారు: "ఏమీ? మీతో గెలిచే శక్తి మాకు లేక పోయిందా? అయినా మేము మిమ్మల్ని విశ్వాసుల నుండి కాపాడలేదా?" కాని అల్లాహ్ పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్! ఎన్నటికీ సత్యతిరస్కారులకు విశ్వాసులపై (విజయం పొందే) మార్గం చూపడు.[1] info

[1] చూడండి, 42:30.

التفاسير:

external-link copy
142 : 4

اِنَّ الْمُنٰفِقِیْنَ یُخٰدِعُوْنَ اللّٰهَ وَهُوَ خَادِعُهُمْ ۚ— وَاِذَا قَامُوْۤا اِلَی الصَّلٰوةِ قَامُوْا كُسَالٰی ۙ— یُرَآءُوْنَ النَّاسَ وَلَا یَذْكُرُوْنَ اللّٰهَ اِلَّا قَلِیْلًا ۟ؗۙ

నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు.[1] మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు.[2] మరియు వారు అల్లాహ్ ను స్మరించేది చాల తక్కువ! info

[1] చూడండి, 57:12-15. [2] కపటవిశ్వాసులకు 'ఇషా మరియు ఫజ్ర్ నమా'జ్ లు చేయటం చాలా కఠినంగా ఉంటుంది. ('స'హీ'హ్ బు'ఖారీ). వారు ఇతరులకు చూపటానికి మరియు ముస్లింలను తమను గురించి అంధకారం (అయోమయం)లో ఉంచటానికే నమా'జ్ చేస్తారు. వారు చేసే నమా'జ్ లలో భయభక్తులు ఉండవు.

التفاسير:

external-link copy
143 : 4

مُّذَبْذَبِیْنَ بَیْنَ ذٰلِكَ ۖۗ— لَاۤ اِلٰی هٰۤؤُلَآءِ وَلَاۤ اِلٰی هٰۤؤُلَآءِ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ سَبِیْلًا ۟

వారు (విశ్వాస - అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా, పూర్తిగా అటు (సత్యతిరస్కారులు) కాకుండా ఉన్నారు. మరియు ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు (సరైన) మార్గం చూపలేవు.[1] info

[1] ఎవరైతే బుద్ధిపూర్వకంగా మార్గభ్రష్టత్వాన్ని, కుఫ్ర్ మరియు షిర్క్ ను ఎన్నుకుంటారో! వారికి అల్లాహ్ (సు.తా.) సన్మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేయడు. ఎందుకంటే అల్లాహుతా'ఆలా మానవులకు మరియు జిన్నాతులకు విచక్షణా బుద్ధినిచ్చాడు. ప్రవక్తల ద్వారా మరియు దివ్యగ్రంథాల ద్వారా వారి వద్దకు మార్గదర్శకత్వాన్ని పంపాడు. అయినా వారు తమ తలబిరుసుతనంతో షై'తాన్ వలలో పడిపోయి, షై'తాన్ అడుగుజాడలలో నడుస్తున్నారు. అల్లాహ్ (సు.తా.)కు జరిగిపోయింది, జరగనున్నది అంతా తెలుసు. అల్లాహుతా'ఆలా ఆలిముల్'గైబ్. దుష్టులు సన్మార్గం వైపునకు రారని అల్లాహ్ (సు.తా.) కు తెలుసు కాబట్టి, వారిని మార్గభ్రష్టత్వంలో పడి ఉండనిస్తాడే కానీ, వారిని బలవంతంగా మార్బ్గభ్రష్టత్వంలోకి త్రోయడు.

التفاسير:

external-link copy
144 : 4

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوا الْكٰفِرِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِیْنَ ؕ— اَتُرِیْدُوْنَ اَنْ تَجْعَلُوْا لِلّٰهِ عَلَیْكُمْ سُلْطٰنًا مُّبِیْنًا ۟

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను, మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే వ్యతిరేకంగా, అల్లాహ్ కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచు కున్నారా? info
التفاسير:

external-link copy
145 : 4

اِنَّ الْمُنٰفِقِیْنَ فِی الدَّرْكِ الْاَسْفَلِ مِنَ النَّارِ ۚ— وَلَنْ تَجِدَ لَهُمْ نَصِیْرًا ۟ۙ

నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు.[1] మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు. info

[1] నరకంలో అన్నిటి కంటే క్రింది అంతస్తు అల్-హామియహ్ అనబడుతుంది.

التفاسير:

external-link copy
146 : 4

اِلَّا الَّذِیْنَ تَابُوْا وَاَصْلَحُوْا وَاعْتَصَمُوْا بِاللّٰهِ وَاَخْلَصُوْا دِیْنَهُمْ لِلّٰهِ فَاُولٰٓىِٕكَ مَعَ الْمُؤْمِنِیْنَ ؕ— وَسَوْفَ یُؤْتِ اللّٰهُ الْمُؤْمِنِیْنَ اَجْرًا عَظِیْمًا ۟

కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్ ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించు కుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసి మెలిసి ఉంటారు.[1] మరియు త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలడు. info

[1] మరియు ఏ కపటవిశ్వాసి అయితే పశ్చాత్తాపపడి తనను తాను సవరించుకొని అల్లాహ్ (సు.తా.) నే గట్టిగా విశ్వసించి తన భక్తిని కేవలం అల్లాహ్ (సు.తా.) కే ప్రత్యేకించుకుంటాడో అట్టివాడు స్వర్గంలో విశ్వాసులతో ఉంటాడు.

التفاسير:

external-link copy
147 : 4

مَا یَفْعَلُ اللّٰهُ بِعَذَابِكُمْ اِنْ شَكَرْتُمْ وَاٰمَنْتُمْ ؕ— وَكَانَ اللّٰهُ شَاكِرًا عَلِیْمًا ۟

మీరు కృతజ్ఞులై, విశ్వాసులై ఉంటే అల్లాహ్ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు,[1] సర్వజ్ఞుడు. info

[1] షాకిరిన్ (అష్-షకూర్): Approving or Rewarding or Forgiving much or largely. అంటే కృతజ్ఞతలను ఆమోదించే, అంగీకరించే, ఆదరించే, విలువనిచ్చే వాడు. తన దాసుల మంచి కార్యాలకు అమితంగా ప్రతిఫలమిచ్చేవాడు. All-Appreciateive, యోగ్యతను గుర్తించేవాడు. చూడండి, 2:158.

التفاسير: