அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

பக்க எண்:close

external-link copy
148 : 4

لَا یُحِبُّ اللّٰهُ الْجَهْرَ بِالسُّوْٓءِ مِنَ الْقَوْلِ اِلَّا مَنْ ظُلِمَ ؕ— وَكَانَ اللّٰهُ سَمِیْعًا عَلِیْمًا ۟

అన్యాయానికి గురి అయిన వాడు తప్ప! చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు.[1] మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. info

[1] మీరు మానవులలో ఏదైనా చెడును చూస్తే దానిని ఇతరులకు ప్రకటించకండి. కాని ఏకాంతంలో వారిని బోధించటానికి ప్రయత్నించండి.

التفاسير:

external-link copy
149 : 4

اِنْ تُبْدُوْا خَیْرًا اَوْ تُخْفُوْهُ اَوْ تَعْفُوْا عَنْ سُوْٓءٍ فَاِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا قَدِیْرًا ۟

మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా![1] లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు,[2] సర్వ సమర్ధుడు. info

[1] ఒకడు చేసిన చెడు లేక కీడుకు - తనకు జరిగిన దానికి - సరిసమానంగా ప్రతీకారం తీసుకోవటానికి షరీయత్ లో అనుమతి ఉంది. కానీ తనకు జరిగిన చెడు లేక కీడును క్షమించటం ఎక్కువగా ఆమోదించబడింది. ('స. ముస్లిం, 'హ. నం. 4587). చూడండి, 42:40. [2] అఫువ్వన్ (అల్-అఫువ్వు): Pardoning, మన్నించే, క్షమించేవాడు. చూడండి, 2:52 వ్యాఖ్యానం 1.

التفاسير:

external-link copy
150 : 4

اِنَّ الَّذِیْنَ یَكْفُرُوْنَ بِاللّٰهِ وَرُسُلِهٖ وَیُرِیْدُوْنَ اَنْ یُّفَرِّقُوْا بَیْنَ اللّٰهِ وَرُسُلِهٖ وَیَقُوْلُوْنَ نُؤْمِنُ بِبَعْضٍ وَّنَكْفُرُ بِبَعْضٍ ۙ— وَّیُرِیْدُوْنَ اَنْ یَّتَّخِذُوْا بَیْنَ ذٰلِكَ سَبِیْلًا ۙ۟

నిశ్చయంగా, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారూ మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరే వారూ (అంటే అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తలను తిరస్కరించే వారూ) మరియు: "మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరి కొందరిని తిరస్కరిస్తాము." అని అనే వారూ మరియు (విశ్వాస - అవిశ్వాసాలకు) మధ్య మార్గాన్ని కల్పించ గోరేవారూ - info
التفاسير:

external-link copy
151 : 4

اُولٰٓىِٕكَ هُمُ الْكٰفِرُوْنَ حَقًّا ۚ— وَاَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا ۟

ఇలాంటి వారే - నిస్సందేహంగా సత్యతిరస్కారులు మరియు సత్యతిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. info
التفاسير:

external-link copy
152 : 4

وَالَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ وَلَمْ یُفَرِّقُوْا بَیْنَ اَحَدٍ مِّنْهُمْ اُولٰٓىِٕكَ سَوْفَ یُؤْتِیْهِمْ اُجُوْرَهُمْ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟۠

మరియు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసిస్తూ, వారి (ప్రవక్తల) మధ్య భేదభావాలు చూపని వారికి ఆయన (అల్లాహ్) వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదించగలడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. info
التفاسير:

external-link copy
153 : 4

یَسْـَٔلُكَ اَهْلُ الْكِتٰبِ اَنْ تُنَزِّلَ عَلَیْهِمْ كِتٰبًا مِّنَ السَّمَآءِ فَقَدْ سَاَلُوْا مُوْسٰۤی اَكْبَرَ مِنْ ذٰلِكَ فَقَالُوْۤا اَرِنَا اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ بِظُلْمِهِمْ ۚ— ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِنْ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنٰتُ فَعَفَوْنَا عَنْ ذٰلِكَ ۚ— وَاٰتَیْنَا مُوْسٰی سُلْطٰنًا مُّبِیْنًا ۟

(ఓ ప్రవక్తా!) గ్రంథ ప్రజలు నిన్ను ఆకాశం నుండి వారిపై ఒక గ్రంథాన్ని అవతరింపజేయమని, అడుగుతున్నారని (ఆశ్చర్య పడకు). వాస్తవానికి వారు మూసాను ఇంతకంటే దారుణమైన దానిని కోరుతూ: "అల్లాహ్ ను మాకు ప్రత్యక్ష్యంగా చూపించు!" అని అడిగారు. అప్పుడు వారి దుర్మార్గానికి ఫలితంగా వారిపై పిడుగు విరుచుకు పడింది.[1] స్పష్టమైన సూచనలు లభించిన తరువాతనే వారు ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. అయినా దానికి మేము వారిని క్షమించాము. మరియు మూసాకు మేము స్పష్టమైన అధికార మిచ్చాము. info

[1] చూడండి, 2:55.

التفاسير:

external-link copy
154 : 4

وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّوْرَ بِمِیْثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَّقُلْنَا لَهُمْ لَا تَعْدُوْا فِی السَّبْتِ وَاَخَذْنَا مِنْهُمْ مِّیْثَاقًا غَلِیْظًا ۟

మరియు మేము వారిపై తూర్ పర్వతాన్ని ఎత్తి ప్రమాణం తీసుకున్నాము. మేము వారితో: "సాష్టాంగపడుతూ (వంగుతూ) ద్వారంలో ప్రవేశించండి." అని అన్నాము.[1] మరియు: "శనివారపు (సబ్త్) శాసనాన్ని ఉల్లంఘించకండి." అని కూడా వారితో అన్నాము. మరియు మేము వారితో దృఢమైన ప్రమాణం కూడా తీసుకున్నాము.[2] info

[1] చూడండి, 2:58-59. [2] చూడండి, 'స'హీ'హ్ బు.'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 615.

التفاسير: