அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

பக்க எண்:close

external-link copy
80 : 4

مَنْ یُّطِعِ الرَّسُوْلَ فَقَدْ اَطَاعَ اللّٰهَ ۚ— وَمَنْ تَوَلّٰی فَمَاۤ اَرْسَلْنٰكَ عَلَیْهِمْ حَفِیْظًا ۟ؕ

ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే.[1] మరియు కాదని వెనుదిరిగి పోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్ను పంపలేదు. info

[1] చూడండి, 'స. బు'ఖారీ పుస్తకం - 9, 'హదీస్' నం. 251, 384.

التفاسير:

external-link copy
81 : 4

وَیَقُوْلُوْنَ طَاعَةٌ ؗ— فَاِذَا بَرَزُوْا مِنْ عِنْدِكَ بَیَّتَ طَآىِٕفَةٌ مِّنْهُمْ غَیْرَ الَّذِیْ تَقُوْلُ ؕ— وَاللّٰهُ یَكْتُبُ مَا یُبَیِّتُوْنَ ۚ— فَاَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَی اللّٰهِ ؕ— وَكَفٰی بِاللّٰهِ وَكِیْلًا ۟

మరియు వారు (నీ సమక్షంలో): "మేము విధేయులమయ్యాము." అని పలుకుతారు. కాని నీ వద్ద నుండి వెళ్ళి పోయిన తరువాత వారిలో కొందరు రాత్రివేళలో నీవు చెప్పిన దానికి విరుద్ధంగా సంప్రదింపులు జరుపుతారు. మరియు వారి రహస్య సంప్రదింపులన్నీ అల్లాహ్ వ్రాస్తున్నాడు. కనుక నీవు వారి నుండి ముఖము త్రిప్పుకో మరియు అల్లాహ్ పై ఆధారపడి ఉండు. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు! info
التفاسير:

external-link copy
82 : 4

اَفَلَا یَتَدَبَّرُوْنَ الْقُرْاٰنَ ؕ— وَلَوْ كَانَ مِنْ عِنْدِ غَیْرِ اللّٰهِ لَوَجَدُوْا فِیْهِ اخْتِلَافًا كَثِیْرًا ۟

ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా! [1] info

[1] ఖుర్ఆన్ 23 సంవత్సరాలలో అవతరింపజేయబడింది. అయినా అందులో ఏ విధమైన పరస్పర విరుద్ధమైన విషయాలు లేవు. ఇదే దాని దివ్యావతరణకు సాక్ష్యం. ఇంకా ఇందులో చెప్పబడిన పూర్వకాల చరిత్రలు కేవలం అగోచర జ్ఞానసంపన్నుడు ('అల్లాముల్ 'గుయూబ్) అయిన అల్లాహ్ (సు.తా.) యే తెలుపగలడు. మరియు ఇందులో దాదాపు వేయి వైజ్ఞానశాస్త్రానికి (Science) చెందినవిషయాలు 1400 సంవత్సరాల ముందు చెప్పబడ్డాయి. వాటిలో కొన్ని ఇప్పుడిప్పుడే ఆవిష్కరించబడ్డాయి. ఉదాహరణకు : భూమ్యాకాశాల సృష్టి ఒక పెద్ద ప్రేలుడుతో సంభవించింది. ప్రతి జీవరాశి నీటితో సృష్టించబడింది, మానవుడు మట్టితో, అంటే మట్టిలో ఉన్న మూలపదార్థా(Elements)లతో సృష్టించబడినాడు, సూర్యచంద్రుల సంచారం, రాత్రింబవళ్ళ మార్పులు మొదలైనవి. ఇంకా ఎన్నో ఇంత వరకు ఆవిష్కరించబడలేదు. వీటన్నింటినీ గురించి ఆలోచిస్తే, తెలివిగలవారు, ఈ విషయాలు 1400 సంవత్సరాలకు పూర్వం మానవునికి తెలియవు, కాబట్టి ఇవి అగోచర జ్ఞానం గల ఏకైక ప్రభువు, సర్వశక్తిశాలి, సర్వసృష్టికి మూలాధారి, మాత్రమే తెలుపగలడని, తెలుసుకుంటారు. అంటే ఈ విషయాలన్నీ వ్రాయబడిన, ఈ ఖుర్ఆన్ మానవుని చేతిపని కాజాలదు, అది కేవలం దివ్య ఆవిష్కృతియే అని నమ్ముతారు.

التفاسير:

external-link copy
83 : 4

وَاِذَا جَآءَهُمْ اَمْرٌ مِّنَ الْاَمْنِ اَوِ الْخَوْفِ اَذَاعُوْا بِهٖ ؕ— وَلَوْ رَدُّوْهُ اِلَی الرَّسُوْلِ وَاِلٰۤی اُولِی الْاَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِیْنَ یَسْتَنْۢبِطُوْنَهٗ مِنْهُمْ ؕ— وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ لَاتَّبَعْتُمُ الشَّیْطٰنَ اِلَّا قَلِیْلًا ۟

మరియు వారు (ప్రజల గురించి) ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు, దానిని వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారు దానిని సందేశహరునికో, లేదా వారిలో నిర్ణయాధికారం గలవారికో తెలియజేసి ఉంటే! దానిని విచారించ గలవారు, వారి నుండి దానిని విని అర్థం చేసుకునే వారు. మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారణ్యమే లేకుంటే మీలో కొందరు తప్ప మిగతా వారందరూ షైతాన్ ను అనుసరించి ఉండేవారు. info
التفاسير:

external-link copy
84 : 4

فَقَاتِلْ فِیْ سَبِیْلِ اللّٰهِ ۚ— لَا تُكَلَّفُ اِلَّا نَفْسَكَ وَحَرِّضِ الْمُؤْمِنِیْنَ ۚ— عَسَی اللّٰهُ اَنْ یَّكُفَّ بَاْسَ الَّذِیْنَ كَفَرُوْا ؕ— وَاللّٰهُ اَشَدُّ بَاْسًا وَّاَشَدُّ تَنْكِیْلًا ۟

కావున నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ మట్టుకే బాధ్యుడవు. మరియు విశ్వాసులను (యుద్ధానికి) ప్రోత్సహించు. అల్లాహ్ సత్యతిరస్కారుల శక్తిని అణచవచ్చు! మరియు అల్లాహ్ అంతులేని శక్తిగలవాడు మరియు శిక్షించటంలో చాలా కఠినుడు! info
التفاسير:

external-link copy
85 : 4

مَنْ یَّشْفَعْ شَفَاعَةً حَسَنَةً یَّكُنْ لَّهٗ نَصِیْبٌ مِّنْهَا ۚ— وَمَنْ یَّشْفَعْ شَفَاعَةً سَیِّئَةً یَّكُنْ لَّهٗ كِفْلٌ مِّنْهَا ؕ— وَكَانَ اللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ مُّقِیْتًا ۟

మంచి విషయం కొరకు సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. మరియు చెడు విషయం కొరకు సిఫారసు చేసేవాడు దానికి బాధ్యత వహిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై అధికారం గలవాడు.[1] info

[1] ముఖీతున్ (అల్ ముఖీతు): = అల్-'హాఫి"జ్. కాపాడు, కావలి ఉండు, ఆధారం, శరణం, రక్షణ ఇచ్చేవాడు, విశ్వాధికారి, Protector, Watcher, Preserver, Observer, Controller, All-Witness, అదుపులో ఉంచు, అణచు, క్రమబద్ధం చేయు, అధికారం గల, కనిపెట్టుకొని ఉండు, గమనించు, ప్రతిదానిపై తన దృష్టిని ఉంచి వున్నవాడు, పరిశీలకుడు అనే అర్థాలున్నాయి. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. (ఇది సేకరించబడిన పదం) ఇక్కడ ఒకేసారి వచ్చింది.

التفاسير:

external-link copy
86 : 4

وَاِذَا حُیِّیْتُمْ بِتَحِیَّةٍ فَحَیُّوْا بِاَحْسَنَ مِنْهَاۤ اَوْ رُدُّوْهَا ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلٰی كُلِّ شَیْءٍ حَسِیْبًا ۟

మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం చెయ్యండి లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). [1] నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానిని పరిగణించగలవాడు.[2] info

[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 246. [2] అల్-'హసీబు: Reckoner, Taker of Accounts, Sufficer, or giver of what is sufficient. లెక్కతీసుకునే, పరిగణించే వాడు. చూడండి, 4:6.

التفاسير: