அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத்

பக்க எண்:close

external-link copy
122 : 4

وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— وَعْدَ اللّٰهِ حَقًّا ؕ— وَمَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ قِیْلًا ۟

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! మేము వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాము; అందులో వారు శాశ్వతంగా కలకాల ముంటారు. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. మరియు పలుకులలో అల్లాహ్ కంటే ఎక్కువ సత్యవంతుడెవడు? info
التفاسير:

external-link copy
123 : 4

لَیْسَ بِاَمَانِیِّكُمْ وَلَاۤ اَمَانِیِّ اَهْلِ الْكِتٰبِ ؕ— مَنْ یَّعْمَلْ سُوْٓءًا یُّجْزَ بِهٖ ۙ— وَلَا یَجِدْ لَهٗ مِنْ دُوْنِ اللّٰهِ وَلِیًّا وَّلَا نَصِیْرًا ۟

మీ కోరికల ప్రకారంగా గానీ, లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గానీ (మోక్షం) లేదు! పాపం చేసిన వానికి దానికి తగిన శిక్ష ఇవ్వబడుతుంది; మరియు వాడు, అల్లాహ్ తప్ప మరొక రక్షకుడిని గానీ, సహాయకుడిని గానీ పొందలేడు! info
التفاسير:

external-link copy
124 : 4

وَمَنْ یَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ مِنْ ذَكَرٍ اَوْ اُ وَهُوَ مُؤْمِنٌ فَاُولٰٓىِٕكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ وَلَا یُظْلَمُوْنَ نَقِیْرًا ۟

మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు. info
التفاسير:

external-link copy
125 : 4

وَمَنْ اَحْسَنُ دِیْنًا مِّمَّنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ وَّاتَّبَعَ مِلَّةَ اِبْرٰهِیْمَ حَنِیْفًا ؕ— وَاتَّخَذَ اللّٰهُ اِبْرٰهِیْمَ خَلِیْلًا ۟

మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? [1] మరియు అల్లాహ్ ! ఇబ్రాహీమ్ ను తన స్నేహితునిగా చేసుకున్నాడు. info

[1] చూడండి, 2:135.

التفاسير:

external-link copy
126 : 4

وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَكَانَ اللّٰهُ بِكُلِّ شَیْءٍ مُّحِیْطًا ۟۠

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి అల్లాహ్ ప్రతి దానిని పరివేష్టించి ఉన్నాడు. info
التفاسير:

external-link copy
127 : 4

وَیَسْتَفْتُوْنَكَ فِی النِّسَآءِ ؕ— قُلِ اللّٰهُ یُفْتِیْكُمْ فِیْهِنَّ ۙ— وَمَا یُتْلٰی عَلَیْكُمْ فِی الْكِتٰبِ فِیْ یَتٰمَی النِّسَآءِ الّٰتِیْ لَا تُؤْتُوْنَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُوْنَ اَنْ تَنْكِحُوْهُنَّ وَالْمُسْتَضْعَفِیْنَ مِنَ الْوِلْدَانِ ۙ— وَاَنْ تَقُوْمُوْا لِلْیَتٰمٰی بِالْقِسْطِ ؕ— وَمَا تَفْعَلُوْا مِنْ خَیْرٍ فَاِنَّ اللّٰهَ كَانَ بِهٖ عَلِیْمًا ۟

మరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు (ఫత్వా)ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "అల్లాహ్ వారిని (స్త్రీలను) గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు: 'అనాథ స్త్రీలను, వారి కొరకు నిర్ణయించబడిన హక్కు (మహ్ర్) ను మీరు వారికివ్వక, వారిని పెండ్లాడ గోరుతున్న విషయాన్ని గురించీ మరియు బలహీనులైన బిడ్డలను గురించీ మరియు అనాథ పిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని, ఈ గ్రంథంలో మీకు తెలుపబడుతోంది.'[1] మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పకుండా తెలుస్తుంది." info

[1] చూడండి, 4:3.

التفاسير: