ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - තෙළිඟු පරිවර්තනය - අබ්දුල් රහීම් බින් මුහම්මද්

පිටු අංක:close

external-link copy
171 : 4

یٰۤاَهْلَ الْكِتٰبِ لَا تَغْلُوْا فِیْ دِیْنِكُمْ وَلَا تَقُوْلُوْا عَلَی اللّٰهِ اِلَّا الْحَقَّ ؕ— اِنَّمَا الْمَسِیْحُ عِیْسَی ابْنُ مَرْیَمَ رَسُوْلُ اللّٰهِ وَكَلِمَتُهٗ ۚ— اَلْقٰىهَاۤ اِلٰی مَرْیَمَ وَرُوْحٌ مِّنْهُ ؗ— فَاٰمِنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ ۫— وَلَا تَقُوْلُوْا ثَلٰثَةٌ ؕ— اِنْتَهُوْا خَیْرًا لَّكُمْ ؕ— اِنَّمَا اللّٰهُ اِلٰهٌ وَّاحِدٌ ؕ— سُبْحٰنَهٗۤ اَنْ یَّكُوْنَ لَهٗ وَلَدٌ ۘ— لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَكَفٰی بِاللّٰهِ وَكِیْلًا ۟۠

ఓ గ్రంథప్రజలారా! మీరు మీ ధర్మ విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి.[1] మరియు అల్లాహ్ ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ (ఏసు క్రీస్తు), అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన (అల్లాహ్) మర్యమ్ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్) యొక్క ఆజ్ఞ (కలిమ)[2] మరియు ఆయన (అల్లాహ్) తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ (రూహ్). కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు (ఆరాధ్య దైవాలు): "ముగ్గురు!" అని అనకండి.[3] అది మానుకోండి, మీకే మేలైనది! నిశ్చయంగా, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు. info

[1] 'గులువ్వున్: అంటే అతిగా ప్రవర్తించటం. అంటే ఇక్కడ క్రైస్తవులు 'ఈసా ('అ.స.)కు మరియు అతని తల్లికి అంట గట్టిన స్థానం. వారు ఆ ఇద్దరికి దైవత్వపు స్థానం అంట గట్టి వారిని ఆరాధించసాగారు. చూడండి, 9:31. [2] కలిమతుల్లాహ్: అల్లాహ్ (సు.తా.) యొక్క మాట, పదం, సంకేతం, ఉత్తరువు లేక ఆజ్ఞ. అంటే అల్లాహుతా'ఆలా ఏదైనా చేయదలుచుకుంటే దానిని : "అయిపో" (కున్)! అని ఆజ్ఞాపిస్తాడు, అంతే అది అయిపోతుంది (ఫ యకూన్). చూడండి, 3:45. [3] క్రైస్తవులలో కొందరు 'ఈసా ('అ.స.) స్వయంగా దేవుడే అంటారు. మరికొందరు అతనిని దేవుని కుమారుడు అని అంటారు. ఇంకా కొందరు ముగ్గురు దైవాలున్నారంటారు. ఆ ముగ్గురు అల్లాహ్ (సు.తా.), జిబ్రీల్ మరియు 'ఈసా ('అలైహిమ్ స.) అని అంటారు. ఇది మానుకనండని అల్లాహుతా'ఆలా ఆజ్ఞాపిస్తున్నాడు.

التفاسير:

external-link copy
172 : 4

لَنْ یَّسْتَنْكِفَ الْمَسِیْحُ اَنْ یَّكُوْنَ عَبْدًا لِّلّٰهِ وَلَا الْمَلٰٓىِٕكَةُ الْمُقَرَّبُوْنَ ؕ— وَمَنْ یَّسْتَنْكِفْ عَنْ عِبَادَتِهٖ وَیَسْتَكْبِرْ فَسَیَحْشُرُهُمْ اِلَیْهِ جَمِیْعًا ۟

తాను, అల్లాహ్ కు దాసుడననే విషయాన్ని మసీహ్ (క్రీస్తు) ఎన్నడూ ఉపేక్షించలేదు. మరియు ఆయనకు (అల్లాహ్ కు) సన్నిహితంగా ఉండే దేవదూతలు కూడాను. మరియు ఎవరు ఆయన (అల్లాహ్) దాస్యాన్ని ఉపేక్షించి, గర్వం ప్రదర్శిస్తారో వారందరినీ ఆయన తన ముందు సమావేశపరుస్తాడు. info
التفاسير:

external-link copy
173 : 4

فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَیُوَفِّیْهِمْ اُجُوْرَهُمْ وَیَزِیْدُهُمْ مِّنْ فَضْلِهٖ ۚ— وَاَمَّا الَّذِیْنَ اسْتَنْكَفُوْا وَاسْتَكْبَرُوْا فَیُعَذِّبُهُمْ عَذَابًا اَلِیْمًا ۙ۬— وَّلَا یَجِدُوْنَ لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ وَلِیًّا وَّلَا نَصِیْرًا ۟

కానీ, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి ఆయన వారి ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు మరియు తన అనుగ్రహంతో మరింత అధికంగా ఇస్తాడు. ఇక ఆయనను నిరాకరించి, గర్వం వహించేవారికి బాధాకరమైన శిక్ష విధిస్తాడు;[1] మరియు వారు తమ కొరకు - అల్లాహ్ తప్ప ఇతర రక్షించే వాడిని గానీ, సహాయపడే వాడిని గానీ పొందలేరు. info

[1] చూడండి, 40:60.

التفاسير:

external-link copy
174 : 4

یٰۤاَیُّهَا النَّاسُ قَدْ جَآءَكُمْ بُرْهَانٌ مِّنْ رَّبِّكُمْ وَاَنْزَلْنَاۤ اِلَیْكُمْ نُوْرًا مُّبِیْنًا ۟

ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. info
التفاسير:

external-link copy
175 : 4

فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَاعْتَصَمُوْا بِهٖ فَسَیُدْخِلُهُمْ فِیْ رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ ۙ— وَّیَهْدِیْهِمْ اِلَیْهِ صِرَاطًا مُّسْتَقِیْمًا ۟ؕ

కావున ఎవరు అల్లాహ్ ను విశ్వసించి, ఆయననే దృఢంగా నమ్ముకుంటారో, వారిని ఆయన తన కారుణ్యానికి మరియు అనుగ్రహానికి పాత్రులుగా చేసుకొని తన వద్దకు చేరే ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. info
التفاسير: