పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు: 171:151 close

external-link copy
164 : 7

وَاِذْ قَالَتْ اُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُوْنَ قَوْمَا ۙ— ١للّٰهُ مُهْلِكُهُمْ اَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِیْدًا ؕ— قَالُوْا مَعْذِرَةً اِلٰی رَبِّكُمْ وَلَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟

వారిలోని ఒక వర్గం వారు: "అల్లాహ్ ఎవరిని నశింప జేయనున్నాడో లేదా ఎవరికి కఠినశిక్ష విధించనున్నాడో! అలాంటి వారికి, మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు?" అని అంటే అతను (ఉపదేశం చేసే వ్యక్తి) అన్నాడు: "మీ ప్రభువు ముందు, (హింతబోధ ఎందుకు చేయలేదని), నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గల వారు అవుతారేమోనని!" info
التفاسير:

external-link copy
165 : 7

فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖۤ اَنْجَیْنَا الَّذِیْنَ یَنْهَوْنَ عَنِ السُّوْٓءِ وَاَخَذْنَا الَّذِیْنَ ظَلَمُوْا بِعَذَابٍۭ بَىِٕیْسٍ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟

తరువాత వారికి చేయబడిన హితబోధను వారు మరచినప్పుడు! దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్న వారిని మేము రక్షించాము. మరియు దుర్మార్గులైన ఇతరులను, అవిధేయత చూపినందుకు కఠినశిక్షకు గురిచేశాము. info
التفاسير:

external-link copy
166 : 7

فَلَمَّا عَتَوْا عَنْ مَّا نُهُوْا عَنْهُ قُلْنَا لَهُمْ كُوْنُوْا قِرَدَةً خٰسِىِٕیْنَ ۟

కాని నిషేధించబడిన వాటినే వారు హద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో: "మీరు నీచమైన కోతులుగా మారండి." అని అన్నాము. [1] info

[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 481. ఇంకా చూడండి, 2:65, 5:60.

التفاسير:

external-link copy
167 : 7

وَاِذْ تَاَذَّنَ رَبُّكَ لَیَبْعَثَنَّ عَلَیْهِمْ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ مَنْ یَّسُوْمُهُمْ سُوْٓءَ الْعَذَابِ ؕ— اِنَّ رَبَّكَ لَسَرِیْعُ الْعِقَابِ ۖۚ— وَاِنَّهٗ لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟

మరియు నీ ప్రభువు వారిపై (యూదులపై) అంతిమదినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించే వారిని పంపుతూ ఉంటానని ప్రకటించిన విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకోండి)[1]. నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు, మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. info

[1] చూడండి, 3:112.

التفاسير:

external-link copy
168 : 7

وَقَطَّعْنٰهُمْ فِی الْاَرْضِ اُمَمًا ۚ— مِنْهُمُ الصّٰلِحُوْنَ وَمِنْهُمْ دُوْنَ ذٰلِكَ ؗ— وَبَلَوْنٰهُمْ بِالْحَسَنٰتِ وَالسَّیِّاٰتِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟

మరియు మేము వారిని భువిలో వేర్వేరు తెగలుగా జేసి వ్యాపింప జేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరి కొందరు దానికి దూరమైన వారున్నారు. బహుశా వారు (సన్మార్గానికి) మరలి వస్తారేమోనని, మేము వారిని మంచి-చెడు స్థితుల ద్వారా పరీక్షించాము. info
التفاسير:

external-link copy
169 : 7

فَخَلَفَ مِنْ بَعْدِهِمْ خَلْفٌ وَّرِثُوا الْكِتٰبَ یَاْخُذُوْنَ عَرَضَ هٰذَا الْاَدْنٰی وَیَقُوْلُوْنَ سَیُغْفَرُ لَنَا ۚ— وَاِنْ یَّاْتِهِمْ عَرَضٌ مِّثْلُهٗ یَاْخُذُوْهُ ؕ— اَلَمْ یُؤْخَذْ عَلَیْهِمْ مِّیْثَاقُ الْكِتٰبِ اَنْ لَّا یَقُوْلُوْا عَلَی اللّٰهِ اِلَّا الْحَقَّ وَدَرَسُوْا مَا فِیْهِ ؕ— وَالدَّارُ الْاٰخِرَةُ خَیْرٌ لِّلَّذِیْنَ یَتَّقُوْنَ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟

ఆ పిదప వారి తరువాత దుష్టులైన వారు వారి స్థానంలో గ్రంథానికి వారసులై, తుచ్ఛమైన ప్రాపంచిక వస్తువుల లోభంలో పడుతూ: "మేము క్షమింపబడతాము." అని పలుకుతున్నారు. అయినా ఇటువంటి సొత్తు తిరిగి వారికి లభిస్తే దానిని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. "అల్లాహ్ విషయంలో సత్యం తప్ప మరేమీ పలుకరాదు." అని గ్రంథంలో వారితో వాగ్దానం తీసుకో బడలేదా ఏమిటి? అందులో (గ్రంథంలో) ఉన్నదంతా వారు చదివారు కదా! మరియు దైభీతి గలవారి కొరకు పరలోక నివాసమే ఉత్తమమైనది, ఏమీ? మీరిది గ్రహించలేరా? info
التفاسير:

external-link copy
170 : 7

وَالَّذِیْنَ یُمَسِّكُوْنَ بِالْكِتٰبِ وَاَقَامُوا الصَّلٰوةَ ؕ— اِنَّا لَا نُضِیْعُ اَجْرَ الْمُصْلِحِیْنَ ۟

మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో, అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా మేము వ్యర్థం చేయము. info
التفاسير: