పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
96 : 7

وَلَوْ اَنَّ اَهْلَ الْقُرٰۤی اٰمَنُوْا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَیْهِمْ بَرَكٰتٍ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ وَلٰكِنْ كَذَّبُوْا فَاَخَذْنٰهُمْ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟

మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి, దైవభీతి కలిగి ఉంటే - మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి - సర్వశుభాల నొసంగి ఉండేవారం. కాని వారు (ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు, కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము. info
التفاسير:

external-link copy
97 : 7

اَفَاَمِنَ اَهْلُ الْقُرٰۤی اَنْ یَّاْتِیَهُمْ بَاْسُنَا بَیَاتًا وَّهُمْ نَآىِٕمُوْنَ ۟ؕ

ఏమీ? ఈ నగరాలవాసులు, తాము నిద్రపోయేటప్పుడు రాత్రి సమయమన వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా? info
التفاسير:

external-link copy
98 : 7

اَوَاَمِنَ اَهْلُ الْقُرٰۤی اَنْ یَّاْتِیَهُمْ بَاْسُنَا ضُحًی وَّهُمْ یَلْعَبُوْنَ ۟

లేదా ఈ నగరాల వాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా? info
التفاسير:

external-link copy
99 : 7

اَفَاَمِنُوْا مَكْرَ اللّٰهِ ۚ— فَلَا یَاْمَنُ مَكْرَ اللّٰهِ اِلَّا الْقَوْمُ الْخٰسِرُوْنَ ۟۠

ఏమీ? వారు అల్లాహ్ యుక్తి (శిక్ష) నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప ఇతర జాతి వారెవ్వరూ అల్లాహ్ యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు.[1] info

[1] చూడండి, 3:54, 33:62 మరియు 35:43.

التفاسير:

external-link copy
100 : 7

اَوَلَمْ یَهْدِ لِلَّذِیْنَ یَرِثُوْنَ الْاَرْضَ مِنْ بَعْدِ اَهْلِهَاۤ اَنْ لَّوْ نَشَآءُ اَصَبْنٰهُمْ بِذُنُوْبِهِمْ ۚ— وَنَطْبَعُ عَلٰی قُلُوْبِهِمْ فَهُمْ لَا یَسْمَعُوْنَ ۟

ఏమీ? పూర్వపు భూలోకవాసుల తరువాత, భూమికి వారసులయిన వారికి, మేము కోరితే వారి పాపాల వలన వారికి కూడా శిక్ష విధించగలమని ఉపదేశం అందలేదా? మరియు మేము, వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాము, దాని వల్ల వారు (మా హితోపదేశాన్ని) వినలేకున్నారు. info
التفاسير:

external-link copy
101 : 7

تِلْكَ الْقُرٰی نَقُصُّ عَلَیْكَ مِنْ اَنْۢبَآىِٕهَا ۚ— وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ۚ— فَمَا كَانُوْا لِیُؤْمِنُوْا بِمَا كَذَّبُوْا مِنْ قَبْلُ ؕ— كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰی قُلُوْبِ الْكٰفِرِیْنَ ۟

ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన (నిదర్శనాలు) తీసుకొని వచ్చారు.[1] కాని వారు ముందు తిరస్కరించిన దానిని మరల విశ్వసించలేదు. ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారుల హృదయాలపై ముద్ర వేస్తాడు. [2] info

[1] చూడండి, 17:15. [2] అల్లాహ్ (సు.తా.) కు ప్రతిదానిని గురించి, దాని భూతకాలపు, వర్తమానకాలపు మరియు భవిష్యత్తు కాలపు విషయాలన్నీ తెలుసు. ఇదంతా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అల్లాహుతా'ఆలా సర్వవ్యాప్తి, సర్వస్వపరిచితుడు. కాబట్టి, ఇక్కడ: "సత్యతిరస్కారుల హృదయాల మీద ముద్రవేయబడి ఉంది." అని చెప్పబడింది. ('స. బు'ఖారీ, తఫ్సీర్ సూ. అల్లైల్)

التفاسير:

external-link copy
102 : 7

وَمَا وَجَدْنَا لِاَكْثَرِهِمْ مِّنْ عَهْدٍ ۚ— وَاِنْ وَّجَدْنَاۤ اَكْثَرَهُمْ لَفٰسِقِیْنَ ۟

మరియు మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించే వారిగా చూడలేదు. మరియు వాస్తవానికి వారిలో చాలా మందిని దుష్టులుగానే (ఫాసిఖీన్ గానే) పొందాము (చూశాము). info
التفاسير:

external-link copy
103 : 7

ثُمَّ بَعَثْنَا مِنْ بَعْدِهِمْ مُّوْسٰی بِاٰیٰتِنَاۤ اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ فَظَلَمُوْا بِهَا ۚ— فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِیْنَ ۟

ఆ తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. వారు వాటి (మా సూచనల) పట్ల దుర్మార్గంతో ప్రవర్తించారు. కావున చూడండి, దౌర్జన్యపరుల గతి ఏమయిందో! info
التفاسير:

external-link copy
104 : 7

وَقَالَ مُوْسٰی یٰفِرْعَوْنُ اِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟ۙ

మరియు మూసా అన్నాడు: "ఓ ఫిర్ఔన్! నేను నిశ్చయంగా, సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను! info
التفاسير: