పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
150 : 7

وَلَمَّا رَجَعَ مُوْسٰۤی اِلٰی قَوْمِهٖ غَضْبَانَ اَسِفًا ۙ— قَالَ بِئْسَمَا خَلَفْتُمُوْنِیْ مِنْ بَعْدِیْ ۚ— اَعَجِلْتُمْ اَمْرَ رَبِّكُمْ ۚ— وَاَلْقَی الْاَلْوَاحَ وَاَخَذَ بِرَاْسِ اَخِیْهِ یَجُرُّهٗۤ اِلَیْهِ ؕ— قَالَ ابْنَ اُمَّ اِنَّ الْقَوْمَ اسْتَضْعَفُوْنِیْ وَكَادُوْا یَقْتُلُوْنَنِیْ ۖؗ— فَلَا تُشْمِتْ بِیَ الْاَعْدَآءَ وَلَا تَجْعَلْنِیْ مَعَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟

మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు: "నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది! ఏమీ? మీ ప్రభువు ఆజ్ఞ (రాకముందే) తొందరపడి (ఆయన ఆరాధనను వదిలారా)?" తరువాత ఫలకాలను పడవేసి,[1] తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తన వైపుకు లాగాడు. (హారూన్) అన్నాడు: "నా సోదరుడా (తల్లి కుమారుడా!) వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే,[2] కావున నీవు (మన) శత్రువులకు, నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు!" info

[1] మూసా ('అ.స.) తన జాతివారు అల్లాహ్ (సు.తా.) ను వదలి ఆవుదూడ విగ్రహాన్ని ఆరాధించటాన్ని చూసి, క్రోధావేశంలో ఏమీ తోచక - తన సోదరుణ్ణి పట్టుకొని శిక్షించటానికి, తన చేతులలో ఉన్న ఫలకాలను క్రిందపెట్టి - తన సోదరుని తలవెంట్రుకలను పట్టుకున్నారే గానీ, ఫలకాలకు అనాదరణ చేయటం అతని ఉద్దేశం కాదు. కోపం చల్లారిన తరువాత అతను వాటిని ఎత్తుకున్నారు. చూడండి, ఆయత్, 154. [2] చూడండి, 20:92-94.

التفاسير:

external-link copy
151 : 7

قَالَ رَبِّ اغْفِرْ لِیْ وَلِاَخِیْ وَاَدْخِلْنَا فِیْ رَحْمَتِكَ ۖؗ— وَاَنْتَ اَرْحَمُ الرّٰحِمِیْنَ ۟۠

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా సోదరుణ్ణి క్షమించు. మరియు మా ఇద్దరినీ నీ కారుణ్యంలోకి చేర్చుకో. మరియు నీవే కరుణించే వారిలో అందరి కంటే అధికంగా కరుణించేవాడవు!" info
التفاسير:

external-link copy
152 : 7

اِنَّ الَّذِیْنَ اتَّخَذُوا الْعِجْلَ سَیَنَالُهُمْ غَضَبٌ مِّنْ رَّبِّهِمْ وَذِلَّةٌ فِی الْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُفْتَرِیْنَ ۟

ఆవుదూడను (దైవంగా) చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురి అవుతారు మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము. info
التفاسير:

external-link copy
153 : 7

وَالَّذِیْنَ عَمِلُوا السَّیِّاٰتِ ثُمَّ تَابُوْا مِنْ بَعْدِهَا وَاٰمَنُوْۤا ؗ— اِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟

మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటి వారు నిశ్చయంగా, ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొందుతారు. info
التفاسير:

external-link copy
154 : 7

وَلَمَّا سَكَتَ عَنْ مُّوْسَی الْغَضَبُ اَخَذَ الْاَلْوَاحَ ۖۚ— وَفِیْ نُسْخَتِهَا هُدًی وَّرَحْمَةٌ لِّلَّذِیْنَ هُمْ لِرَبِّهِمْ یَرْهَبُوْنَ ۟

మరియు మూసా కోపం చల్లారిని తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు.[1] మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి. info

[1] మూసా ('అ.స.) ఫలకాలను క్రింద పెట్టారు. అవి ముక్కలు కాలేదు. కావున కోపం చల్లారిన తరువాత మూసా ('అ.స.) ఆ ఫలకాలను తిరిగి తీసుకున్నారు.

التفاسير:

external-link copy
155 : 7

وَاخْتَارَ مُوْسٰی قَوْمَهٗ سَبْعِیْنَ رَجُلًا لِّمِیْقَاتِنَا ۚ— فَلَمَّاۤ اَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ اَهْلَكْتَهُمْ مِّنْ قَبْلُ وَاِیَّایَ ؕ— اَتُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَآءُ مِنَّا ۚ— اِنْ هِیَ اِلَّا فِتْنَتُكَ ؕ— تُضِلُّ بِهَا مَنْ تَشَآءُ وَتَهْدِیْ مَنْ تَشَآءُ ؕ— اَنْتَ وَلِیُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَاَنْتَ خَیْرُ الْغٰفِرِیْنَ ۟

మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు, మూసా తన జాతి వారిలో నుండి డెబ్బై మందిని ఎన్నుకున్నాడు. ఆ పిదప వారిని భూకంపం ఆవరించగా[1] (మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నీవు కోరితే, వీరిని మరియు నన్ను కూడా ఇంతకు పూర్వమే సంహరించి ఉండేవాడవు. ఏమీ? మాలో కొందరు మూఢులు చేసిన పనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే! దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తావు మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్షకుడవు నీవే, కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. మరియు క్షమించే వారందరిలో నీవే అత్యుత్తముడవు!" info

[1] చూడండి, 2:55 అక్కడ పిడుగు ('సా'యిఖతున్) పడి ఆ 70 మంది చనిపోయినట్లు ఉంది. బహుశా ఈ రెండు శిక్షలు వచ్చి ఉండవచ్చు. మూసా ('అ.స.) ప్రార్థన వల్ల ఆ 70 మంది మళ్ళీ సజీవులయ్యారు.

التفاسير: