పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
88 : 7

قَالَ الْمَلَاُ الَّذِیْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لَنُخْرِجَنَّكَ یٰشُعَیْبُ وَالَّذِیْنَ اٰمَنُوْا مَعَكَ مِنْ قَرْیَتِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا ؕ— قَالَ اَوَلَوْ كُنَّا كٰرِهِیْنَ ۟ۚ

దురహంకారులైన అతని జాతి నాయకులన్నారు: "ఓ షుఐబ్! మేము నిన్నూ మరియు నీతో పాటు విశ్వసించిన వారినీ, మా నరగం నుండి తప్పక వెడలగొడ్తాము. లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి!" అతనన్నాడు: "మేము దానిని అసహ్యించుకున్నప్పటికీ (మీ ధర్మంలోకి చేరాలా)?" info
التفاسير:

external-link copy
89 : 7

قَدِ افْتَرَیْنَا عَلَی اللّٰهِ كَذِبًا اِنْ عُدْنَا فِیْ مِلَّتِكُمْ بَعْدَ اِذْ نَجّٰىنَا اللّٰهُ مِنْهَا ؕ— وَمَا یَكُوْنُ لَنَاۤ اَنْ نَّعُوْدَ فِیْهَاۤ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ رَبُّنَا ؕ— وَسِعَ رَبُّنَا كُلَّ شَیْءٍ عِلْمًا ؕ— عَلَی اللّٰهِ تَوَكَّلْنَا ؕ— رَبَّنَا افْتَحْ بَیْنَنَا وَبَیْنَ قَوْمِنَا بِالْحَقِّ وَاَنْتَ خَیْرُ الْفٰتِحِیْنَ ۟

(ఇంకా ఇలా అన్నాడు): "వాస్తవంగా అల్లాహ్ మాకు (మీ ధర్మం నుండి) విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే! మేము అల్లాహ్ పై అబద్ధం కల్పించిన వారమవుతాము. మా ప్రభువైన అల్లాహ్ కోరితే తప్ప! మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. మేము అల్లాహ్ పైననే ఆధరపడి ఉన్నాము. 'ఓ మా ప్రభూ! మా మధ్య మరియు మా జాతివారి మధ్య న్యాయంగా తీర్పు చేయి. మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు!" info
التفاسير:

external-link copy
90 : 7

وَقَالَ الْمَلَاُ الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ لَىِٕنِ اتَّبَعْتُمْ شُعَیْبًا اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَ ۟

మరియు అతన జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు అన్నారు: "ఒకవేళ మీరు షుఐబ్ ను అనుసరిస్తే! నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు." info
التفاسير:

external-link copy
91 : 7

فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِیْنَ ۟

అప్పుడు వారిని ఒక భూకంపం పట్టుకున్నది[1] మరియు వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలై) పడిపోయారు. info

[1] ఇక్కడ రజ్ ఫతున్ - భూకంపం అని, 11:94లో 'సై'హతున్ - భయంకరమైన అరుపు (ధ్వని) అని, మరియు 26:189లో "జుల్లతున్ - మేఘాల ఛాయ అని ఉంది. అన్నీ ఒకదాని వెంట ఒకటి, ఒకేసారి వచ్చాయన్నమాట, (ఇబ్నె-కసీ'ర్).

التفاسير:

external-link copy
92 : 7

الَّذِیْنَ كَذَّبُوْا شُعَیْبًا كَاَنْ لَّمْ یَغْنَوْا فِیْهَا ۛۚ— اَلَّذِیْنَ كَذَّبُوْا شُعَیْبًا كَانُوْا هُمُ الْخٰسِرِیْنَ ۟

షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించినవారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించి పోయారు. షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టం పొందిన వారయ్యారు. info
التفاسير:

external-link copy
93 : 7

فَتَوَلّٰی عَنْهُمْ وَقَالَ یٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسٰلٰتِ رَبِّیْ وَنَصَحْتُ لَكُمْ ۚ— فَكَیْفَ اٰسٰی عَلٰی قَوْمٍ كٰفِرِیْنَ ۟۠

(షుఐబ్) ఇలా అంటూ వారి నుండి మరలి పోయాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను మరియు మీకు హితోపదేశం చేశాను. కావున ఇపుడు సత్యతిరస్కారులైన జాతివారి కొరకు నేనెందుకు దుఃఖించాలి?" info
التفاسير:

external-link copy
94 : 7

وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْیَةٍ مِّنْ نَّبِیٍّ اِلَّاۤ اَخَذْنَاۤ اَهْلَهَا بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ یَضَّرَّعُوْنَ ۟

మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా! దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భగ్యానికి గురి చేయకుండా ఉండలేదు, వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని! info
التفاسير:

external-link copy
95 : 7

ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّیِّئَةِ الْحَسَنَةَ حَتّٰی عَفَوْا وَّقَالُوْا قَدْ مَسَّ اٰبَآءَنَا الضَّرَّآءُ وَالسَّرَّآءُ فَاَخَذْنٰهُمْ بَغْتَةً وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟

ఆ తరువాత వారి దుస్థితిని, సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ, ఇలా అన్నారు: "వాస్తవానికి కష్టసుఖాలు మా పూర్వీకులకు కూడా సంభవించాయి." కావున మేము వారిని ఆకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేక పోయారు.[1] info

[1] చూడండి, 6:42-45.

التفاسير: