పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
138 : 7

وَجٰوَزْنَا بِبَنِیْۤ اِسْرَآءِیْلَ الْبَحْرَ فَاَتَوْا عَلٰی قَوْمٍ یَّعْكُفُوْنَ عَلٰۤی اَصْنَامٍ لَّهُمْ ۚ— قَالُوْا یٰمُوْسَی اجْعَلْ لَّنَاۤ اِلٰهًا كَمَا لَهُمْ اٰلِهَةٌ ؕ— قَالَ اِنَّكُمْ قَوْمٌ تَجْهَلُوْنَ ۟

మరియు మేము ఇస్రాయీల్ సంతతి వారిని సముద్రం దాటించిన తరువాత వారు (నడుస్తూ) తమ విగ్రహాలను ఆరాధించే ఒక జాతి వద్దకు చేరారు.[1] వారన్నారు: "ఓ మూసా! వీరి ఆరాధ్య దైవాల వలే మాకు కూడా ఒక ఆరాధ్య దైవాన్ని నియమించు." (దానికి మూసా) జవాబిచ్చాడు: "నిశ్చయంగా, మీరు జ్ఞానహినులైన జాతికి చెందినవారు." info

[1] ఈ ప్రజలు ఎవరో ఖుర్ఆన్ లో లేదు. వారు అమాలేకీయ (Amalekites) తెగకు చెందిన 'అరబ్బులు కావచ్చు! వీరు దక్షిణ ఫలస్తీన్ లో మరియు సినాయి ద్వీపకల్పం (Peninsula)లో నివసించేవారు.

التفاسير:

external-link copy
139 : 7

اِنَّ هٰۤؤُلَآءِ مُتَبَّرٌ مَّا هُمْ فِیْهِ وَبٰطِلٌ مَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟

"నిశ్చయంగా వీరు ఆచరిస్తున్నందుకు (విగ్రహారాధన చేస్తున్నందుకు) నాశనం చేయబడతారు. వీరు చేస్తున్నదంతా నిరర్థకమైనదే." info
التفاسير:

external-link copy
140 : 7

قَالَ اَغَیْرَ اللّٰهِ اَبْغِیْكُمْ اِلٰهًا وَّهُوَ فَضَّلَكُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟

(మూసా ఇంకా) ఇలా అన్నాడు: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి మరొక ఆరాధ్యదైవాన్ని మీ కొరకు అన్వేషించాలా? వాస్తవానికి ఆయనే (మీకాలపు) సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా!" info
التفاسير:

external-link copy
141 : 7

وَاِذْ اَنْجَیْنٰكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ یَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ ۚ— یُقَتِّلُوْنَ اَبْنَآءَكُمْ وَیَسْتَحْیُوْنَ نِسَآءَكُمْ ؕ— وَفِیْ ذٰلِكُمْ بَلَآءٌ مِّنْ رَّبِّكُمْ عَظِیْمٌ ۟۠

మరియు మేము మిమ్మల్ని ఫిర్ఔన్ జాతి వారి నుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోర బాధకు గురిచేస్తూ ఉన్నారు. మీ కుమారులను చంపి, మీ స్త్రీలను సజీవులుగా వదులుతూ ఉన్నారు. మరియు ఇందు మీ ప్రభువు తరఫు నుండి మీకొక గొప్ప పరీక్ష ఉండింది. info
التفاسير:

external-link copy
142 : 7

وَوٰعَدْنَا مُوْسٰی ثَلٰثِیْنَ لَیْلَةً وَّاَتْمَمْنٰهَا بِعَشْرٍ فَتَمَّ مِیْقَاتُ رَبِّهٖۤ اَرْبَعِیْنَ لَیْلَةً ۚ— وَقَالَ مُوْسٰی لِاَخِیْهِ هٰرُوْنَ اخْلُفْنِیْ فِیْ قَوْمِیْ وَاَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِیْلَ الْمُفْسِدِیْنَ ۟

మరియు మేము మూసా కొరకు (సినాయి కొండపై) ముప్పై రాత్రుల (గడువు) నిర్ణయించాము. తరువాత పది (రాత్రులు) పొడిగించాము. ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన నలభై రాత్రుల గుడువ పూర్తయ్యింది. మూసా తన సోదరుడగు హారూన్ తో అన్నాడు: "నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిథ్యం వహించు మరియు సంస్కరణకు పాటు పడు మరియు అరాచకాలు చేసేవారి మార్గాన్ని అనుసరించకు." info
التفاسير:

external-link copy
143 : 7

وَلَمَّا جَآءَ مُوْسٰی لِمِیْقَاتِنَا وَكَلَّمَهٗ رَبُّهٗ ۙ— قَالَ رَبِّ اَرِنِیْۤ اَنْظُرْ اِلَیْكَ ؕ— قَالَ لَنْ تَرٰىنِیْ وَلٰكِنِ انْظُرْ اِلَی الْجَبَلِ فَاِنِ اسْتَقَرَّ مَكَانَهٗ فَسَوْفَ تَرٰىنِیْ ۚ— فَلَمَّا تَجَلّٰی رَبُّهٗ لِلْجَبَلِ جَعَلَهٗ دَكًّا وَّخَرَّ مُوْسٰی صَعِقًا ۚ— فَلَمَّاۤ اَفَاقَ قَالَ سُبْحٰنَكَ تُبْتُ اِلَیْكَ وَاَنَا اَوَّلُ الْمُؤْمِنِیْنَ ۟

మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి (మా నిర్ణీత చోటుకు) వచ్చినపుడు, అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. (మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యమివ్వు (కనిపించు). నేను నిన్ను చూడదలచాను!" (అల్లాహ్) అన్నాడు: "నీవు నన్ను (ఏ మాత్రం) చూడలేవు! కాని ఈ పర్వతం వైపుకు చూడు! ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే, అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో!" [1] అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమై పోయింది మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత (మూసా) అన్నాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలు తున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటి వాడను." [2] info

[1] 'స'హీ'హ్ 'హదీస్'ల ద్వారా విశదమయ్యేది ఏమిటంటే, ఇహలోక జీవితంలో ఏ మానవుడు కూడా అల్లాహ్ (సు.తా.) ను చూడలేడు. అహ్లె-సున్నత్ వారి అఖీదహ్ ఏమిటంటే పునరుత్థాన దినమున అహ్లె ఈమాన్ (విశ్వాసు)లకు అల్లాహుతా'ఆలా దర్శనభాగ్యం లభిస్తుంది. మరియు స్వర్గంలో కూడా వారికి అల్లాహ్ (సు.తా.) దర్శనం లభిస్తుంది. [2] ఇది రెండవసారి మూసా ('అ.స.) అల్లాహ్ (సు.తా.)తో మాట్లాడింది. మొదటిసారి అతను 'తువా వాదిలో వెలుగు చూసి దాని నుండి కొరివి తీసుకురావటానికి పోయినప్పుడు, అల్లాహుతా'ఆలా అతనిని ప్రవక్తగా ఎన్నుకొని ఫిర్'ఔను జాతి వద్దకు అద్భుత చిహ్నాలతో పంపాడు.

التفاسير: