แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาเตลูกู - อับดุรเราะหีม บิน มุฮัมมัด

หมายเลข​หน้า​:close

external-link copy
76 : 17

وَاِنْ كَادُوْا لَیَسْتَفِزُّوْنَكَ مِنَ الْاَرْضِ لِیُخْرِجُوْكَ مِنْهَا وَاِذًا لَّا یَلْبَثُوْنَ خِلٰفَكَ اِلَّا قَلِیْلًا ۟

మరియు వారు (అవిశ్వాసులు) నిన్ను కలవరపెట్టి, నిన్ను ఈ భూమి నుండి వెడలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు నీవు వెళ్ళిపోయిన తరువాత, వారు కూడా కొద్ది కాలం మాత్రమే ఉండగలిగేవారు.[1] info

[1] కావున కొద్దికాలం తరువాత 2 హి.శ.లో బద్ర్ లో మక్కా ఖురైషుల పలువురు నాయకులు చంపబడ్డారు. మరియు 8వ హిజ్రీలో ముస్లింలు మక్కాను జయించారు.

التفاسير:

external-link copy
77 : 17

سُنَّةَ مَنْ قَدْ اَرْسَلْنَا قَبْلَكَ مِنْ رُّسُلِنَا وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِیْلًا ۟۠

(ఓ ముహమ్మద్!) ఇది వాస్తవానికి! మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరికీ వర్తించిన సంప్రదాయమే! నీవు మా సాంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు. info
التفاسير:

external-link copy
78 : 17

اَقِمِ الصَّلٰوةَ لِدُلُوْكِ الشَّمْسِ اِلٰی غَسَقِ الَّیْلِ وَقُرْاٰنَ الْفَجْرِ ؕ— اِنَّ قُرْاٰنَ الْفَجْرِ كَانَ مَشْهُوْدًا ۟

మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడే వరకూ నమాజ్ లను సలుపు. మరియు ప్రాతఃకాలంలో (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు.[1] నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది.[2] info

[1] ఈ ఆయత్ లో ఐదు విధి (ఫ'ర్ద్) గా సలుప వలసిన నమా'జ్ ల ప్రస్తావన వచ్చింది. సూర్యుడు వాలిన తరువాత జుహ్ర్, సూర్యాస్తమయానికి కొంత కాలం ముందు 'అ'స్ర్, సూర్యాస్తమయం కాగానే మ'గ్ రిబ్, కొంత చీకటి పడ్డ తరువాత 'ఇషా మరియు ప్రాతఃకాలమున సూర్యోదయానికి ముందు ఫజ్ర్ చేయాలని. ఫజ్ర్ నమాజ్ లో ఖుర్ఆన్ పఠనం ఎక్కువగా చేయాలి. ఈ నమా'జ్ లను గురించి వివరాలు 'స'హీ'హ్ 'హదీస్'లలో ఉన్నాయి. [2] ప్రాతఃకాలపు ఫజ్ర్ నమా'జ్ సమయంలో పగటి మరియు రాత్రి దైవదూతలు కలుస్తారు. వారంతా ప్రజల నమా'జ్ లను చూస్తారు. మరియు దానిని గురించి అల్లాహుతా'ఆలాకు తెలుపుతారు. అది అల్లాహ్ (సు.తా.)కు అగోచరమైనది కాదు, కానీ ఆయన (సు.తా.) వారి నుండి తన ప్రజల ప్రశంసలు వినగోరుతాడు. ('స. బు'ఖారీ మరియు ముస్లిం).

التفاسير:

external-link copy
79 : 17

وَمِنَ الَّیْلِ فَتَهَجَّدْ بِهٖ نَافِلَةً لَّكَ ۖۗ— عَسٰۤی اَنْ یَّبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُوْدًا ۟

మరియు రాత్రివేళలో జాగరణ (తహజ్జుద్) నమాజ్ చెయ్యి.[1] ఇది నీ కొరకు అదనపు (నఫిల్) నమాజ్. దీనితో నీ ప్రభువు నిన్ను (పునరుత్థాన దినమున) ప్రశంసనీయమైన స్థానము (మఖామ్మ్ మహ్మూద్) నొసంగవచ్చు! info

[1] తహజ్జుద్: అంటే నిద్రాభంగం. ఇది నఫీల్ నమా'జ్, అంటే అదనంగా చేసే నమా'జ్. దైవప్రవక్త ('స'అస) రాత్రి మొదటి భాగంలో నిద్ర తీసుకొని, చివరి భాగంలో నిద్ర నుండి లేచి నమా'జ్ చేసేవారు, అదే తహజ్జుద్ నమా'జ్. 'స'హీ'హ్ 'హదీస్'లలో దీని వివరాలున్నాయి. ఇంకా చూడండి, 76:26.

التفاسير:

external-link copy
80 : 17

وَقُلْ رَّبِّ اَدْخِلْنِیْ مُدْخَلَ صِدْقٍ وَّاَخْرِجْنِیْ مُخْرَجَ صِدْقٍ وَّاجْعَلْ لِّیْ مِنْ لَّدُنْكَ سُلْطٰنًا نَّصِیْرًا ۟

మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నీవు నా ప్రతి ప్రవేశాన్ని, సత్యప్రవేశంగా చేయి మరియు నా బహిర్గమనాన్ని కూడా సత్య బహిర్గమనంగా చేయి మరియు నీ వైపు నుండి నాకు అధికార శక్తిని, సహాయాన్ని ప్రసాదించు."[1] info

[1] కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ ప్రస్థానం (హిజ్రత్) సమయంలో అవతరింపజేయ బడిందని అంటారు. అంటే యస్'రిబ్ (మదీనా మునవ్వరా) ప్రవేశాన్ని మరియు మక్కా ముకర్రమా బహిర్గమనాన్ని సత్యమైనవి చేయమని దైవప్రవక్త ('స'అస) ప్రార్థిస్తున్నారు. మరికొందరు అంటారు: నన్ను సత్యం మీద మరణింపజేయి మరియు సత్యంతో పునరుత్థరింపజేయి. ఇమామ్ షౌకాని అంటారు: ఈ అన్నీ అర్థాలు కూడా సమంజసమైనవే, ఎందుకంటే ఇది ఒక దు'ఆ.

التفاسير:

external-link copy
81 : 17

وَقُلْ جَآءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ ؕ— اِنَّ الْبَاطِلَ كَانَ زَهُوْقًا ۟

మరియు ఇలా అను: "సత్యం వచ్చింది మరియు అసత్యం అంతరించింది. నిశ్చయంగా అసత్యం అంతరించక తప్పదు.[1] info

[1] మక్కా ముకర్రమా విజయం తరువాత, దైవప్రవక్త ('స'అస) కాబాలో ప్రవేశిస్తారు. అక్కడ 360 విగ్రహాలు ఉంటాయి. వాటిని ఒక చిన్న కట్టెతో కొట్టుతూ ఈ ఆయత్ చదువుతారు. ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).

التفاسير:

external-link copy
82 : 17

وَنُنَزِّلُ مِنَ الْقُرْاٰنِ مَا هُوَ شِفَآءٌ وَّرَحْمَةٌ لِّلْمُؤْمِنِیْنَ ۙ— وَلَا یَزِیْدُ الظّٰلِمِیْنَ اِلَّا خَسَارًا ۟

మరియు మేము ఈ ఖుర్ఆన్ ద్వారా విశ్వాసులకు స్వస్థతను మరియు కారుణ్యాన్ని క్రమక్రమంగా అవతరింపజేస్తాము. కాని దుర్మార్గులకు ఇది నష్టం తప్ప మరేమీ అధికం చేయదు.[1] info

[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 10:57

التفاسير:

external-link copy
83 : 17

وَاِذَاۤ اَنْعَمْنَا عَلَی الْاِنْسَانِ اَعْرَضَ وَنَاٰ بِجَانِبِهٖ ۚ— وَاِذَا مَسَّهُ الشَّرُّ كَانَ یَـُٔوْسًا ۟

మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే, అతడు ముఖం త్రిప్పుకొని (మా నుండి మరలిపోతాడు. కాని అతనికి కీడు కలిగితే నిరాశ చెందుతాడు.[1] info

[1] మానవుడు సుఖసంతోషాలలో ఉన్నప్పుడు అల్లాహ్ (సు.తా.)ను మరచిపోతాడు మరియు కష్టకాలంలో నిరాశ చెందుతాడు. కాని ఒక విశ్వాసి రెండు పరిస్థితులలోనూ తన ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయన స్తోత్రం చేస్తూ ఉంటాడు. చూడండి, 11:9-11.

التفاسير:

external-link copy
84 : 17

قُلْ كُلٌّ یَّعْمَلُ عَلٰی شَاكِلَتِهٖ ؕ— فَرَبُّكُمْ اَعْلَمُ بِمَنْ هُوَ اَهْدٰی سَبِیْلًا ۟۠

వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు, కాని మీ ప్రభువుకు మాత్రం ఎవడు సన్మార్గం పొందే వాడో బాగా తెలుసు."[1] info

[1] దీని సారాంశము, 11:121-122 ఆయత్ ల మాదిరిగానే ఉంది.

التفاسير:

external-link copy
85 : 17

وَیَسْـَٔلُوْنَكَ عَنِ الرُّوْحِ ؕ— قُلِ الرُّوْحُ مِنْ اَمْرِ رَبِّیْ وَمَاۤ اُوْتِیْتُمْ مِّنَ الْعِلْمِ اِلَّا قَلِیْلًا ۟

మరియు వారు నిన్ను ఆత్మ (రూహ్) ను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను: "ఆత్మ! నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. మరియు (దానిని గురించి) మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది."[1] info

[1] అర్-రూ'హు: ఆత్మను గురించి కేవలం అల్లాహ్ (సు.తా.) కు మాత్రమే తెలుసు. దాని జ్ఞానం కేవలం నా ప్రభువు (సు.తా.) కు మాత్రమే ఉంది. దాని జ్ఞానం (సు.తా.) ప్రవక్తల (అ.స.)కు కూడా ఇవ్వలేదు. అది ఆయన (సు.తా.) ఆజ్ఞతో వస్తుంది: 'కున్ ఫ యకూన్.'

التفاسير:

external-link copy
86 : 17

وَلَىِٕنْ شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِیْۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهٖ عَلَیْنَا وَكِیْلًا ۟ۙ

మరియు ఒకవేళ మేము కోరినట్లయితే నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) లాగుకోగలము. (స్వాధీన పరచుకోగలము). అప్పుడు దానిని గురించి, మాకు వ్యతిరేకంగా, నీవు ఏ సహాయకుడినీ పొందలేవు - info
التفاسير: