Vertaling van de betekenissen Edele Qur'an - Telugu-vertaling - Abdul Rahim bin Mohammed

Pagina nummer:close

external-link copy
182 : 2

فَمَنْ خَافَ مِنْ مُّوْصٍ جَنَفًا اَوْ اِثْمًا فَاَصْلَحَ بَیْنَهُمْ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠

కాని వీలునామా చేసిన వ్యక్తి పక్షపాతమో, లేదా అన్యాయమో చేశాడనే భయం ఎవనికైనా ఉంటే అతడు ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులోఎలాంటి దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. info
التفاسير:

external-link copy
183 : 2

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُتِبَ عَلَیْكُمُ الصِّیَامُ كَمَا كُتِبَ عَلَی الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟ۙ

ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది[1], ఏ విదంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబ ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని! info

[1] అ'స్-'సౌమ్ : ఉపవాసం అంటే, మానుకోవటం. ప్రాతఃకాలం నుండి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా త్రాగకుండా మరియు భార్యలతో రతిక్రీడలు జరగకుండా ఉండటమే గాక, తమ పంచేంద్రియాలను, చూపులను, నాలుకను, చెవులను, ఆలోచనలను మరియు చేష్టలను మొదలైన వాటిని కూడా అదుపులో ఉంచుకొని చెడుకు దూరంగా ఉండటం.

التفاسير:

external-link copy
184 : 2

اَیَّامًا مَّعْدُوْدٰتٍ ؕ— فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِیْضًا اَوْ عَلٰی سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَیَّامٍ اُخَرَ ؕ— وَعَلَی الَّذِیْنَ یُطِیْقُوْنَهٗ فِدْیَةٌ طَعَامُ مِسْكِیْنٍ ؕ— فَمَنْ تَطَوَّعَ خَیْرًا فَهُوَ خَیْرٌ لَّهٗ ؕ— وَاَنْ تَصُوْمُوْا خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟

ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తి చేయాలి. కాని దానిని పూర్తి చేయటం దుర్భరమైన వారు పరిహారంగా, ఒక పేదవానికి భోజనం పెట్టాలి[1]. కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే, అది అతని మేలుకే! కాని మీరు తెలుసుకో గలిగితే ఉపవాసం ఉండటమే, మీకు ఎంతో ఉత్తమమైనది. info

[1] అతివృద్ధులు, దీర్ఘవ్యాధితో పీడితులైనవారు, గర్భవతులైన స్త్రీలు, బిడ్డలకు పాలిచ్చే స్త్రీలు మొదలైనవారు, ఉపవాసముండటం వారికి అతి కష్టతరమైతే, పరిహారంగా ప్రతిరోజూ ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కాని గర్భవతులైన స్త్రీలు , పిల్లలకు పాలిచ్చే స్త్రీలు మరియు కొద్దికాలానికి మాత్రమే వ్యాధి గ్రస్థులైన వారు మాత్రం విడిచిన ఉపవాసాలను తరువాత పూర్తి చేసుకోవాలి.

التفاسير:

external-link copy
185 : 2

شَهْرُ رَمَضَانَ الَّذِیْۤ اُنْزِلَ فِیْهِ الْقُرْاٰنُ هُدًی لِّلنَّاسِ وَبَیِّنٰتٍ مِّنَ الْهُدٰی وَالْفُرْقَانِ ۚ— فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْیَصُمْهُ ؕ— وَمَنْ كَانَ مَرِیْضًا اَوْ عَلٰی سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَیَّامٍ اُخَرَ ؕ— یُرِیْدُ اللّٰهُ بِكُمُ الْیُسْرَ وَلَا یُرِیْدُ بِكُمُ الْعُسْرَ ؗ— وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللّٰهَ عَلٰی مَا هَدٰىكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది[1]! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగ టానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి! info

[1] ఖుర్ఆన్, లైలతుల్ ఖద్ర్ లో లౌ'హెమ'హ్ ఫూ"జ్ నుండి ఈ ప్రపంచపు ఆకాశం మీద దింపబడింది. అక్కడ బైతుల్ - ఇ'జ్జత్ లో పెట్టబడింది. అక్కడి నుంచి 23 సంవత్సరాలలో క్రమక్రమంగా అవసరాన్ని బట్టి మహాప్రవక్త ము'హమ్మద్ ('స'అస)పై అవతరింపజేయబడింది, (ఇబ్నె-కసీ'ర్). మొట్టమొదటి వ'హీ 'హిరా గుహలో రమ'దాన్ నెలలో అవతరింపజేయబడింది. మరియు దైవప్రవక్త ('స'అస), తమ మరణానికి ముందు రమ'దాన్ నెలలోనే ఖుర్ఆన్ ను జిబ్రీల్ ('అ.స.) సమక్షంలో, రెండు సార్లు పూర్తిగా చదివి వినిపించారు. మరియు దైవప్రవక్త ('స'అస), అదే రమ'దాన్ నెలలో 23, 25, 27 రాత్రులలో, స'హాబీలకు తరావీ'హ్ నమా'జ్ (ఖియామ్ అల్లైల్) కూడా జమా'అతో చేయించారు. ('స.తిర్మిజీ', 'స. ఇబ్నె-మాజా, అల్బానీ ప్రమాణీకం). ఆ తరావీ'హ్ నమా'జ్ ఎనిమిది రకాతులు, వి'తర్ తో పాటు పదకొండు రకాతులు, అవి జాబిర్ (ర'ది.'అ.) మరియు సయ్యిదా 'ఆయిషహ్ (ర.'అన్హా)ల, ఉల్లేఖనా (రివాయతు)లు ఉన్నాయి. ('స.బు'ఖారీ).

التفاسير:

external-link copy
186 : 2

وَاِذَا سَاَلَكَ عِبَادِیْ عَنِّیْ فَاِنِّیْ قَرِیْبٌ ؕ— اُجِیْبُ دَعْوَةَ الدَّاعِ اِذَا دَعَانِ فَلْیَسْتَجِیْبُوْا لِیْ وَلْیُؤْمِنُوْا بِیْ لَعَلَّهُمْ یَرْشُدُوْنَ ۟

మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: "నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను[1]. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉంటాలి." అని, చెప్పు[2]. info

[1] ఉపవాసం విరమించే వేళలో చేసే ప్రార్థన (దు'ఆ) అంగీకరించబడుతుంది. (ముస్నద్ అ'హ్ మద్, తిర్మిజీ', నసాయీ', ఇబ్నె-మాజా - ఇబ్నె-కసీ'ర్ వ్యాఖ్యానం). [2] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 509.

التفاسير: