Vertaling van de betekenissen Edele Qur'an - Telugu-vertaling - Abdul Rahim bin Mohammed

Pagina nummer:close

external-link copy
164 : 2

اِنَّ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّیْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِیْ تَجْرِیْ فِی الْبَحْرِ بِمَا یَنْفَعُ النَّاسَ وَمَاۤ اَنْزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنْ مَّآءٍ فَاَحْیَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِیْهَا مِنْ كُلِّ دَآبَّةٍ ۪— وَّتَصْرِیْفِ الرِّیٰحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَیْنَ السَّمَآءِ وَالْاَرْضِ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّعْقِلُوْنَ ۟

నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధ రకాల జీవరాసులను వర్ధిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలనున్నాయి.[1] info

[1] ఈ ఆయతులో అల్లాహ్ (సు.తా.) సృష్టించి, నడిపిస్తున్న ప్రకృతి నియమాలను గురించి వివరించడమైనది. 1) భూమ్యాకాశాల సృష్టి, 2) రాత్రింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావటం మరియు వాటి కాలాలలో హెచ్చు తగ్గులు, 3) సముద్రాలలో నావలు ఎంతో భారాన్ని తీసుకొని పయనించటం, 4) వర్షం కురిసి జీవం లేని భూమికి జీవమివ్వటం, 5) వివిధ రకాల జీవరాసుల సృష్టి, 6) చల్లని, వెచ్చని వివిధ దిక్కుల నుండి వీచే గాలి, 7) అల్లాహుతా'ఆలా తాను కోరిన చోట వర్షం కురిపించటానికి, తనకు నియమబద్ధులుగా సృష్టించిన మేఘాలు; వీటన్నింటిలో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి. ఈ కార్యాలలో ఆయనకు మరెవ్వరూ భాగస్వాములు లేరనేది కూడా వ్యక్తమౌతోంది. ఎందుకంటే ఎవరైనా ఆయనకు భాగస్వాములుంటే ఈ సృష్టిలో అల్లకల్లోలం చెలరేగి ఉండేది.

التفاسير:

external-link copy
165 : 2

وَمِنَ النَّاسِ مَنْ یَّتَّخِذُ مِنْ دُوْنِ اللّٰهِ اَنْدَادًا یُّحِبُّوْنَهُمْ كَحُبِّ اللّٰهِ ؕ— وَالَّذِیْنَ اٰمَنُوْۤا اَشَدُّ حُبًّا لِّلّٰهِ ؕ— وَلَوْ یَرَی الَّذِیْنَ ظَلَمُوْۤا اِذْ یَرَوْنَ الْعَذَابَ ۙ— اَنَّ الْقُوَّةَ لِلّٰهِ جَمِیْعًا ۙ— وَّاَنَّ اللّٰهَ شَدِیْدُ الْعَذَابِ ۟

అయినా ఈ మానవులలో కొందరు ఇతరులను, అల్లాహ్ కు సాటి కల్పించుకుని, అల్లాహ్ ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు. మరియు ఈ దుర్మార్గం చేస్తున్న వారు ప్రత్యక్షంగా చూడగలిగితే! ఆ శిక్షను చూసినప్పుడు, వారు నిశ్చయంగా, సర్వశక్తి కేవలం అల్లాహ్ కే చెందుతుంది మరియు నిశ్చయంగా, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు, (అని తెలుసుకునే వారు).[1] info

[1] చూడండి, 39:45, 29:65, 17:67 మరియు 'స.బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 24.

التفاسير:

external-link copy
166 : 2

اِذْ تَبَرَّاَ الَّذِیْنَ اتُّبِعُوْا مِنَ الَّذِیْنَ اتَّبَعُوْا وَرَاَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْاَسْبَابُ ۟

అప్పుడు (ఆ రోజు) వారు (ఆ సాటిగా కల్పించబడిన వారు) తమను అనుసరించిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేదంటారు. మరియు వారంతా తమ శిక్షను చూసుకుంటారు. మరియు వారి మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి. info
التفاسير:

external-link copy
167 : 2

وَقَالَ الَّذِیْنَ اتَّبَعُوْا لَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوْا مِنَّا ؕ— كَذٰلِكَ یُرِیْهِمُ اللّٰهُ اَعْمَالَهُمْ حَسَرٰتٍ عَلَیْهِمْ ؕ— وَمَا هُمْ بِخٰرِجِیْنَ مِنَ النَّارِ ۟۠

మరియు ఆ అనుసరించిన వారు అంటారు: "మాకు ప్రపంచ జీవితంలోకి మళ్ళీ తిరిగిపోయే అవకాశం లభిస్తే - వీరు ఈ రోజు మమ్మల్ని త్యజించినట్లు - మేము కూడా వీరిని త్యజిస్తాము!" ఈ విధంగా(ప్రపంచంలో) వారు చేసిన కర్మలను అల్లాహ్ వారికి చూపించి నప్పుడు, అది వారికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. కాని వారు నరకాగ్ని నుండి ఏ విధంగానూ బయటపడలేరు. info
التفاسير:

external-link copy
168 : 2

یٰۤاَیُّهَا النَّاسُ كُلُوْا مِمَّا فِی الْاَرْضِ حَلٰلًا طَیِّبًا ؗ— وَّلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟

ఓ ప్రజలారా! భూమిలోనున్న ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన వాటినే తినండి. మరియు షైతాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు. info
التفاسير:

external-link copy
169 : 2

اِنَّمَا یَاْمُرُكُمْ بِالسُّوْٓءِ وَالْفَحْشَآءِ وَاَنْ تَقُوْلُوْا عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟

నిశ్చయంగా, అతడు (షైతాన్) మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయటానికి మరియు అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు పలుకటానికి ప్రేరేపిస్తుంటాడు. info
التفاسير: