Bản dịch ý nghĩa nội dung Qur'an - 泰卢固语翻译 - 阿卜杜·拉西姆·本·穆罕默德

external-link copy
61 : 3

فَمَنْ حَآجَّكَ فِیْهِ مِنْ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ اَبْنَآءَنَا وَاَبْنَآءَكُمْ وَنِسَآءَنَا وَنِسَآءَكُمْ وَاَنْفُسَنَا وَاَنْفُسَكُمْ ۫— ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَلْ لَّعْنَتَ اللّٰهِ عَلَی الْكٰذِبِیْنَ ۟

ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో అతనిని (ఈసాను) గురించి వివాదానికి దిగితే, ఇలా అను: "రండి! మేము మరియు మీరు కలిసి, మా కుమారులను మరియు మీ కుమారులను; మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని, అందరమూ కలిసి: 'అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం (బహిష్కారం) పడుగాక!' అని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము." [1] info

[1] ఇది 9వ హిజ్రీ విషయం. నజ్రాన్ నుండి క్రైస్తవ బృందం ఒకటి దైవప్రవక్త ('స'అస) తో కలవటానికి మదీనాకు వస్తుంది. వారికి 'ఈసా (అ.స.) గురించి ఉన్న మూఢ విశ్వాసాలను గురించి వాదవివాదాలు జరిగిన తరువాత, దైవప్రవక్త ('స'అస) శపథం (ముబాహలహ్) కొరకు సిద్ధపడ్తారు. ముబాహలహ్ అంటే, తమ తమ కుమారులను మరియు స్త్రీలను ఒకచోట చేర్చి: "ఎవరు అసత్యం పలుకుతున్నారో వారు అల్లాహ్ (సు.తా.) శాపానికి పాత్రులై నశించిపోవు గాక!" అని అల్లాహుతా'ఆలా పేరుతో శపథం చేయటం. శపథం చేయటానికి భయపడి, ఆ క్రైస్తవ నాయకులు జి'జ్ యా ఇవ్వటానికి అంగీకరిస్తారు.

التفاسير: