పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
7 : 16

وَتَحْمِلُ اَثْقَالَكُمْ اِلٰی بَلَدٍ لَّمْ تَكُوْنُوْا بٰلِغِیْهِ اِلَّا بِشِقِّ الْاَنْفُسِ ؕ— اِنَّ رَبَّكُمْ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟ۙ

మరియు అవి మీ బరువును మోసుకొని - మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు - తీసుకుపోతాయి. నిశ్చంయగా, మీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత. info
التفاسير:

external-link copy
8 : 16

وَّالْخَیْلَ وَالْبِغَالَ وَالْحَمِیْرَ لِتَرْكَبُوْهَا وَزِیْنَةً ؕ— وَیَخْلُقُ مَا لَا تَعْلَمُوْنَ ۟

మరియు ఆయన గుర్రాలను[1], కంచర గాడిదలను మరియు గాడిదలను, మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన, మీకు తెలియనివి (అనేక ఇతర సాధనాలను) కూడా సృష్టించాడు[2]. info

[1] ఇక్కడ గుర్రాల విషయం స్వారీ చేయటానికి అని వచ్చింది. అవి స్వారీ కొరకు చాలా విలువైనవి కాబట్టి సాధారణంగా వాటిని, వాటి మాంసాన్ని తినటానికి ఉపయోగించరు. 'స. బు'ఖారీ, కితాబ్ అల్ - 'హజ్జ్, జు'బాయ'హ్, బాబ్ ల'హుమ్ అల్ 'ఖైల్; మరియు స 'హీ ముస్లిం, కితాబ్ అ'స్సైద్, బాబ్ ఫి అక్ల్ ల'హుమ్ అల్ - 'ఖైల్, జావబిర్ (ర'ది. 'అ.) ఉల్లేఖనం ప్రకారం పై ఇద్దరు 'హదీస్'వేత్తలు పేర్కొన్నట్లు గుర్రాల మాంసము తినటానికి 'హలాలే. ఇంతేగాక దైవప్రవక్త ('స'అస) సమక్షంలో 'ఖైబర్ మరియు మదీనాలలో గుర్రాలను కోసి తిన్నట్లు ఉల్లేఖనా (రివాయత్)లు ఉన్నాయి. దైవప్రవక్త ('స'అస) వారిని నివారించలేదు. ('స. ముస్లిం, ముస్నద్ అ'హ్మద్, అబూ దావూద్, ఇబ్నె కసీ'ర్ వ్యాఖ్యానం). [2] వెంటనే అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: 'మీకు తెలియని ఇంకా ఎన్నో సాధనాలను కూడా సృష్టిస్తాను.' కాబట్టి ఈ ఆయత్ ఎల్లప్పటికి నిజమే. ఈనాడు విమానాలు, రాకెట్లు వచ్చాయి. ఇంకా మున్నుందు ఏమేమి వస్తాయో అల్లాహుతా'ఆలాకే తెలుసు. చూడండి, 36:42.

التفاسير:

external-link copy
9 : 16

وَعَلَی اللّٰهِ قَصْدُ السَّبِیْلِ وَمِنْهَا جَآىِٕرٌ ؕ— وَلَوْ شَآءَ لَهَدٰىكُمْ اَجْمَعِیْنَ ۟۠

మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్ విధానం[1] మరియు అందులో (లోకంలో) తప్పుడు (వక్ర) మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన తలచుకొని ఉంటే మీరందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు[2]. info

[1] అల్లాహ్ (సు.తా.) ప్రతి ఒక్కరికీ ఎవరైతే వినగోతారో ఋజుమార్గం వైపునకే మార్గ దర్శకత్వం చేస్తాడు. చూడండి, 6:12, 54. అల్లాహ్ (సు.తా.) కరుణిస్తానని పూనుకున్నాడు. [2] అల్లాహుతా'ఆలా మానవునికి తెలివి, విచక్షణా శక్తిని ఇచ్చి, మంచి చెడులను తెలుపుతున్నాడు. మరియు మానవునికి వీటి మధ్య ఎన్నుకోవటానికి స్వాతంత్ర్యం ఇస్తున్నాడు. ఎవరిని కూడా సన్మార్గం మీద నడవటానికి గానీ, లేదా మార్గభ్రష్టత్వాన్ని అవలంబించటానికి గానీ బలవంతం చేయడు. చివరకు వారి విశ్వాసం మరియు కర్మలకు తగిన ప్రతిఫలం స్వర్గమో లేదా నరకమో ఇస్తాడు. అల్లాహుతా'లా తనకు సాటి కల్పించిన వారిని ఎన్నటికీ క్షమించడు. ఆయన (సు.తా.) కు ఆరాధనలో సాటి కల్పించటం (షిర్క్) తప్ప మరే ఇతర పాపమైనా ఆయన (సు.తా.) తాను కోరిన వారిని క్షమిస్తానన్నాడు.

التفاسير:

external-link copy
10 : 16

هُوَ الَّذِیْۤ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً لَّكُمْ مِّنْهُ شَرَابٌ وَّمِنْهُ شَجَرٌ فِیْهِ تُسِیْمُوْنَ ۟

ఆయనే, ఆకాశం నుండి మీ కొరకు నీళ్ళను కురిపిస్తాడు. దాని నుండి మీకు త్రాగటానికి నీరు దొరకుతుంది మరియు మీ పశువులను మేపటానికి పచ్చిక పెరుగుతుంది. info
التفاسير:

external-link copy
11 : 16

یُنْۢبِتُ لَكُمْ بِهِ الزَّرْعَ وَالزَّیْتُوْنَ وَالنَّخِیْلَ وَالْاَعْنَابَ وَمِنْ كُلِّ الثَّمَرٰتِ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ ۟

ఆయన దీని (నీటి) ద్వారా మీ కొరకు పంటలను, జైతూన్ మరియు ఖర్జూరపు వృక్షాలను, ద్రాక్ష మరియు ఇతర రకాల ఫలాలను పండింపజేస్తున్నాడు. నిశ్చయంగా, ఆలోచించే వారికి ఇందులో ఒక సూచన (నిదర్శనం) ఉంది. info
التفاسير:

external-link copy
12 : 16

وَسَخَّرَ لَكُمُ الَّیْلَ وَالنَّهَارَ ۙ— وَالشَّمْسَ وَالْقَمَرَ ؕ— وَالنُّجُوْمُ مُسَخَّرٰتٌ بِاَمْرِهٖ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّعْقِلُوْنَ ۟ۙ

మరియు ఆయనే రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను, మీకు ఉపయుక్తమైనవిగా చేశాడు. మరియు నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞతోనే మీకు ఉపయుక్తమైనవిగా చేయబడ్డాయి[1]. నిశ్చయంగా, బుద్ధిని ఉపయోగించే వారికి వీటిలో సూచనలు (నిదర్శనాలు) ఉన్నాయి. info

[1] చూడండి, 14:33

التفاسير:

external-link copy
13 : 16

وَمَا ذَرَاَ لَكُمْ فِی الْاَرْضِ مُخْتَلِفًا اَلْوَانُهٗ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّقَوْمٍ یَّذَّكَّرُوْنَ ۟

మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి (వ్యాపింప) జేశాడు. నిశ్చయంగా, హితబోధ స్వీకరించే వారికి వీటిలో సూచన ఉంది. info
التفاسير:

external-link copy
14 : 16

وَهُوَ الَّذِیْ سَخَّرَ الْبَحْرَ لِتَاْكُلُوْا مِنْهُ لَحْمًا طَرِیًّا وَّتَسْتَخْرِجُوْا مِنْهُ حِلْیَةً تَلْبَسُوْنَهَا ۚ— وَتَرَی الْفُلْكَ مَوَاخِرَ فِیْهِ وَلِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

మరియు ఆయన సముద్రాన్ని - తాజా మాంసము తినటానికి మరియు మీరు ధరించే ఆభరణాలు తీయటానికి - మీకు ఉపయుక్తమైనదిగా చేశాడు. ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి (ప్రజలు), అందులో ఓడల మీద దాని నీటిని చీల్చుకొని పోవటాన్ని నీవు చూస్తున్నావు. మరియు బహుశా మీరు కృతజ్ఞులు అవుతారని ఆయన మీకు (ఇవన్నీ ప్రసాదించాడు). info
التفاسير: