[1] ఇక్కడ గుర్రాల విషయం స్వారీ చేయటానికి అని వచ్చింది. అవి స్వారీ కొరకు చాలా విలువైనవి కాబట్టి సాధారణంగా వాటిని, వాటి మాంసాన్ని తినటానికి ఉపయోగించరు. 'స. బు'ఖారీ, కితాబ్ అల్ - 'హజ్జ్, జు'బాయ'హ్, బాబ్ ల'హుమ్ అల్ 'ఖైల్; మరియు స 'హీ ముస్లిం, కితాబ్ అ'స్సైద్, బాబ్ ఫి అక్ల్ ల'హుమ్ అల్ - 'ఖైల్, జావబిర్ (ర'ది. 'అ.) ఉల్లేఖనం ప్రకారం పై ఇద్దరు 'హదీస్'వేత్తలు పేర్కొన్నట్లు గుర్రాల మాంసము తినటానికి 'హలాలే. ఇంతేగాక దైవప్రవక్త ('స'అస) సమక్షంలో 'ఖైబర్ మరియు మదీనాలలో గుర్రాలను కోసి తిన్నట్లు ఉల్లేఖనా (రివాయత్)లు ఉన్నాయి. దైవప్రవక్త ('స'అస) వారిని నివారించలేదు. ('స. ముస్లిం, ముస్నద్ అ'హ్మద్, అబూ దావూద్, ఇబ్నె కసీ'ర్ వ్యాఖ్యానం). [2] వెంటనే అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: 'మీకు తెలియని ఇంకా ఎన్నో సాధనాలను కూడా సృష్టిస్తాను.' కాబట్టి ఈ ఆయత్ ఎల్లప్పటికి నిజమే. ఈనాడు విమానాలు, రాకెట్లు వచ్చాయి. ఇంకా మున్నుందు ఏమేమి వస్తాయో అల్లాహుతా'ఆలాకే తెలుసు. చూడండి, 36:42.
[1] అల్లాహ్ (సు.తా.) ప్రతి ఒక్కరికీ ఎవరైతే వినగోతారో ఋజుమార్గం వైపునకే మార్గ దర్శకత్వం చేస్తాడు. చూడండి, 6:12, 54. అల్లాహ్ (సు.తా.) కరుణిస్తానని పూనుకున్నాడు. [2] అల్లాహుతా'ఆలా మానవునికి తెలివి, విచక్షణా శక్తిని ఇచ్చి, మంచి చెడులను తెలుపుతున్నాడు. మరియు మానవునికి వీటి మధ్య ఎన్నుకోవటానికి స్వాతంత్ర్యం ఇస్తున్నాడు. ఎవరిని కూడా సన్మార్గం మీద నడవటానికి గానీ, లేదా మార్గభ్రష్టత్వాన్ని అవలంబించటానికి గానీ బలవంతం చేయడు. చివరకు వారి విశ్వాసం మరియు కర్మలకు తగిన ప్రతిఫలం స్వర్గమో లేదా నరకమో ఇస్తాడు. అల్లాహుతా'లా తనకు సాటి కల్పించిన వారిని ఎన్నటికీ క్షమించడు. ఆయన (సు.తా.) కు ఆరాధనలో సాటి కల్పించటం (షిర్క్) తప్ప మరే ఇతర పాపమైనా ఆయన (సు.తా.) తాను కోరిన వారిని క్షమిస్తానన్నాడు.
[1] చూడండి, 14:33