[1] చూడండి, 6:136.
[1] చూడండి, 53:19-22, ముష్రిక్ 'అరబ్బులు లూత్, 'ఉ'జ్జ, మనాత్ అనే ఆడ దేవతలను పూజించేవారు. వారు వారిని దైవదూతలుగా అల్లాహుతా'ఆలా కుమార్తెలుగా పరిగణించేవారు.
[1] ముష్రిక్ 'అరబ్బులు, ఇస్లాంకు పూర్వం ఆడబిడ్డ పుట్టుకను ఎంతో అవమానంగా భావించేవారు, కొందరు ఆ ఆడబిడ్డను సజీవంగా భూమిలో పాతేవారు. చూడండి, 81:8.
[1] అల్లాహుతా'ఆలా ప్రజలను ప్రతి పాపానికి పట్టి శిక్షించడు. కాని పాపాత్ముల పాపాలు చాలా అయినప్పుడు అల్లాహ్ (సు.తా.) శిక్ష వచ్చి పడుతోంది. ఆ సమయంలో పుణ్యాత్ములు కూడా దాని నుండి తప్పించుకోలేరు. కాని వారు (పుణ్యాత్ములు) పరలోకంలో అల్లాహ్ (సు.తా.) సన్నిహితులలో ఉంటారు. ('స. బు'ఖారీ 2118, 'స. ముస్లిం, 2206 మరియు 2210). [2] దీని మరొక తాత్పర్యం ఈ విధంగా ఉంది: 'ఇక వారి కాలం వచ్చినప్పుడు, వారు దానిని ఒక్క ఘడియ ఆలస్యం చేయలేరు, లేక ఒక్క ఘడియ ముందుగానూ తేలేరు.'
[1] వలి, వలియ - నుండి వచ్చింది. వలియ దగ్గరివాడు, స్నేహితుడు, ప్రియుడు, మిత్రుడు, సహాయకుడు, ఆధారమిచ్చే, కాపాడే, ఆశ్రయమిచ్చే, పోషించే వాడు. అల్లాహ్ (సు.తా.) విశ్వాసుల వలి, అని 2:257 మరియు 3:68 లో పేర్కొనబడింది. అదే విధంగా విశ్వాసులు అల్లాహ్ (సు.తా.)కు వలి అని 10:62లో ఉంది. మరియు తాగూత్ సత్యతిరస్కారుల అవ్ లియా అని 2:257లో పేర్కొనబడింది.