[1] చూడండి, 78:7, 21:31 మరియు 31:10.
[1] ఈ 'మృతులు' అంటే కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, మరణించిన సాధులు మరియు వలీలు కూడా! తరువాత ప్రాణం లేని వారు అని మళ్ళీ నొక్కి చెప్పబడుతోంది. దీనితో దర్గాలను ఆరాధించే వారు చెప్పే మాటలు: 'మేము మృతులను కాదు ప్రార్థించేది, వారు తమ గోరీలలో సజీవులై ఉన్నారు' అనేది తప్పని విశదమౌతోంది. అంటే మరణించిన తరువాత వారికి ఈ లోకంతో ఎట్టి సంబంధం ఉండదు. వారు ఏమీ చేయలేరు. అయితే వారెలా మేలు గానీ, కీడు గానీ చేయగలరు? చూడండి, 7:191-194.
[1] అంటే మీ ఆరాధ్య దైవం ఒక్కడే (అల్లాహ్)! అనే మాటను నమ్మటం సత్యతిరస్కారులకు ఆశ్చర్యదాయక మౌతోంది. చూడండి, 38:5 మరియు 39:45.
[1] ఇస్తెక్బారున్: అంటే తనను తాను పెద్ద వాడిగా భావించి, సత్యాన్ని కూడా తిరస్కరించడం మరియు ముందు వారిని నీచులుగా, చిన్నవారిగా భావించడం. ఈ విధమైన గర్విష్టులు దురహంకారులంటే అల్లాహ్ (సు.తా.) ఇష్టపడడు. ('స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అల్ ఈమాన్, బాబ్ త'హ్రీమ్ కిబ్ర్).
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఎవరైతే ప్రజలను సన్మార్గం వైపునకు పిలుస్తారో, వారికి వారందరి పుణ్యఫలితం లభిస్తుంది. ఎవరైతే ప్రజలను దుర్మార్గం వైపునకు పిలుస్తారో, వారు వారందరి పాపభారాలను కూడా మోస్తారు.' (అబూ-దావూద్, కితాబ్ సున్నహ్, బాబ్ ల'జూమ్ అస్సున్నహ్).