పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం

పేజీ నెంబరు:close

external-link copy
94 : 16

وَلَا تَتَّخِذُوْۤا اَیْمَانَكُمْ دَخَلًا بَیْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوْتِهَا وَتَذُوْقُوا السُّوْٓءَ بِمَا صَدَدْتُّمْ عَنْ سَبِیْلِ اللّٰهِ ۚ— وَلَكُمْ عَذَابٌ عَظِیْمٌ ۟

మరియు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి ఉపయోగించుకోకండి. అలా చేస్తే స్థిరపడిన పాదాలు జారిపోవచ్చు మరియు మీరు అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించిన పాప ఫలితాన్ని రుచి చూడగలరు.[1] మరియు మీకు ఘోరమైన శిక్ష పడగలదు. info

[1] ఈ విధంగా ప్రజలు తమ ప్రమాణాలను తెంపుకొని, ఇతరులను మోసగించటానికి పాల్పడితే సమాజంలో ఒకరిపై ఒకరికి ఏ విధమైన విశ్వాసం ఉండదు, అన్యాయం మరియు దౌర్జన్యం నెలకొంటాయి.

التفاسير:

external-link copy
95 : 16

وَلَا تَشْتَرُوْا بِعَهْدِ اللّٰهِ ثَمَنًا قَلِیْلًا ؕ— اِنَّمَا عِنْدَ اللّٰهِ هُوَ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟

మరియు మీరు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని స్పల్పలాభానికి అమ్ముకోకండి. మీరు తెలుసుకోగలిగితే, నిశ్చయంగా, అల్లాహ్ వద్ద ఉన్నదే మీకు ఎంతో మేలైనది. info
التفاسير:

external-link copy
96 : 16

مَا عِنْدَكُمْ یَنْفَدُ وَمَا عِنْدَ اللّٰهِ بَاقٍ ؕ— وَلَنَجْزِیَنَّ الَّذِیْنَ صَبَرُوْۤا اَجْرَهُمْ بِاَحْسَنِ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. మరియు అల్లాహ్ వద్ద ఉన్నదే (శాశ్వతంగా) మిగిలేది! మరియు మేము సహనం వహించేవారికి, వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. info
التفاسير:

external-link copy
97 : 16

مَنْ عَمِلَ صَالِحًا مِّنْ ذَكَرٍ اَوْ اُ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْیِیَنَّهٗ حَیٰوةً طَیِّبَةً ۚ— وَلَنَجْزِیَنَّهُمْ اَجْرَهُمْ بِاَحْسَنِ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము.[1] మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. info

[1] చూడండి. 20:124.

التفاسير:

external-link copy
98 : 16

فَاِذَا قَرَاْتَ الْقُرْاٰنَ فَاسْتَعِذْ بِاللّٰهِ مِنَ الشَّیْطٰنِ الرَّجِیْمِ ۟

కావున నీవు ఖుర్ఆన్ పఠించబోయేటప్పుడు శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి (రక్షణ పొందటానికి) అల్లాహ్ శరణు వేడుకో![1] info

[1] ఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) ను సంబోధిస్తుంది. కాని ఇది విశ్వాసులందరి కొరకు ఉంది. కావున ప్రతివాడు ఖుర్ఆన్ చదవటం ప్రారంభించేటప్పుడు: 'బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్'కు ముందు, 'అ 'ఊజుబిల్లాహి మినష్షైతా నిర్రజీమ్.' తప్పక చదవాలి.

التفاسير:

external-link copy
99 : 16

اِنَّهٗ لَیْسَ لَهٗ سُلْطٰنٌ عَلَی الَّذِیْنَ اٰمَنُوْا وَعَلٰی رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ ۟

విశ్వసించి, తమ ప్రభువును నమ్ముకున్న వారిపై నిశ్చయంగా, వాడికి ఎలాంటి అధికారం ఉండదు. info
التفاسير:

external-link copy
100 : 16

اِنَّمَا سُلْطٰنُهٗ عَلَی الَّذِیْنَ یَتَوَلَّوْنَهٗ وَالَّذِیْنَ هُمْ بِهٖ مُشْرِكُوْنَ ۟۠

కాని! నిశ్చయంగా, వాడి (షైతాన్) వైపుకు మరలి వాడిని అనుసరించే (స్నేహం చేసుకునే) వారిపై[1] మరియు ఆయనకు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారిపై, వాడికి అధికారం ఉంటుంది. info

[1] చూడండి, 14:22

التفاسير:

external-link copy
101 : 16

وَاِذَا بَدَّلْنَاۤ اٰیَةً مَّكَانَ اٰیَةٍ ۙ— وَّاللّٰهُ اَعْلَمُ بِمَا یُنَزِّلُ قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مُفْتَرٍ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۟

మరియు మేము ఒక సందేశాన్ని (ఆయత్ ను) మార్చి దాని స్థానంలో మరొక సందేశాన్ని అవతరింపజేసినప్పుడు;[1] తాను దేన్ని ఎప్పుడు అవతరింపజేశాడో అల్లాహ్ కు బాగా తెలుసు. (అయినా) వారు (సత్యతిరస్కారులు) ఇలా అంటారు: "నిశ్చయంగా నీవే (ఓ ముహమ్మద్!) దీనిని కల్పించేవాడవు." అసలు వారిలో చాలా మంది (యథార్థం) తెలుసుకోలేరు. info

[1] చూడండి, 2:106, 13:39, 41:42.

التفاسير:

external-link copy
102 : 16

قُلْ نَزَّلَهٗ رُوْحُ الْقُدُسِ مِنْ رَّبِّكَ بِالْحَقِّ لِیُثَبِّتَ الَّذِیْنَ اٰمَنُوْا وَهُدًی وَّبُشْرٰی لِلْمُسْلِمِیْنَ ۟

వారితో అను: "దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నీ ప్రభువు వద్ద నుండి సత్యంతో, విశ్వాసులను (విశ్వాసంలో) పటిష్టం చేయటానికి మరియు (అల్లాహ్ కు) సంపూర్ణంగా విధేయులుగా ఉన్న వారికి (ముస్లింలకు) సన్మార్గం చూపటానికి మరియు శుభవార్త అందజేయటానికి, పరిశుద్ధాత్మ (జిబ్రీల్)[1] క్రమక్రమంగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని వచ్చాడు." info

[1] జిబ్రీల్ ('అ.స.) ను సంబోధిస్తూ, రూ'హుల్ ఖుద్స్, అని ఖుర్ఆన్ లో నాలుగు సార్లు వచ్చింది. ఇక్కడ మరియు 2:87, 253; 5:110లలో. రూ'హుల్ అమీన్, అని 26:193లో వచ్చింది. రూ'హ్, అని మూడు సార్లు, 78:38, 19:17, 97:4లలో వచ్చింది. కాని 16:2, 42:52లలో మాత్రం రూ'హ్, దివ్యజ్ఞానం అనే అర్థం ఇస్తుంది.

التفاسير: