Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

Numri i faqes:close

external-link copy
187 : 3

وَاِذْ اَخَذَ اللّٰهُ مِیْثَاقَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ لَتُبَیِّنُنَّهٗ لِلنَّاسِ وَلَا تَكْتُمُوْنَهٗ ؗۗ— فَنَبَذُوْهُ وَرَآءَ ظُهُوْرِهِمْ وَاشْتَرَوْا بِهٖ ثَمَنًا قَلِیْلًا ؕ— فَبِئْسَ مَا یَشْتَرُوْنَ ۟

మరియు ప్రవక్త - గుర్తుంచుకోండి,గ్రంధవహులైన యూదులు మరియు క్రైస్తవులలోని పండితులతో ;వారు ప్రజలకు ఖచ్చితంగా అల్లాహ్ గ్రంధాన్ని వివరించి చెప్పాలి’మరియు అందులోని మార్గదర్శనాలను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ దైవదౌత్యాన్ని సూచించే రుజువులు మీరు దాచకూడదు’అని గట్టి ఒడంబడికను అల్లాహ్ తీసుకున్నాడు,కానీ వారు ఆ ప్రమాణాన్ని విసిరేశారు,పట్టించుకోలేదు,ఆపై వారు సత్యాన్ని దాచారు మరియు అసత్యాన్ని చూపించారు,మరియు అల్లాహ్ ప్రమాణాన్ని తుచ్చ మూల్యానికి బదులుగా అంటే గౌరవం,డబ్బు పొందడానికి మార్పిడి చేసుకున్నారు,వీరు అల్లాహ్ ప్రమాణానికి బదులుగా మార్పిడి చేసుకున్న ఈ మూల్యం అతిహీనమైనది. info
التفاسير:

external-link copy
188 : 3

لَا تَحْسَبَنَّ الَّذِیْنَ یَفْرَحُوْنَ بِمَاۤ اَتَوْا وَّیُحِبُّوْنَ اَنْ یُّحْمَدُوْا بِمَا لَمْ یَفْعَلُوْا فَلَا تَحْسَبَنَّهُمْ بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

మీరు అస్సలు భావించకండి-ఓ ప్రవక్త - వారు పనికిమాలిన పనులను చేసి సంతోషిస్తారు మరియు ప్రజలు వారు చేయని మంచి పనులకు ప్రశంసించడాన్ని’ఇష్టపడతారు’మీరు వారిపట్ల శిక్ష నుండి తప్పించుకుని బ్రతికిపోతారని అస్సలు భావించకండి,బదులుగా నరకం వారి నివాసమై ఉంటుంది,వారికి అందులో బాధాకరమైన శిక్ష ఉంటుంది. info
التفاسير:

external-link copy
189 : 3

وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠

మరియు ఏకైకుడైన అల్లాహ్’కు మాత్రమే భూమ్యాకాశాలపై మరియు అందులో ఉన్న దానిపై సృష్టి మరియు నిర్వహణ పరంగా ‘సార్వబౌమత్వం’కలదు,అల్లాహ్ ప్రతీది చేయగల సమర్థుడు. info
التفاسير:

external-link copy
190 : 3

اِنَّ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّیْلِ وَالنَّهَارِ لَاٰیٰتٍ لِّاُولِی الْاَلْبَابِ ۟ۚۖ

ఎటువంటి ప్రణాళిక లేకుండా భూమ్యాకాశాలను సృజించడం,రేయింభవళ్లు వెనువెంటనే రావడం,మరియు వాటిలో ఏర్పడే హెచ్చుతగ్గుల వ్యత్యాసాలలో ‘వివేచనపరుల’ కొరకు స్పష్టమైన సూచనలు ఉన్నాయి,ఆ సూచనలు ఆరాధనకు అర్హుడైన ఏకైకుడిని విశ్వసామ్రాజ్య సృష్టికర్తను సూచిస్తాయి. info
التفاسير:

external-link copy
191 : 3

الَّذِیْنَ یَذْكُرُوْنَ اللّٰهَ قِیٰمًا وَّقُعُوْدًا وَّعَلٰی جُنُوْبِهِمْ وَیَتَفَكَّرُوْنَ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— رَبَّنَا مَا خَلَقْتَ هٰذَا بَاطِلًا ۚ— سُبْحٰنَكَ فَقِنَا عَذَابَ النَّارِ ۟

వారు తమ పరిస్థితులన్నిటిలో అనగా నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు,పడుకున్నప్పుడు,మరియు భూమ్యాకాశాల నిర్మాణం పై తమ ఆలోచనను లగ్నం చేసి ఇలా అంటారు : ఓ మా ప్రభూ! నీవు ఇంతటి మహా విశ్వాన్ని పనికిమాలినది గా సృష్టించలేదు,నీవు వ్యర్ధము నుంచి పరిశుద్దపర్చావు,మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు,సత్కార్యాల భాగ్యాన్ని ప్రసాదించు మరియు దుష్కార్యాల నుండి రక్షించు. info
التفاسير:

external-link copy
192 : 3

رَبَّنَاۤ اِنَّكَ مَنْ تُدْخِلِ النَّارَ فَقَدْ اَخْزَیْتَهٗ ؕ— وَمَا لِلظّٰلِمِیْنَ مِنْ اَنْصَارٍ ۟

నిశ్చయంగా నీవు –ఓ మా ప్రభూ-నీ సృష్టిలో ఎవరినైతే నరకంలో పడేస్తావో నిస్సందేహంగా అతన్ని నీవు అవమానించావు మరియు పరాభావానికి గురిచేసావు. పునరుత్తానదినమున దుర్మార్గులను అల్లాహ్ యొక్క హింస మరియు శిక్షనుంచి కాపాడే ఆపద్భాంధవులెవరూ ఉండరు. info
التفاسير:

external-link copy
193 : 3

رَبَّنَاۤ اِنَّنَا سَمِعْنَا مُنَادِیًا یُّنَادِیْ لِلْاِیْمَانِ اَنْ اٰمِنُوْا بِرَبِّكُمْ فَاٰمَنَّا ۖۗ— رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَكَفِّرْ عَنَّا سَیِّاٰتِنَا وَتَوَفَّنَا مَعَ الْاَبْرَارِ ۟ۚ

"ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము:ఈమాన్ వైపుకు ఆహ్వానిస్తున్న –మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్-ఇలా ఆహ్వానిస్తున్నప్పుడు-: 'ఏకైక ఆరాధ్యుడైన మీ ప్రభువును విశ్వసించండి’అని’ మేము ఆయన ఆహ్వానించిన సందేశాన్ని విశ్వసించాము,మరియు ఆయన ధర్మశాసనాలను అనుసరించాము,కాబట్టి మీరు మా పాపాలను కప్పివేయండి’వాటిని బహిర్గతపర్చవద్దు,మరియు మా తప్పిదాలను మన్నించండి వాటికి బదులుగా మమ్ములను పట్టుకోవద్దు,సత్కార్యాలు చేయు సద్బుద్దిని మరియు దుష్కార్యాలకు దూరంగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించి సత్పురుషులతో పాటు మరణాన్ని ప్రసాదించు. info
التفاسير:

external-link copy
194 : 3

رَبَّنَا وَاٰتِنَا مَا وَعَدْتَّنَا عَلٰی رُسُلِكَ وَلَا تُخْزِنَا یَوْمَ الْقِیٰمَةِ ؕ— اِنَّكَ لَا تُخْلِفُ الْمِیْعَادَ ۟

"ఓ మా ప్రభూ! మరియు నీ ప్రవక్తల నోటిద్వారా నీవు మాకు చేసిన ప్రాపంచిక‘మార్గదర్శనం మరియు సాఫల్య’ వాగ్దానాలను మాకు ఇవ్వండి. మరియు పరలోకదినాన నరకాగ్నిపాలు చేసి మమ్ము అవమానపర్చకు,నిశ్చయంగా –ఓ మా ప్రభువా-దయామయుడవు-,నీవు నీ వాగ్దానాలను భంగం చేయవు". info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• من صفات علماء السوء من أهل الكتاب: كتم العلم، واتباع الهوى، والفرح بمدح الناس مع سوء سرائرهم وأفعالهم.
గ్రంధవహులైన దుష్టపండితుల కొన్ని గుణాలు:- జ్ఞానాన్ని దాచడం,మనోవాంఛలను అనుసరించడం,చెడు రహస్యాలు మరియు కర్మలు కలిగికూడా ప్రజల పొగడ్తల పై పరవశించిపోవడం. info

• التفكر في خلق الله تعالى في السماوات والأرض وتعاقب الأزمان يورث اليقين بعظمة الله وكمال الخضوع له عز وجل.
•భూమ్యాకాశాల సృష్టి,ఒకదాని వెంబడి మరొకటి క్రమంగా కాలాలు మారడం”అల్లాహ్ పట్ల గొప్పతనాన్ని మరియు ఆయన కొరకు సంపూర్ణ సమర్పణ’యొక్క విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి. info

• دعاء الله وخضوع القلب له تعالى من أكمل مظاهر العبودية.
•అల్లాహ్’ను పిలువడం మరియు మహోన్నతుడైన ఆయన కొరకు హృదయాన్ని సమర్పించడం దైవదాస్యపు సంపూర్ణ గుణాలలోనివి. info