Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran.

Pagina nummer:close

external-link copy
40 : 26

لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ اِنْ كَانُوْا هُمُ الْغٰلِبِیْنَ ۟

ఒక వేళ మంత్రజాలకులకు మూసా అలైహిస్సలాంపై గెలుపు కలిగితే మేము వారి ధర్మము విషయంలో వారిని అనుసరించాలని ఆశ. info
التفاسير:

external-link copy
41 : 26

فَلَمَّا جَآءَ السَّحَرَةُ قَالُوْا لِفِرْعَوْنَ اَىِٕنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِیْنَ ۟

మంత్రజాలకులు మూసాపై గెలవటానికి ఫిర్ఔన్ వద్దకు వచ్చినప్పుడు వారు అతనితో ఇలా పలికారు : ఒక వేళ మూసా పై మనకు గెలుపు కలిగితే మనకు ఆర్ధిక ప్రతిఫలం లేదా నైతిక ప్రతిఫలం ఉంటుందా ?. info
التفاسير:

external-link copy
42 : 26

قَالَ نَعَمْ وَاِنَّكُمْ اِذًا لَّمِنَ الْمُقَرَّبِیْنَ ۟

ఫిర్ఔన్ వారితో ఇలా పలికాడు : అవును మీ కొరకు ప్రతిఫలం గలదు. నిశ్ఛయంగా మీరు అతనిపై సఫలీకృతమైతే నా వద్ద మీకు ఉన్నత స్థానాలను ప్రసాదించటం ద్వారా సన్నిదుల్లోంచి అవుతారు. info
التفاسير:

external-link copy
43 : 26

قَالَ لَهُمْ مُّوْسٰۤی اَلْقُوْا مَاۤ اَنْتُمْ مُّلْقُوْنَ ۟

మూసా అలైహిస్సలాం అల్లాహ్ సహాయముపై నమ్మకమును కలిగి ఉండి మరియు తన వద్ద ఉన్నది మంత్రజాలము కాదని స్పష్టపరుస్తూ వారితో ఇలా పలికారు : మీరు వేయదలచుకున్న మీ త్రాళ్ళను,మీ చేతి కర్రలను వేయండి. info
التفاسير:

external-link copy
44 : 26

فَاَلْقَوْا حِبَالَهُمْ وَعِصِیَّهُمْ وَقَالُوْا بِعِزَّةِ فِرْعَوْنَ اِنَّا لَنَحْنُ الْغٰلِبُوْنَ ۟

అప్పుడు వారు తమ త్రాళ్ళను,చేతి కర్రలను విసిరారు.వాటిని విసిరినప్పుడు వారు ఇలా పలికారు : ఫిర్ఔన్ గొప్పతనము సాక్షిగా నిశ్ఛయంగా మేమే విజయం పొందే వారము. మరియు మూసా అతడే ఓడిపోయేవాడు. info
التفاسير:

external-link copy
45 : 26

فَاَلْقٰی مُوْسٰی عَصَاهُ فَاِذَا هِیَ تَلْقَفُ مَا یَاْفِكُوْنَ ۟ۚۖ

అప్పుడు మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరారు. అప్పుడు అది సర్పముగా మారిపోయింది. అప్పుడు అది వారు మంత్రజాలముతో ప్రజలను మోసం చేసిన దాన్ని మింగసాగింది. info
التفاسير:

external-link copy
46 : 26

فَاُلْقِیَ السَّحَرَةُ سٰجِدِیْنَ ۟ۙ

మంత్రజాలకులు మూసా చేతి కర్ర వారు విసిరిన తమ మంత్రజాలమును మ్రింగి వేయటమును చూసినప్పుడు సాష్టాంగపడిపోయారు. info
التفاسير:

external-link copy
47 : 26

قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ

వారు ఇలా అన్నారు : మేము సృష్టితాలన్నిటి ప్రభువును విశ్వసించాము. info
التفاسير:

external-link copy
48 : 26

رَبِّ مُوْسٰی وَهٰرُوْنَ ۟

మూసా,హారూన్ అలైహిమస్సలాం ప్రభువును. info
التفاسير:

external-link copy
49 : 26

قَالَ اٰمَنْتُمْ لَهٗ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ ۚ— اِنَّهٗ لَكَبِیْرُكُمُ الَّذِیْ عَلَّمَكُمُ السِّحْرَ ۚ— فَلَسَوْفَ تَعْلَمُوْنَ ؕ۬— لَاُقَطِّعَنَّ اَیْدِیَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ وَّلَاُوصَلِّبَنَّكُمْ اَجْمَعِیْنَ ۟ۚ

ఫిర్ఔన్ మంత్రజాలకుల విశ్వాసమును ఖండిస్తూ ఇలా పలికాడు : ఏమీ నేను మీకు దీని అనుమతి ఇవ్వక ముందే మీరు మూసా పై విశ్వాసమును కనబరుస్తారా ?!. నిశ్చయంగా మూసా మీకు మంత్రజాలమును నేర్పించిన మీ పెద్దవాడు. వాస్తవానికి మీరందరు మిసర్ వాసులందరిని దాని నుండి వెళ్ళగొట్టడానికి కుట్ర పన్నారు. నేను మీకు ఏ శిక్ష విధిస్తానో మీరు తొందరలోనే తెలుసుకుంటారు. నేను తప్పకుండా మీలో నుండి ప్రతి ఒక్కరి ఒక కాలును,ఒక చేయిని ఆ రెండింటి మధ్య వ్యతిరేక దిశలో కోసివేస్తాను ఎడమ చేతితోపాటు కుడి కాలును కోయటం లేదా దానికి భిన్నంగా. మరియు నేను తప్పకుండా మీ అందరిని ఖర్జూరపు చెట్టు బోదెలపై సిలువ వేస్తాను. మీలో నుండి ఎవరినీ నేను వదలను. info
التفاسير:

external-link copy
50 : 26

قَالُوْا لَا ضَیْرَ ؗ— اِنَّاۤ اِلٰی رَبِّنَا مُنْقَلِبُوْنَ ۟ۚ

మంత్రజాలకులు ఫిర్ఔన్ కు ఇలా సమాధానమిచ్చారు : ఇహ లోకంలో నీవు కోయటం,సిలువ వేయటం గురించి మమ్మల్ని బెదిరిస్తున్న దానిలో ఎటువంటి నష్టం లేదు. నీ శిక్ష తరిగిపోతుంది. మరియు మేము మా ప్రభువు వైపునకు మరలి వెళ్ళుతాము. మరియు ఆయన మమ్మల్ని తన శాశ్వత కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు. info
التفاسير:

external-link copy
51 : 26

اِنَّا نَطْمَعُ اَنْ یَّغْفِرَ لَنَا رَبُّنَا خَطٰیٰنَاۤ اَنْ كُنَّاۤ اَوَّلَ الْمُؤْمِنِیْنَ ۟ؕ۠

నిశ్చయంగా మొదట మేమే మూసాపై విశ్వాసమును కనబరచి ఆయనను నమ్మాము కాబట్టి అల్లాహ్ మేము పాల్పడిన పూర్వ పాపాలను తుడిచి వేస్తాడని మేము ఆశిస్తున్నాము. info
التفاسير:

external-link copy
52 : 26

وَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اَنْ اَسْرِ بِعِبَادِیْۤ اِنَّكُمْ مُّتَّبَعُوْنَ ۟

మరియు మేము మూసా అలైహిస్సలాం వైపునకు ఆయన ఇస్రాయీలు సంతతి వారిని రాత్రి తీసుకుని వెళ్ళమని ఆదేశిస్తూ దైవ వాణిని అవతరింపజేశాము. ఎందుకంటే ఫిర్ఔన్,అతనితో పాటు ఉన్నవారు వారిని పట్టుకోవటానికి వారిని వెంబడిస్తారు. info
التفاسير:

external-link copy
53 : 26

فَاَرْسَلَ فِرْعَوْنُ فِی الْمَدَآىِٕنِ حٰشِرِیْنَ ۟ۚ

అయితే ఫిర్ఔన్ పట్టణాలలో ఇస్రాయీలు సంతతి వారిని పట్టుకోవటానికి ఎప్పుడైతే మిసర్ నుండి వారి బయలదేరటమును తెలుసుకున్నాడో సైన్యములను సమీకరించే వారిని తన సైన్యముల్లోంచి కొంత మందిని పంపించాడు. info
التفاسير:

external-link copy
54 : 26

اِنَّ هٰۤؤُلَآءِ لَشِرْذِمَةٌ قَلِیْلُوْنَ ۟ۙ

ఫిర్ఔన్ ఇస్రాయీలు సంతతి వారి విషయంలో చిన్నవిగా చూపిస్తూ ఇలా పలికాడు : నిశ్ఛయంగా వీరందరు చిన్న వర్గము. info
التفاسير:

external-link copy
55 : 26

وَاِنَّهُمْ لَنَا لَغَآىِٕظُوْنَ ۟ۙ

మరియు నిశ్ఛయంగా వారు వారిపై మమ్మల్ని ఆగ్రహమును కలిగించే చర్యలకు పాల్పడ్డారు. info
التفاسير:

external-link copy
56 : 26

وَاِنَّا لَجَمِیْعٌ حٰذِرُوْنَ ۟ؕ

మరియు నిశ్ఛయంగా మేము వారి కొరకు సిద్ధంగా,అప్రమత్తంగా ఉన్నాము. info
التفاسير:

external-link copy
57 : 26

فَاَخْرَجْنٰهُمْ مِّنْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۙ

కావున మేము ఫిర్ఔన్ ను,అతని జాతి వారిని దట్టమైన తోటలు,నీటితో ప్రవహించే కాలువలు గల మిసర్ భూమి నుండి వెళ్ళగొట్టాము. info
التفاسير:

external-link copy
58 : 26

وَّكُنُوْزٍ وَّمَقَامٍ كَرِیْمٍ ۟ۙ

మరియు సంపదల నిధులు గల,మంచి నివాసాలు గల (భూమి నుండి) info
التفاسير:

external-link copy
59 : 26

كَذٰلِكَ ؕ— وَاَوْرَثْنٰهَا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ

ఈ విధంగా మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని ఈ అనుగ్రహాల నుండి వెళ్ళగొట్టి వారి తరువాత ఈ అనుగ్రహాలను షామ్ ప్రాంతములో ఇస్రాయీలు సంతతి వారి కొరకు చేశాము. info
التفاسير:

external-link copy
60 : 26

فَاَتْبَعُوْهُمْ مُّشْرِقِیْنَ ۟

ఫిర్ఔన్,అతని జాతి వారు సూర్యోదయ సమయంలో ఇస్రాయీలు సంతతి వారిని వెంబడించారు. info
التفاسير:
Voordelen van de verzen op deze pagina:
• العلاقة بين أهل الباطل هي المصالح المادية.
అసత్యపరుల మధ్య సంబంధము అది భౌతిక ప్రయోజనాలు. info

• ثقة موسى بالنصر على السحرة تصديقًا لوعد ربه.
మంత్రజాలకులపై విజయంపై మూసా అలైహిస్సలాం నమ్మకం తన ప్రభువు వగ్దానమునకు దృవీకరంగా. info

• إيمان السحرة برهان على أن الله هو مُصَرِّف القلوب يصرفها كيف يشاء.
మంత్రజాలకులు విశ్వసించటం అల్లాహ్ హృదయములను తాను ఎలా తలచుకుంటే అలా మలిచే వాడనటానికి ఆధారము. info

• الطغيان والظلم من أسباب زوال الملك.
నిరంకుశత్వము,దుర్మార్గము రాజ్యము పతనానికి కారణం. info