Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran.

Pagina nummer:close

external-link copy
20 : 26

قَالَ فَعَلْتُهَاۤ اِذًا وَّاَنَا مِنَ الضَّآلِّیْنَ ۟ؕ

మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ తో అంగీకరిస్తూ ఇలా పలికారు : నేను ఆ మనిషిని నా వద్దకు దైవ వాణి రాక ముందు అజ్ఞానుల్లోంచి ఉన్నప్పుడు హత్య చేశాను. info
التفاسير:

external-link copy
21 : 26

فَفَرَرْتُ مِنْكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِیْ رَبِّیْ حُكْمًا وَّجَعَلَنِیْ مِنَ الْمُرْسَلِیْنَ ۟

అతన్ని హత్య చేసిన తరువాత మీరు నన్ను అతనికి బదులుగా నన్ను హతమారుస్తారని నేను భయపడినప్పుడు మద్యన్ బస్తీ వైపునకు మీ నుండి పారిపోయాను. అప్పుడు నా ప్రభువు నాకు జ్ఞానమును ప్రసాదించాడు. మరియు ఆయన నన్ను తాను ప్రజల వైపునకు ప్రవక్తలుగా పంపించే తన ప్రవక్తల్లోంచి చేశాడు. info
التفاسير:

external-link copy
22 : 26

وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَیَّ اَنْ عَبَّدْتَّ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ

మరియు నీవు నన్ను బానిసగా చేయకుండా ఇస్రాయీలు సంతతి వారిని బనిసలుగా చేసి నన్ను నీవు పోషించటాన్ని నిజంగా నాపై చేసిన ఉపకారంగా ఎత్తిపొడుస్తున్నావు. info
التفاسير:

external-link copy
23 : 26

قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعٰلَمِیْنَ ۟

ఫిర్ఔన్ మూసా అలైహిస్సలాంను ఇలా అడిగాడు : ఆయన దూతగా నీవు చెప్పుకున్న సృష్టితాల ప్రభువు ఎవడు ?. info
التفاسير:

external-link copy
24 : 26

قَالَ رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ؕ— اِنْ كُنْتُمْ مُّوْقِنِیْنَ ۟

మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కు సమాధానమిస్తూ ఇలా పలికారు : సృష్టితాల ప్రభువు,ఆకాశముల ప్రభువు,భూమి యొక్క ప్రభువు మరియు ఆ రెండింటి మధ్య ఉన్న వాటి యొక్క ప్రభువు ఒక వేళ ఆయన వారి ప్రభువు అని మీరు నమ్మే వారైతే మీరు అతనొక్కడినే ఆరాధించండి. info
التفاسير:

external-link copy
25 : 26

قَالَ لِمَنْ حَوْلَهٗۤ اَلَا تَسْتَمِعُوْنَ ۟

ఫిర్ఔన్ తన చుట్టూ ఉన్న తన జాతి నాయకులతో ఇలా పలికాడు : మీరు మూసా సమాధానమును,అందులో ఉన్న అబద్దపు వాదనను వినటంలేదా ?!. info
التفاسير:

external-link copy
26 : 26

قَالَ رَبُّكُمْ وَرَبُّ اٰبَآىِٕكُمُ الْاَوَّلِیْنَ ۟

మూసా అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : అల్లాహ్ మీ ప్రభువు,మీ పూర్వ తాతముత్తాతల ప్రభువు. info
التفاسير:

external-link copy
27 : 26

قَالَ اِنَّ رَسُوْلَكُمُ الَّذِیْۤ اُرْسِلَ اِلَیْكُمْ لَمَجْنُوْنٌ ۟

ఫిర్ఔన్ ఇలా పలికాడు : నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తగా పంపించబడ్డాడని వాదించే ఇతను ఎలా సమాధానం ఇవ్వాలో తెలియని పిచ్చివాడు. తనకు అర్ధం కాని వాటిని చెబుతున్నాడు. info
التفاسير:

external-link copy
28 : 26

قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَیْنَهُمَا ؕ— اِنْ كُنْتُمْ تَعْقِلُوْنَ ۟

మూసా అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నేను మిమ్మల్ని పిలిచే అల్లాహ్ తూర్పునకు ప్రభువు,పడమరనకు ప్రభువు మరియు ఆ రెండింటికి మధ్య ఉన్న వాటికి ప్రభువు ఒక వేళ మీకు వాటిని అర్ధం చేసుకునే బుద్దులు ఉంటే. info
التفاسير:

external-link copy
29 : 26

قَالَ لَىِٕنِ اتَّخَذْتَ اِلٰهًا غَیْرِیْ لَاَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُوْنِیْنَ ۟

ఫిర్ఔన్ ముసాతో వాదించటం నుండి అశక్తుడైన తరువాత మూసాతో ఇలా పలికాడు : నీవు నన్ను కాదని మరెవరినైన ఆరాధ్య దైవంగా ఆరాధిస్తే నేను నిన్ను చెరసాలలో బందీలుగా ఉన్నవారిలో చేరుస్తాను. info
التفاسير:

external-link copy
30 : 26

قَالَ اَوَلَوْ جِئْتُكَ بِشَیْءٍ مُّبِیْنٍ ۟ۚ

మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కి ఇలా సమాధానమిచ్చారు : ఏమీ ఒక వేళ నేను అల్లాహ్ వద్ద నుండి నీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో నా నిజాయితీని స్పష్టపరిచే దాన్ని నీ వద్దకు తీసుకుని వచ్చిన తరువాత కూడా నీవు నన్ను చెరసాలలో బందీలుగా ఉన్న వారిలో చేరుస్తావా ?. info
التفاسير:

external-link copy
31 : 26

قَالَ فَاْتِ بِهٖۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟

నీవు వాదిస్తున్న విషయంలో ఒక వేళ నీవు నిజాయితీ పరులలోంచి అయితే నీ నిజాయితీని సూచిస్తుందని నీవు ప్రస్తావించిన దాన్ని తీసుకుని రా అని అతడు పలికాడు. info
التفاسير:

external-link copy
32 : 26

فَاَلْقٰی عَصَاهُ فَاِذَا هِیَ ثُعْبَانٌ مُّبِیْنٌ ۟ۚۖ

అప్పుడు మూసా తన చేతి కర్రను భూమిపై విసిరారు అది అకస్మాత్తుగా చూసేవారికి ఒక స్పష్టమైన సర్పంగా మారిపోయింది. info
التفاسير:

external-link copy
33 : 26

وَّنَزَعَ یَدَهٗ فَاِذَا هِیَ بَیْضَآءُ لِلنّٰظِرِیْنَ ۟۠

మరియు ఆయన తన చేతిని తెల్లగా లేకుండా ఉన్న స్థితిలో తన జేబులో దూర్చారు. అప్పుడు ఆయన దాన్ని బొల్లి తెల్లదనం కాకుండా వెలిగిపోతున్న తెల్లదనముతో బయటకు తీశారు. దాన్ని చూసేవారు చూశారు. info
التفاسير:

external-link copy
34 : 26

قَالَ لِلْمَلَاِ حَوْلَهٗۤ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِیْمٌ ۟ۙ

ఫిర్ఔన్ తన చుట్టూ ఉన్న తన జాతి నాయకులతో ఇలా పలికాడు : నిశ్చయంగా ఈ వ్యక్తి మంత్రజాలము తెలిసిన ఒక మంత్రజాలకుడు. info
التفاسير:

external-link copy
35 : 26

یُّرِیْدُ اَنْ یُّخْرِجَكُمْ مِّنْ اَرْضِكُمْ بِسِحْرِهٖ ۖۗ— فَمَاذَا تَاْمُرُوْنَ ۟

ఇతను తన మంత్రజాలముతో మిమ్మల్ని మీ భూమి నుండి వెళ్ళగొట్ట గోరుతున్నాడు. అయితే మేము అతని విషయంలో తీసుకునే చర్య గురించి మీ సలహా ఏమిటి ?. info
التفاسير:

external-link copy
36 : 26

قَالُوْۤا اَرْجِهْ وَاَخَاهُ وَابْعَثْ فِی الْمَدَآىِٕنِ حٰشِرِیْنَ ۟ۙ

వారు అతనికి ఇలా సమాధానమిచ్చారు : అతన్ని,అతని సోదరుడిని ఇద్దరిని శిక్షించటంలో తొందర చేయకుండా గడువు ఇచ్చి మిసర్ పట్టణాలలో మంత్రజాలకులను సమీకరించే వారిని పంపించండి. info
التفاسير:

external-link copy
37 : 26

یَاْتُوْكَ بِكُلِّ سَحَّارٍ عَلِیْمٍ ۟

వారు మంత్రజాలమును తెలిసిన ప్రతీ మంత్రజాలకుడిని నీ వద్దకు తీసుకుని వస్తారు. info
التفاسير:

external-link copy
38 : 26

فَجُمِعَ السَّحَرَةُ لِمِیْقَاتِ یَوْمٍ مَّعْلُوْمٍ ۟ۙ

అప్పుడు ఫిర్ఔన్ మూసాతో పోటీ చేయటానికి తన మంత్రజాలకులను ఒక నిర్ణీత ప్రదేశంలో,నిర్ణీత కాలంలో సమీకరించాడు. info
التفاسير:

external-link copy
39 : 26

وَّقِیْلَ لِلنَّاسِ هَلْ اَنْتُمْ مُّجْتَمِعُوْنَ ۟ۙ

మరియు ప్రజల్లో ఇలా ప్రకటించబడినది : ఏమీ మీరు గెలిచే వాడిని చూడటానికి సమావేశమవుతారా అతడు మూసానా లేదా మంత్రజాలకులా ?. info
التفاسير:
Voordelen van de verzen op deze pagina:
• أخطاء الداعية السابقة والنعم التي عليه لا تعني عدم دعوته لمن أخطأ بحقه أو أنعم عليه.
ధర్మ ప్రచారకుని పూర్వ తప్పిదాలు,అతనిపై చేయబడిన ఉపకారములు తన హక్కు విషయంలో తప్పిదం చేసిన వారిని లేదా తనపై ఉపకారం చేసిన వారికి ధర్మ ప్రచారం చేయటం నుండి ఆపదు. info

• اتخاذ الأسباب للحماية من العدو لا ينافي الإيمان والتوكل على الله.
శతృవు నుండి రక్షణ కొరకు కారకాలను ఏర్పరచుకోవటం విశ్వాసమునకు,అల్లాహ్ పై నమ్మకమునకు విరుద్ధము కాదు. info

• دلالة مخلوقات الله على ربوبيته ووحدانيته.
అల్లాహ్ సృష్టితాల యొక్క సూచన ఆయన దైవత్వముపై,ఆయన ఏకత్వముపై. info

• ضعف الحجة سبب من أسباب ممارسة العنف.
హింసకు కారణం పేలవమైన వాదన ఒకటి. info

• إثارة العامة ضد أهل الدين أسلوب الطغاة.
ధర్మ ప్రజలకు (అహ్లె దీన్) వ్యతిరేకంగా సాధారణ ప్రజలను రెచ్చ గొట్టటం నిరంకుశుల శైలి. info