[1] ఇట్టి ఆజ్ఞలకు చూడండి, మత్తయి - (Mathew), 4:10; లూకా - (Luke) 4:8. ఇంకా ఖుర్ఆన్ లో చూడండి, 19:30, 36 మరియు 3:51.
[1] ఇది క్రైస్తవులలో ఒక తెగ వారి ప్రస్తావన. వారు అల్లాహ్ (సు.తా.), జిబ్రీల్ మరియు 'ఈసా ('అలైహిమ్ స.) ముగ్గురు, దైవాలున్నారు అంటారు. చూడండి, 5:116 మరియు 5:75.
[1] మర్యమ్ తాను అల్లాహ్ తల్లినని ఎన్నడూ అనలేదు. 'ఈసా ('అ.స.) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అల్లాహుతా'ఆలా కుమారుడు గానీ, అల్లాహ్ గానీ కారు. చూడండి, 5:73. [2] మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే 12:109.
[1] చూడండి, 4:171 ఈ ఆయత్ క్రైస్తవులను సంభోదిస్తున్నది.