[1] యూదుల ప్రవక్తలందరూ అల్లాహ్ (సు.తా.)కు విధేయులైన వారే అంటే ముస్లింలే. ఆ ఇస్లాం వైపునకే దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) పిలుస్తున్నారు. ఈ ఇస్లాం ధర్మమే ఆదమ్ ('అ.స.) నుండి ప్రతి ప్రవక్త బోధించిన ధర్మం. ఇక హిందూ ధర్మానికి మూలమైన వేదాలు మరియు భగవద్గీత కూడా ఏకైక పరమేశ్వరునికి అంటే అల్లాహుతా'ఆలాకు మాత్రమే విధేయులై ఉండి, కేవలం ఆయననే ఆరాధించాలని బోధిస్తున్నాయి. ఆ పరమేశ్వరుడు, సంతానం లేదనివాడు అని కూడా వివరిస్తున్నాయి. అంతేగాక పామరులే కల్పిత దైవాలను, సృష్టించబడిన వాటిని ఆరాధిస్తారని కూడా బోధిస్తున్నాయి.
[1] ఈ శిక్షలకు చూడండి, బైబిల్ (Old Testament), నిర్గమకాండం - (Exodus) 21:23-36. [2] పూర్వ గ్రంథ ప్రజలు తమ ధర్మగ్రంథానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అంటే అల్లాహ్ (సు.తా.) శాసనాన్ని అనుసరించటం లేదు. ఎవరైతే అల్లాహుతా'ఆలా శాసనాన్ని అనుసరించరో అలాంటి వారే "జాలిమూన్ - దుర్మార్గులు, ఫాసిఖూన్ - అవిధేయులు (దుష్టులు) మరియు కాఫిరూన్ - సత్యతిరస్కారులు అనబడతారు. అలాంటి వారే అల్లాహుతా'ఆలా ఆగ్రహానికి గురి అయ్యావారు.