Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad

Numéro de la page:close

external-link copy
135 : 4

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُوْنُوْا قَوّٰمِیْنَ بِالْقِسْطِ شُهَدَآءَ لِلّٰهِ وَلَوْ عَلٰۤی اَنْفُسِكُمْ اَوِ الْوَالِدَیْنِ وَالْاَقْرَبِیْنَ ۚ— اِنْ یَّكُنْ غَنِیًّا اَوْ فَقِیْرًا فَاللّٰهُ اَوْلٰی بِهِمَا ۫— فَلَا تَتَّبِعُوا الْهَوٰۤی اَنْ تَعْدِلُوْا ۚ— وَاِنْ تَلْوٗۤا اَوْ تُعْرِضُوْا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًا ۟

ఓ విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్ కొరకే సాక్ష్యమివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకు గానీ, మీ తల్లిదండ్రులకు గానీ, మీ బంధువులకు గానీ, విరుద్ధంగా ఉన్నా సరే. వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే! (మీ కంటే ఎక్కువ) అల్లాహ్ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయకపోవచ్చు.[1] మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును. info

[1] చూడండి, 5:8.

التفاسير:

external-link copy
136 : 4

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَالْكِتٰبِ الَّذِیْ نَزَّلَ عَلٰی رَسُوْلِهٖ وَالْكِتٰبِ الَّذِیْۤ اَنْزَلَ مِنْ قَبْلُ ؕ— وَمَنْ یَّكْفُرْ بِاللّٰهِ وَمَلٰٓىِٕكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ وَالْیَوْمِ الْاٰخِرِ فَقَدْ ضَلَّ ضَلٰلًا بَعِیْدًا ۟

ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి.[1] అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే! info

[1] ఇంతకు పూర్వం అవతరింపజేయబడిన దివ్యగ్రంథాలను విశ్వసించడం అంటే, అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి అవతరింపజేయబడిన, తౌరాత్ మరియు ఇంజీల్ మొదలైన దివ్య గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను అన్నమాట. అంటే అల్లాహుతా'ఆలా తరఫు నుండి అవతరింపజేయబడి ఉన్న విషయాలను విశ్వసించడం. ఈ రోజు కేవలం ఈ దివ్యఖుర్ఆన్ తప్ప ఏ ఇతర దివ్యగ్రంతం కూడా అవతరింపజేయబడిన నిజరూలంలో లేదు. ఎందుకంటే ఆ మతపు ధర్మవేత్తలు కాలక్రమేణా వాటిలో ఎన్నో హెచ్చుతగ్గులు చేస్తూ వచ్చారు. ఉదారహణకు ఇప్పుడు వాడుకలో నున్న బైబిల్ లో ఎన్నో సార్లు మార్పులు చేశారు. ఇప్పుడు వాడుకలో ఉన్న ఆధునిక బైబిల్ లో చివరి మార్పు 1977 క్రీ.శకంలో చేశారు. ఇది (Revised) Authorized KJV అనబడుతుంది. ఇక్కడ సంబోధన, ఇప్పుడు వాడుకలో ఉన్న ఆ దివ్యగ్రంథాలలో ఉన్న సత్యాలను మాత్రమే సూచిస్తునంది. చూడండి, 3:3

التفاسير:

external-link copy
137 : 4

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا ثُمَّ كَفَرُوْا ثُمَّ اٰمَنُوْا ثُمَّ كَفَرُوْا ثُمَّ ازْدَادُوْا كُفْرًا لَّمْ یَكُنِ اللّٰهُ لِیَغْفِرَ لَهُمْ وَلَا لِیَهْدِیَهُمْ سَبِیْلًا ۟ؕ

నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించిన తరువాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, ఆ తరువాత తిరస్కరించి; ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారో! అలాంటి వారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు. మరియు వారికి సన్మార్గం వైపునకు దారి చూపడు! info
التفاسير:

external-link copy
138 : 4

بَشِّرِ الْمُنٰفِقِیْنَ بِاَنَّ لَهُمْ عَذَابًا اَلِیْمَا ۟ۙ

కపట విశ్వాసులకు, నిశ్చయంగా! బాధాకరమైన శిక్ష ఉందని తెలుపు. info
التفاسير:

external-link copy
139 : 4

١لَّذِیْنَ یَتَّخِذُوْنَ الْكٰفِرِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِیْنَ ؕ— اَیَبْتَغُوْنَ عِنْدَهُمُ الْعِزَّةَ فَاِنَّ الْعِزَّةَ لِلّٰهِ جَمِیْعًا ۟ؕ

ఎవరైతే విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను తమ స్నేహితులుగా చేసుకుంటున్నారో! అలాంటి వారు, వారి (అవిశ్వాసుల) నుండి, గౌరవాన్ని పొందగోరు తున్నారా? కానీ నిశ్చయంగా, గౌరవమంతా కేవలం అల్లాహ్ కే చెందినది.[1] info

[1] చూడండి, 35:10 మరియు 63:8.

التفاسير:

external-link copy
140 : 4

وَقَدْ نَزَّلَ عَلَیْكُمْ فِی الْكِتٰبِ اَنْ اِذَا سَمِعْتُمْ اٰیٰتِ اللّٰهِ یُكْفَرُ بِهَا وَیُسْتَهْزَاُ بِهَا فَلَا تَقْعُدُوْا مَعَهُمْ حَتّٰی یَخُوْضُوْا فِیْ حَدِیْثٍ غَیْرِهٖۤ ۖؗ— اِنَّكُمْ اِذًا مِّثْلُهُمْ ؕ— اِنَّ اللّٰهَ جَامِعُ الْمُنٰفِقِیْنَ وَالْكٰفِرِیْنَ فِیْ جَهَنَّمَ جَمِیْعَا ۟ۙ

మరియు వాస్తవానికి, (అల్లాహ్) మీ కొరకు ఈ గ్రంథంలో (ఈ విధమైన ఆజ్ఞ) అవతరింపజేశాడు: "ఒకవేళ మీరు అల్లాహ్ సూక్తులను గురించి తిరస్కారాన్ని మరియు పరిహాసాన్ని వింటే! అలా చేసేవారు, (ఆ సంభాషణ వదలి) ఇతర సంభాషణ ప్రారంభించనంత వరకు మీరు వారితో కలిసి కూర్చోకండి!" అలా చేస్తే నిశ్చయంగా, మీరు కూడా వారిలాంటి వారే! నిశ్చయంగా, అల్లాహ్ కపట విశ్వాసులను మరియు సత్యతిరస్కారులను అందరినీ నరకంలో జమ చేస్తాడు. info
التفاسير: