[1] ముందు వస్తుంది. స్త్రీలకు, పురుషులకు దొరికే భాగంలో సగం ఆస్తి దొరుకుతుందని. దీనికి కారణం స్త్రీలపై ఎవ్వరినీ పెంచే బాధ్యత లేదు. ఆమె పోషణ, రక్షణ బాధ్యత, ఆమె తండ్రి, భర్త, సోదరుని లేక కుమారునిపై ఉంది. చివరకు వీరంతా ఎవ్వరూ లేనపుడు ఇస్లామీయ ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఖుర్ఆన్ చేసిన ఈ పంపకంలో స్త్రీలకు ఎలాంటి అన్యాయం జరుగలేదు. మరొక విషయమేమిటంటే, దగ్గరి బంధువులు అంటే ప్రథమ శ్రేణికి చెందిన బంధువులు. 1. సంతానం, 2. తల్లిదండ్రులు 3. భర్త లేక భార్యలు.
[1] ఇక్కడ ఇతర బంధువులు అంటే వాసత్వానికి హక్కుదారులు కాని వారు. వారికి కూడా కొంత ఇవ్వాలి. ఆస్తిపరుడు తలుచుకుంటే, తన జీవితకాలంలో, తన ఆస్తిలో మూడో భాగం, వీలు ద్వారా అతని ఆస్తికి హక్కుదారులు కాని, ఇతర బంధువులకు గానీ, పేదలకు గానీ, పుణ్యకార్యాలకు గానీ ఇవ్వవచ్చు. మూడో భాగం కంటే, ఎక్కువ వీలు ద్వారా ఇచ్చే హక్కు ఆస్తిపరునికి లేదు. ఆస్తికి హక్కుదారులైన వారికి ఆస్తి ఇవ్వకూడదని వీలు వ్రాసే అధికారం కూడా అతనికి షరీయత్ లో లేదు. మూడవ భాగం ఆస్తి చాలా తక్కువ ఉంటే, ఇతరులకు ఇచ్చే అవసరం లేదు. తన ఆస్తిని పేరు కొరకు ఇతరులకు పంచి, హక్కుదారులైన తన దగ్గరి బంధువులను, పేదరికంలో ముంచటం తగినది కాదు. (ఫత్హ అల్ ఖదీర్).
[1] చిన్నవారైనా పెద్దవారైనా సంతానం అంతా వారసత్వానికి హక్కుదారులు. గర్భంలో ఉన్న సంతానం కూడా వారసత్వానికి హక్కుదారులు. అవిశ్వాసులైన సంతానం వారసత్వానికి హక్కుదారులు కారు. ఆడ మగ సంతానం ఉన్న పక్షంలో తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి 1/6. మిగతా 2/3 సంతానం కొరకు. భార్య లేక భర్త టే వారి హక్కు వారికిచ్చిన తరువాత మిగతాది సంతానం కొరకు. [2] ఒకవేళ ఒకే ఒక్క కుమారుడు ఉంటే, మొత్తం ఆస్తికి వారసుడు అవుతాడు. ఇతర వారసులు, అంటే తల్లి, తండ్రి, భార్య లేక భర్త ఉంటే, వారి హక్కు వారికిచ్చిన తరువాత మిగతా ఆస్తికి అతడు హక్కుదారుడు. మృతునికి ఒకే కుమార్తె ఉంటే, ఆమెకు 1/2 ఆస్తి, తల్లికి 1/6, తండ్రికి 2/6.