[1] చూడండి, 5:8.
[1] ఇంతకు పూర్వం అవతరింపజేయబడిన దివ్యగ్రంథాలను విశ్వసించడం అంటే, అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి అవతరింపజేయబడిన, తౌరాత్ మరియు ఇంజీల్ మొదలైన దివ్య గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను అన్నమాట. అంటే అల్లాహుతా'ఆలా తరఫు నుండి అవతరింపజేయబడి ఉన్న విషయాలను విశ్వసించడం. ఈ రోజు కేవలం ఈ దివ్యఖుర్ఆన్ తప్ప ఏ ఇతర దివ్యగ్రంతం కూడా అవతరింపజేయబడిన నిజరూలంలో లేదు. ఎందుకంటే ఆ మతపు ధర్మవేత్తలు కాలక్రమేణా వాటిలో ఎన్నో హెచ్చుతగ్గులు చేస్తూ వచ్చారు. ఉదారహణకు ఇప్పుడు వాడుకలో నున్న బైబిల్ లో ఎన్నో సార్లు మార్పులు చేశారు. ఇప్పుడు వాడుకలో ఉన్న ఆధునిక బైబిల్ లో చివరి మార్పు 1977 క్రీ.శకంలో చేశారు. ఇది (Revised) Authorized KJV అనబడుతుంది. ఇక్కడ సంబోధన, ఇప్పుడు వాడుకలో ఉన్న ఆ దివ్యగ్రంథాలలో ఉన్న సత్యాలను మాత్రమే సూచిస్తునంది. చూడండి, 3:3
[1] చూడండి, 35:10 మరియు 63:8.