[1] ఖవ్వామూన్ : ఖామా నుండి, అంటే నిలబడు, ఆధారమిచ్చేవారు, బాధ్యులు, అధికారులు, పోషకులు, రక్షకులు, నిర్వాహకులు, వ్యవహారకర్తలు అనే అర్థాలున్నాయి. ఇస్లాంలో స్త్రీల బాధ్యత ప్రతి దశలో పురుషులపై ఉంది. బాల్యం నుండి వివాహమయ్యే వరకు, తండ్రిపై, తరువాత భర్తపై, భర్త లేకుంటే సోదరునిపై, లేక కుమారునిపై, చివరకు దగ్గరి బంధువులు ఎవ్వరూ లేకుంటే, ఇస్లామీయ ప్రభుత్వంపై ఉంటుంది. [2] ఎన్నో 'స'హీ'హ్ హదీస్'ల ప్రకారం, ఒకవేళ స్త్రీ అశ్లీలానికి పాల్పడితేనే, అది కూడా ఆమెకు ఎక్కువ బాధ కలిగించకుండా మెల్లగా మాత్రమే కొట్టాలని బోధింపబడింది. ('స హా సిత్తా, అ'హ్మద్, ఇబ్నె - 'హిబ్బాన్, 'హాకిం, 'అబ్దుల్లాహ్ ఇబ్నె 'అబ్బాస్ ర'ది.'అ. కథనం; బై'హఖి, ఉమ్మె-కుల్ సూ'మ్ ర.'అన్హా కథనం). [3] కబీరున్ (అల్ - కబీర్) : = అల్ 'అ"జీము, The Greatest, The most Magnified, మహానీయుడు, మహత్వం, ప్రభావం గలవాడు, సర్వాధికుడు. చూడండి, 22:62, 31:30, 34:23, 40:12. అల్ - ముతకబ్బిరు : The Incomparably Great, గొప్పవాడు, గొప్పదనానికి సరోవరం, 59:23. ఇవ అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అల్లాహ్ (సు.తా.) మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవాడు, తన పొరుగువాడికి మేలు చేయాలి." ('స'హీ'హ్ బు'ఖారీ, 'స. ముస్లిం). [2] బానిసలను విడిపించటం ఎంతో ఉత్తమమైన కార్యం చూడండి, 9:60 మరియు 2:177. [3] చూడండి, 'స'హీ'హ్ ముస్లిం కితాబుల్ ఈమాన్, బాబె త'హ్రీమ్, 'హదీస్' నం. 91.
[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 522.