Qurani Kərimin mənaca tərcüməsi - Toluğu dilinə tərcümə- Əbdurrahim bin Məhəmməd.

Səhifənin rəqəmi:close

external-link copy
82 : 6

اَلَّذِیْنَ اٰمَنُوْا وَلَمْ یَلْبِسُوْۤا اِیْمَانَهُمْ بِظُلْمٍ اُولٰٓىِٕكَ لَهُمُ الْاَمْنُ وَهُمْ مُّهْتَدُوْنَ ۟۠

ఎవరైతే విశ్వసించి, తమ విశ్వాసాన్ని షిర్క్ తో[1] కలుషితం చేయరో! అలాంటి వారికే శాంతి ఉంది. మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు. info

[1] ఇక్కడ "జుల్మ్ - అంటే షిర్క్ అని అర్థం. చూడండి, 31:13 "నిశ్చయంగా, షిర్క్ (బహుదైవారాధన) గొప్ప దుర్మార్గం." ('స. బు'ఖారీ, తఫ్సీర్ సూరతుల్ - అన్'ఆమ్).

التفاسير:

external-link copy
83 : 6

وَتِلْكَ حُجَّتُنَاۤ اٰتَیْنٰهَاۤ اِبْرٰهِیْمَ عَلٰی قَوْمِهٖ ؕ— نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُ ؕ— اِنَّ رَبَّكَ حَكِیْمٌ عَلِیْمٌ ۟

మరియు ఇదే మా వాదన, దానిని మేము ఇబ్రాహీమ్ కు, తన జాతివారికి వ్యతిరేకంగా ఇచ్చాము. మేము కోరిన వారికి ఉన్నత స్తానాలకు ప్రసాదిస్తాము. నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు (జ్ఞాన సంపన్నుడు). info
التفاسير:

external-link copy
84 : 6

وَوَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَیَعْقُوْبَ ؕ— كُلًّا هَدَیْنَا ۚ— وَنُوْحًا هَدَیْنَا مِنْ قَبْلُ وَمِنْ ذُرِّیَّتِهٖ دَاوٗدَ وَسُلَیْمٰنَ وَاَیُّوْبَ وَیُوْسُفَ وَمُوْسٰی وَهٰرُوْنَ ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟ۙ

మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించాము[1]. ప్రతి ఒక్కరికీ సన్మార్గం చూపాము. అంతకు పూర్వం నూహ్ కు సన్మార్గం చూపాము. మరియు అతని సంతతిలోని వారైన దావూద్, సులైమాన్, అయ్యాబ్, యూసుఫ్, మూసా మరియు హారూన్ లకు మేము (సన్మార్గం చూపాము). మరియు ఈ విధంగా మేము సజ్జనులకు తగిన ప్రతిఫలమిస్తాము. info

[1] చూడండి, 11:71.

التفاسير:

external-link copy
85 : 6

وَزَكَرِیَّا وَیَحْیٰی وَعِیْسٰی وَاِلْیَاسَ ؕ— كُلٌّ مِّنَ الصّٰلِحِیْنَ ۟ۙ

మరియు జకరియ్యా, యహ్యా, ఈసా మరియు ఇల్యాస్ లకు[1] కూడా (సన్మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కరూ సద్వర్తనులే! info

[1] చూడండి, 37:123. ఇల్యాస్ (Elijah) ('అ.స.), హారూన్ ('అ.స.) సంతతికి చెందిన వారు. అతని నివాసం బఅల్బక్ నగరం. ఇల్యాస్ (ఏలియా) హిబ్రూ (యూదుల) ప్రవక్త. ఇతను ఫలస్తీన్ ఉత్తర భాగంలో అహబ్ మరియు అహాజియా రాజుల కాలంలో ఉన్నారు, (దాదాపు 9వ క్రీ. శకానికి ముందు). ఇతని తరువాత అల్-యస'అ (Elisha, 'అ.స.) ప్రవక్తగా వచ్చారు.

التفاسير:

external-link copy
86 : 6

وَاِسْمٰعِیْلَ وَالْیَسَعَ وَیُوْنُسَ وَلُوْطًا ؕ— وَكُلًّا فَضَّلْنَا عَلَی الْعٰلَمِیْنَ ۟ۙ

మరియు ఇస్మాయీల్, అల్ యసఅ, యూనుస్ మరియు లూత్ లకు[1] కూడా (సన్మార్గం చూపాము). ప్రతి ఒక్కరికీ (వారి కాలపు) సర్వ లోకాల వాసులపై ఘనతను ప్రసాదించాము. info

[1] లూ'త్ ('అ.స.) ఇబ్రాహీమ్ ('అ.స.) సోదరుడైన హారాన బిన్-ఆజర్ కుమారుడు. ఇబ్రాహీమ్ ('అ.స.), లూ'త్ ('అ.స.) యొక్క చిన్నాన్న. కాని అతను కూడా ఇబ్రాహీమం ('అ.స.) యొక్క సంతతిలోని వారిగా పరిణింపబడ్డారు. ఖుర్ఆన్ లో ఇటువంటి ఉదాహరణ మరొకటి ఉంది. ఇస్మా'యీల్ ('అ.స.) య'అఖూబ్ ('అ.స.) యొక్క తండ్రిగా పరిగణింపబడ్డారు. వాస్తవానికి అతను, య'అఖూబ్ ('అ.స.) యొక్క పెద్ద నాన్న (Uncle). ఇంకా చూడండి, 2:133.

التفاسير:

external-link copy
87 : 6

وَمِنْ اٰبَآىِٕهِمْ وَذُرِّیّٰتِهِمْ وَاِخْوَانِهِمْ ۚ— وَاجْتَبَیْنٰهُمْ وَهَدَیْنٰهُمْ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟

మరియు వారిలో నుండి కొందరి తండ్రి తాతలకు, వారి సంతానానికి మరియు వారి సోదరులకు కూడా మేము (సన్మార్గం చూపాము). మేము వారిని (మా సేవ కొరకు) ఎన్నుకొని, వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము. info
التفاسير:

external-link copy
88 : 6

ذٰلِكَ هُدَی اللّٰهِ یَهْدِیْ بِهٖ مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ؕ— وَلَوْ اَشْرَكُوْا لَحَبِطَ عَنْهُمْ مَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟

ఇదే అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాన్నీ వృథా అయి పోయేవి![1] info

[1] ఇక్కడ అల్లాహ్ (సు.తా.), 18 మంది ప్రవక్తలను పేర్కొని: "వారు షిర్క్ చేసి ఉంటే వారి సత్కార్యాలు వృథా అయి పోయేవి." అని అన్నాడు. ఇదే విధంగా అల్లాహుతా'ఆలా ము'హమ్మద్ ('స'అస) ను సంబోధించి అన్నదానికి చూడండి, 39:65.

التفاسير:

external-link copy
89 : 6

اُولٰٓىِٕكَ الَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ۚ— فَاِنْ یَّكْفُرْ بِهَا هٰۤؤُلَآءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًا لَّیْسُوْا بِهَا بِكٰفِرِیْنَ ۟

వీరే, మేము గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన వారు. కాని వారు దీనిని (ఈ గ్రంథాన్ని/ప్రవక్త పదవిని) తిరస్కరించి నందుకు! వాస్తవానికి మేము, దీనిని ఎన్నడూ తిరస్కరించని ఇతర ప్రజలను దీనికి కార్యకర్తలుగా నియమించాము[1]. info

[1] ఈ కార్యకర్తలు అంటే దైవప్రవక్త ('స'అస) యొక్క అనుచరు(ర'ది.'అన్హుమ్)లు మరియు తరువాత వచ్చే విశ్వాసులు అని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు.

التفاسير:

external-link copy
90 : 6

اُولٰٓىِٕكَ الَّذِیْنَ هَدَی اللّٰهُ فَبِهُدٰىهُمُ اقْتَدِهْ ؕ— قُلْ لَّاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ اَجْرًا ؕ— اِنْ هُوَ اِلَّا ذِكْرٰی لِلْعٰلَمِیْنَ ۟۠

ఇలాంటి వారే అల్లాహ్ మార్గదర్శకత్వం పొందినవారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు. వారితో ఇలా అను: "నేను దీనికి బదులుగా మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగను. ఇది కేవలం సర్వ లోకాల (వారి) కొరకు ఒక హితోపదేశం మాత్రమే." info
التفاسير: