[1] యూదులు 'ఉజైర్ ('అ.స.)ను మరియు క్రైస్తవులు 'ఈసా ('అ.స.)ను అల్లాహ్; లేక అల్లాహుతా'ఆలా కుమారులు అంటారు. మరియు యూదులు తమను తాము అల్లాహుతా'ఆలా సంతానంగా చెప్పుకుంటారు. ఈ ఆయత్ వారి ఈ వాదాన్ని ఖండిస్తోంది.
[1] ఉదాహరణకు సులైమాన్ ('అ.స.) ప్రవక్త మరియు సార్వభౌముడు (రాజు) కూడా, దీనితో విశదమయ్యేదేమిటంటే అల్లాహ్ (సు.తా.) యే రాజులను కూడా ఎన్నుకుంటాడు.
[1] ఆ ఇద్దరు వ్యక్తులు యూషా బిన్-నూన్ మరియు కాలిబ్ బిన్-యూ'హన్నా (Joshua & Caleb). వీరు కానన్ ను పరిశీలించటానికి ఎన్నుకోబడిన పన్నెండు మందిలో నుండి ఇద్దరు.