Bản dịch ý nghĩa nội dung Qur'an - 泰卢固语翻译 - 阿卜杜·拉西姆·本·穆罕默德

Số trang:close

external-link copy
74 : 7

وَاذْكُرُوْۤا اِذْ جَعَلَكُمْ خُلَفَآءَ مِنْ بَعْدِ عَادٍ وَّبَوَّاَكُمْ فِی الْاَرْضِ تَتَّخِذُوْنَ مِنْ سُهُوْلِهَا قُصُوْرًا وَّتَنْحِتُوْنَ الْجِبَالَ بُیُوْتًا ۚ— فَاذْكُرُوْۤا اٰلَآءَ اللّٰهِ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟

"మరియు ఆయన, ఆద్ జాతి వారి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి మిమ్మల్ని భూమిపై స్థిరపరచిన విషయం జ్ఞాపకం చేసుకోండి. మీరు దాని మైదానాలలో కోటలను నిర్మించుకున్నారు. మరియు కొండలను తొలచి గృహాలను నిర్మించుకుంటున్నారు. కావున అల్లాహ్ అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు భూమిపై అనర్థాన్ని, కల్లోల్లాన్ని రేకెత్తించకండి!" అని అన్నాడు. info
التفاسير:

external-link copy
75 : 7

قَالَ الْمَلَاُ الَّذِیْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لِلَّذِیْنَ اسْتُضْعِفُوْا لِمَنْ اٰمَنَ مِنْهُمْ اَتَعْلَمُوْنَ اَنَّ صٰلِحًا مُّرْسَلٌ مِّنْ رَّبِّهٖ ؕ— قَالُوْۤا اِنَّا بِمَاۤ اُرْسِلَ بِهٖ مُؤْمِنُوْنَ ۟

(సాలిహ్) జాతి వారిలోని అహంకారులైన నాయకులు విశ్వసించిన బలహీనవర్గం వారితో అన్నారు: "సాలిహ్ తన ప్రభువు పంపిన ప్రవక్త అని మీకు నిశ్చయంగా తెలుసా? దానికి వారు: "మేము నిశ్చయంగా, అతని ద్వారా పంపబడిన సందేశాన్ని విశ్వసిస్తున్నాము." అని జవాబిచ్చారు. info
التفاسير:

external-link copy
76 : 7

قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا بِالَّذِیْۤ اٰمَنْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟

ఆ అహంకారులన్నారు: "మీరు విశ్వసించిన దానిని మేము నిశ్చయంగా తిరస్కరిస్తున్నాము!" info
التفاسير:

external-link copy
77 : 7

فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ اَمْرِ رَبِّهِمْ وَقَالُوْا یٰصٰلِحُ ائْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الْمُرْسَلِیْنَ ۟

ఆ తరువాత వారు ఆ ఆడఒంటె వెనుక కాలి మోకాలి పెద్దనరం కోసి (చంపి), తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, అతనితో అన్నారు: "ఓ సాలిహ్! నీవు నిజంగానే సందేశహరుడవైతే నీవు మమ్మల్ని బెదిరించే, ఆ శిక్షను తీసుకురా!" info
التفاسير:

external-link copy
78 : 7

فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِیْنَ ۟

అప్పుడు వారిని భూకంపం పట్టుకున్నది[1]. వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలుగా మారి) పడిపోయారు. info

[1] ఇక్కడ రజ్ ఫతున్: భూకంపం, అని ఉంది. మరొకచోట 54:31లో 'సై'హతున్: భయంకర అరుపు (ధ్వని), అని వ్రాయబడి ఉంది. బహశా ఈ రెండు ఒకేసారి వచ్చి ఉంటాయి.

التفاسير:

external-link copy
79 : 7

فَتَوَلّٰی عَنْهُمْ وَقَالَ یٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّیْ وَنَصَحْتُ لَكُمْ وَلٰكِنْ لَّا تُحِبُّوْنَ النّٰصِحِیْنَ ۟

పిదప అతను (సాలిహ్) వారి నుండి తిరిగి పోతూ అన్నాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా, నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. మరియు మీకు మంచి సలహాలను ఇచ్చాను, కానీ మీరు మంచి సలహాలు ఇచ్చే వారంటే ఇష్టపడలేదు!" info
التفاسير:

external-link copy
80 : 7

وَلُوْطًا اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَتَاْتُوْنَ الْفَاحِشَةَ مَا سَبَقَكُمْ بِهَا مِنْ اَحَدٍ مِّنَ الْعٰلَمِیْنَ ۟

ఇక లూత్![1] అతను తన జాతి వారితో: "ఏమీ? మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా?" అని అడిగిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి. info

[1] లూ'త్ ('అ.స.), ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క సోదరుని కుమారులు. అతని వృత్తాంతం, 11:69-83లలో వివరంగా ఉంది. ఇతను ఇబ్రాహీమ్('అ.స.) ను విశ్వసించారు. ఈయన నివసించిన నగరం, ''సోడోమ్, జోర్డన్ మరియు బైతుల్ మఖ్దిస్ మధ్య మృత సముద్రం ప్రాంతంలో ఉంది. ఇతని జాతివారు చరిత్రలో మొదటిసారి పురుషులు-పురుషులతో లైంగిక క్రియ (Sodomy) చేయసాగారు. స్త్రీలను, వదలి, పురుషులు-పురుషులతో తమ కామఇచ్ఛను పూర్తి చేసుకొనేవారు. ఇది మహాపాపం. కాని ఈ రోజు కొన్ని పశ్చిమ దేశాలలో ఇది నేరమూ కాదు, పాపమూ కాదు. ఇది వారి దగ్గర చట్టరీత్యా ఆమోదించబడింది. షరీయత్ లలో దీని శిక్ష వ్యభిచారానికి ఇవ్వ వలసిన శిక్షయే!

التفاسير:

external-link copy
81 : 7

اِنَّكُمْ لَتَاْتُوْنَ الرِّجَالَ شَهْوَةً مِّنْ دُوْنِ النِّسَآءِ ؕ— بَلْ اَنْتُمْ قَوْمٌ مُّسْرِفُوْنَ ۟

"వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. info
التفاسير: