[1] ఈ సమావేశాలు ధర్మసమావేశాలు జుమ'అహ్ లేక ఇతర సమావేశాలు కావచ్చు! మొదట వచ్చినవారు విడివిడిగా దూరం దూరంగా కూర్చుంటే తరువాత వచ్చే వారికి చోటు దొరుకుతుంది. దైవప్రవక్త ప్రవచనం: 'ఏ వ్యక్తికి కూడా మరొక వ్యక్తిని అతని చోటు నుండి లేపి కూర్చోవటం సభ్యత కాదు. కావున మీరు సమావేశంలో కూర్చున్నప్పుడు దూరం దూరంగా కూర్చోండి.' ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం)
[2] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: ఒక భక్తిపరుని ('ఆబిద్)పై ఒక జ్ఞానవంతుని ('ఆలిమ్) యొక్క ఆధిక్యత పూర్ణిమ రాత్రిలో, నక్షత్రాలపై చంద్రునికి ఉండే ఆధిక్యత వంటిది. (ఇబ్నె-'హంబల్, అబూ-దావూద్, తిర్మిజీ', నసాయీ', ఇబ్నె-మాజా. మరియు దారిమీ.