[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'కాలం, అనేది మానవుని జ్ఞానపరిధికి మించినది, కాని దానిని అల్లాహ్ (సు.తా.) సృష్టించాడు.'
[2] ప్రతి వస్తువు చివరకు అల్లాహ్ (సు.తా.) వద్దకు మాత్రమే చేరుతుంది. ఎందుకంటే ఆయన (సు.తా.) ప్రతిదానికి మూలం. ఆయన ప్రతిదానికి - మరే ఇతర దానికంటే - తన జ్ఞానపరంగా సమీపంలో ఉన్నాడు.
అల్-అవ్వలు: The First, ప్రథముడు, మొట్ట మొదట వాడు, ఆద్యుడు, సర్వసృష్టిరాసుల సృష్టికి పూర్వమే ఉన్నవాడు.
అల్-ఆఖరు: The Last, The End. అంతం, కడపటి, చివరికి మిగిలే వాడు, సర్వసృష్టిరాసుల వినాశం తరువాత కూడా ఉండేవాడు.
అజ్-'జాహిరు: The Ascendant or Predominant, over all things, The Outward. ప్రత్యక్షుడు, గోచరుడు, బాహ్యం.
అల్-బాతిను: He who knows the secret and hidden things. He who is veiled from the eyes and imaginations of created beings. పరోక్షకుడు, అగోచరుడు, దృష్టికి గోచరించని, గోప్యమైన, మరగైనవాడు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.