Bản dịch ý nghĩa nội dung Qur'an - 泰卢固语翻译 - 阿卜杜·拉西姆·本·穆罕默德

Số trang:close

external-link copy
32 : 39

فَمَنْ اَظْلَمُ مِمَّنْ كَذَبَ عَلَی اللّٰهِ وَكَذَّبَ بِالصِّدْقِ اِذْ جَآءَهٗ ؕ— اَلَیْسَ فِیْ جَهَنَّمَ مَثْوًی لِّلْكٰفِرِیْنَ ۟

ఇక అల్లాహ్ ను గురించి అసత్యం కల్పించి, సత్యం తన ముందుకు వచ్చినప్పుడు దానిని తిరస్కరించే వాని కంటే పరమ దుర్మార్గుడెవడు? అందుకే! సత్యతిరస్కారులకు కేవలం నరకంలోనే కదా నివాసం ఉండేది? info
التفاسير:

external-link copy
33 : 39

وَالَّذِیْ جَآءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهٖۤ اُولٰٓىِٕكَ هُمُ الْمُتَّقُوْنَ ۟

మరియు సత్యాన్ని తెచ్చినవాడూ మరియు దానిని హృదయపూర్వకంగా నమ్మిన వాడూ, ఇలాంటి వారే దైవభీతి గలవారు. info
التفاسير:

external-link copy
34 : 39

لَهُمْ مَّا یَشَآءُوْنَ عِنْدَ رَبِّهِمْ ؕ— ذٰلِكَ جَزٰٓؤُا الْمُحْسِنِیْنَ ۟ۚۖ

వారికి తమ ప్రభువు వద్ద వారు కోరిందంతా లభిస్తుంది. ఇదే సజ్జనులకు దొరికే ప్రతిఫలం.[1] info

[1] చూము'హ్ సినీన్: దీనికి సజ్జనులు, పుణ్యవంతులు, సత్పురుషులు మొదలైన అర్థాలున్నాయి. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం : 'మీరు అల్లాహ్ (సు.తా.) ను ఆరాధించేటప్పుడు మీరు ఆయన (సు.తా.)ను చూస్తున్నారని భావించండి. అది సాధ్యం కాకపోతే కనీసం ఆయన (సు.తా.) మిమ్మల్ని చూస్తున్నాడని భావించండి. (అన్ త'అబుదల్లాహ్ క అన్నక తరాహు; ఫ ఇన్ లమ్ తకున్ తరాహు, ఫ ఇన్నహు యరాక'.

التفاسير:

external-link copy
35 : 39

لِیُكَفِّرَ اللّٰهُ عَنْهُمْ اَسْوَاَ الَّذِیْ عَمِلُوْا وَیَجْزِیَهُمْ اَجْرَهُمْ بِاَحْسَنِ الَّذِیْ كَانُوْا یَعْمَلُوْنَ ۟

దానికి బదులుగా అల్లాహ్, వారు చేసిన ఘోర పాపకార్యాలను రద్దు చేయటానికి మరియు వారు చేస్తూ వచ్చిన మంచి పనులకు అత్యుత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి! info
التفاسير:

external-link copy
36 : 39

اَلَیْسَ اللّٰهُ بِكَافٍ عَبْدَهٗ ؕ— وَیُخَوِّفُوْنَكَ بِالَّذِیْنَ مِنْ دُوْنِهٖ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟ۚ

ఏమిటి? అల్లాహ్ తన దాసునికి చాలడా? అయినా వారు ఆయన (అల్లాహ్) ను విడిచి, ఇతరులను గురించి నిన్ను భయపెడు తున్నారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు. info
التفاسير:

external-link copy
37 : 39

وَمَنْ یَّهْدِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّضِلٍّ ؕ— اَلَیْسَ اللّٰهُ بِعَزِیْزٍ ذِی انْتِقَامٍ ۟

మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వానిని, మార్గభ్రష్టుడు చేయగల వాడెవ్వడూ లేడు! ఏమీ? అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం చేయగలవాడు కాడా? info
التفاسير:

external-link copy
38 : 39

وَلَىِٕنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَیَقُوْلُنَّ اللّٰهُ ؕ— قُلْ اَفَرَءَیْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اِنْ اَرَادَنِیَ اللّٰهُ بِضُرٍّ هَلْ هُنَّ كٰشِفٰتُ ضُرِّهٖۤ اَوْ اَرَادَنِیْ بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكٰتُ رَحْمَتِهٖ ؕ— قُلْ حَسْبِیَ اللّٰهُ ؕ— عَلَیْهِ یَتَوَكَّلُ الْمُتَوَكِّلُوْنَ ۟

మరియు ఒకవేళ నీవు వారితో: "భూమ్యాకాశాలను సృష్టించింది ఎవరు?" అని అడిగితే, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. [1] వారిని ఇలా అడుగు: "ఏమీ? మీరు ఆలోచించరా? అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవి - అల్లాహ్ నాకు కీడు చేయదలచుకుంటే - ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక, ఆయన (అల్లాహ్) నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?" వారితో ఇంకా ఇలా అను: "నాకు కేవలం అల్లాహ్ చాలు! ఆయన (అల్లాహ్) ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మక ముంచుకుంటారు." info

[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 31:25.

التفاسير:

external-link copy
39 : 39

قُلْ یٰقَوْمِ اعْمَلُوْا عَلٰی مَكَانَتِكُمْ اِنِّیْ عَامِلٌ ۚ— فَسَوْفَ تَعْلَمُوْنَ ۟ۙ

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "ఓ నా జాతి ప్రజలారా! మీరు మీ ఇష్టప్రకారం మీ పని చేస్తూ ఉండండి; నిశ్చయంగా, నేనూ నా పని చేస్తూ ఉంటాను. తరువాత మీరు తెలుసుకోగలరు; info
التفاسير:

external-link copy
40 : 39

مَنْ یَّاْتِیْهِ عَذَابٌ یُّخْزِیْهِ وَیَحِلُّ عَلَیْهِ عَذَابٌ مُّقِیْمٌ ۟

(ఇహలోకంలో) ఎవరి మీద అవమానకరమైన శిక్ష వచ్చిపడుతుందో మరియు (పరలోక జీవితంలో) ఎవరి మీద శాశ్వతమైన శిక్ష పడనున్నదో!" info
التفاسير: