Bản dịch ý nghĩa nội dung Qur'an - 泰卢固语翻译 - 阿卜杜·拉西姆·本·穆罕默德

external-link copy
39 : 19

وَاَنْذِرْهُمْ یَوْمَ الْحَسْرَةِ اِذْ قُضِیَ الْاَمْرُ ۘ— وَهُمْ فِیْ غَفْلَةٍ وَّهُمْ لَا یُؤْمِنُوْنَ ۟

మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని[1] గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించ బడి ఉంటుంది.[2] (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు. info

[1] యౌమల్-'హస్ రతి: పశ్చాత్తాప పడే దినం అంటే పునరుత్థాన దినము. [2] పునరుత్థాన దినమున స్వర్గానికి అర్హులైన వారిని స్వర్గానికి మరియు నరకానికి అర్హులైన వారిని నరకానికి పంపిన తరువాత మరణం ఒక గొర్రె ఆకారంలో తేబడుతుంది. దానిని స్వర్గనరకాల మధ్య నిలబెట్టబడి, స్వర్గ-నరక వాసులతో: 'దీనిని ఎరుగుదురా?' అని ప్రశ్నించగా వారు: 'అవును, ఇది మరణం.' అని అంటారు. వారి సమక్షంలో అది వధింపబడుతుంది. అప్పుడు స్వర్గవాసులతో ఇలా అనబడుతుంది: 'స్వర్గవాసులారా! మీ కొరకు స్వర్గజీవితం కలకాలం ఉంటుంది.' మరియు నరకవాసులతో అనబడుతుంది: 'మీకు ఈ నరకశిక్ష ఎల్లప్పుడూ ఉంటుంది.' మరియు మీ కెవ్వరికీ ఇక చావురాదు. ('స'హీ'హ్ బు'ఖారీ).

التفاسير: