Bản dịch ý nghĩa nội dung Qur'an - 泰卢固语翻译 - 阿卜杜·拉西姆·本·穆罕默德

Số trang:close

external-link copy
26 : 10

لِلَّذِیْنَ اَحْسَنُوا الْحُسْنٰی وَزِیَادَةٌ ؕ— وَلَا یَرْهَقُ وُجُوْهَهُمْ قَتَرٌ وَّلَا ذِلَّةٌ ؕ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَنَّةِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟

మంచిపనులు చేసిన వారికి, మంచి ఫలితం దొరుకుతుంది. మరియు ఇంకా ఎక్కువ లభిస్తుంది.[1] మరియు వారి ముఖాలు నల్లబడవు మరియు వారికి అవమానమూ జరుగదు. అలాంటి వారు స్వర్గవాసులు. వారందు శాశ్వతంగా ఉంటారు. info

[1] చూడండి, 6:160 మరియు 27:89.

التفاسير:

external-link copy
27 : 10

وَالَّذِیْنَ كَسَبُوا السَّیِّاٰتِ جَزَآءُ سَیِّئَةٍ بِمِثْلِهَا ۙ— وَتَرْهَقُهُمْ ذِلَّةٌ ؕ— مَا لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍ ۚ— كَاَنَّمَاۤ اُغْشِیَتْ وُجُوْهُهُمْ قِطَعًا مِّنَ الَّیْلِ مُظْلِمًا ؕ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟

మరియు పాపకార్యాలు చేసిన వారికి, వారి పాపాలకు తగినట్టి ప్రతిఫలం లభిస్తుంది మరియు వారిని అవమానం క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని రక్షించేవాడెవ్వడూ ఉండడు. వారి ముఖాలు చీకటి రాత్రి యొక్క నల్లని తెరల వంటి వాటితో కప్పబడి ఉంటాయి.[1] అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. info

[1] చూడండి, 3:106 మరియు 80:38-41.

التفاسير:

external-link copy
28 : 10

وَیَوْمَ نَحْشُرُهُمْ جَمِیْعًا ثُمَّ نَقُوْلُ لِلَّذِیْنَ اَشْرَكُوْا مَكَانَكُمْ اَنْتُمْ وَشُرَكَآؤُكُمْ ۚ— فَزَیَّلْنَا بَیْنَهُمْ وَقَالَ شُرَكَآؤُهُمْ مَّا كُنْتُمْ اِیَّانَا تَعْبُدُوْنَ ۟

మరియు మేము వారందరినీ సమావేశపరచిన రోజు,[1] సాటి కల్పించిన (షిర్కు చేసిన) వారితో ఇలా అంటాము: "మీరునూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించిన వారునూ, మీ స్థానాలలోనే ఆగండి!" ఆ పిదప మేము వారిని వేరు చేస్తాము.[2] వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించినవారు (వారి దైవాలు) ఇలా అంటారు: "మీరు ఆరాధిస్తూ ఉండేది మమ్మల్ని కాదు;[3] info

[1] చూడండి, 18:47. [2] చూడండి, 36:59 మరియు 30:43. [3] చూడండి, 34:41.

التفاسير:

external-link copy
29 : 10

فَكَفٰی بِاللّٰهِ شَهِیْدًا بَیْنَنَا وَبَیْنَكُمْ اِنْ كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغٰفِلِیْنَ ۟

ఇక మీకూ మరియు మాకూ మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. నిశ్చయంగా, మీరు (చేస్తూ వున్న) ఆరాధన గురించి మాకు ఏ మాత్రం తెలియదు!"[1] info

[1] చూడండి, 46:5-6 ఇక్కడ విశదపరచబడుతున్నది ఏమిటంటే, ఏ సాధూ సన్యాసులను, దర్గాలను, వలీలను, ప్రవక్తలను వీరు ఆరాధించేవారో వారు: "మాకు వీరితో ఎలాంటి సంబంధం లేదు, వీరి ఆరాధన గురించి మాకు ఏమీ తెలియదు." అంటారు. ఇంకా చూడండి, 5:116-117, 10:30, 11:21, 16:87 మరియు 28:75.

التفاسير:

external-link copy
30 : 10

هُنَالِكَ تَبْلُوْا كُلُّ نَفْسٍ مَّاۤ اَسْلَفَتْ وَرُدُّوْۤا اِلَی اللّٰهِ مَوْلٰىهُمُ الْحَقِّ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟۠

అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న (బూటకదైవాలన్నీ) వారిని వీడి పోతాయి.[1] info

[1] అంటే వారికి అక్కడ అల్లాహ్ (సు.తా.) తప్ప వారి ఏ కల్పిత దైవం కూడా పనికి రాదు.

التفاسير:

external-link copy
31 : 10

قُلْ مَنْ یَّرْزُقُكُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ اَمَّنْ یَّمْلِكُ السَّمْعَ وَالْاَبْصَارَ وَمَنْ یُّخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَیُخْرِجُ الْمَیِّتَ مِنَ الْحَیِّ وَمَنْ یُّدَبِّرُ الْاَمْرَ ؕ— فَسَیَقُوْلُوْنَ اللّٰهُ ۚ— فَقُلْ اَفَلَا تَتَّقُوْنَ ۟

వారిని అడుగు: "ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?" info
التفاسير:

external-link copy
32 : 10

فَذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمُ الْحَقُّ ۚ— فَمَاذَا بَعْدَ الْحَقِّ اِلَّا الضَّلٰلُ ۚ— فَاَنّٰی تُصْرَفُوْنَ ۟

ఆయనే అల్లాహ్! మీ నిజమైన ప్రభువు. అయితే సత్యం తరువాత, మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి? అయితే మీరు ఎందుకు (సత్యం నుండి) తప్పించబడుతున్నారు? info
التفاسير:

external-link copy
33 : 10

كَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَی الَّذِیْنَ فَسَقُوْۤا اَنَّهُمْ لَا یُؤْمِنُوْنَ ۟

ఈ విధంగా దుష్టులైన వారి విషయంలో వారెన్నడూ విశ్వసించరని, నీ ప్రభువు అన్న మాట నిజమయింది.[1] info

[1] చూడండి, 39:71.

التفاسير: